మధ్య భారతదేశ చరిత్ర – రాష్ట్రకూటులు

*** రాష్ట్రకూటులు***

 రాష్ట్రకూటులు

  • వీరు దక్కన్‌లో మధ్యయుగ ప్రారంభంలో బాదామి చాళుక్యుల సామంతులుగా ఉంటూ స్వతంత్ర, సుస్థిర రాజ్యాన్ని స్థాపించి, ఉత్తర భారతదేశానికి చెందిన ప్రతీహార, పరమార, పాల వంశీయులతోను, దక్షిణ భారతదేశానికి చెందిన పల్లవ, చోళ, వేంగి చాళుక్యులతో యుద్ధాలు చేశారు. వీరి శాసనాల ప్రకారం వీరు యాదవరాజైన సాత్యకి వంశస్థులుగా పేర్కొనబడ్డారు, కానీ చాళుక్యుల కాలంనాటి శాసనాలు వీరిని కుటుంబినులుగా పేర్కొన్నాయి, కుటుంబినులు అనగా వ్యవసాయ ఆధారమైన ఒక వర్గం అని అర్థం.

 మూలపురుషుడు:    ఇంద్రవర్మ

 రాజ్యస్థాపకుడు:.    దంతిదుర్గుడు

 రాజధాని:.    ఎల్లోరా, మాన్యఖేట

 రాజచిహ్నం:.     గరుఢ

 రాజభాష:.    సంస్కృతం

 గొప్పవాడు:.    అమోఘవర్షుడు

 చివరివాడు:.   రెండవ కర్కరాజు

 శిల్పకళ: కైలాసనాథ దేవాలయం, దశావతార గుహాలయం

 విదేశీ యాత్రికులు:

 సులేమాన్ (అమోఘవర్షుడి కాలంలో)

 ఆల్మసూది (ఇంద్ర-3 కాలంలో)

—

రాజకీయ చరిత్ర

దంతిదుర్గుడు (క్రీ.శ.752-56):

  • ఇతను పశ్చిమ లేదా బాదామి చాళుక్యరాజు రెండవ విక్రమాదిత్యునికి సామంతుడుగా ఉంటూ, చాళుక్యుల తరపున అరబ్బులను ఓడించాడు.
  • బాదామి చాళుక్యులలో చివరిరాజైన 2వ కీర్తివర్మను ఓడించి రాజ్యస్థాపన చేసి పృథ్వీవల్లభ, ఖడ్గావలోక అనే బిరుదులు పొందాడు.
  • ఇతను ఎల్లోరాను రాజధానిగా చేసుకొని పాలించడమే కాక ఎల్లోరాలో దశావతార గుహాలయంను నిర్మించాడు. దశావతార ఆలయ శిల్పాలన్నింటిలో అతి ప్రసిద్ధమైనది హిరణ్యకశిపున్ని వధిస్తున్న నరసింహ విగ్రహం.
  • ఇతను మాళ్వాపై దండెత్తి, దాని రాజధాని అయిన ఉజ్జయినిలో హిరణ్యగర్భ యాగం చేశాడు.
  • ఇతని విజయాలను గురించి సమంగఢ్ శాసనం, ఎల్లోరాలోని దశావతార గుహాలయ శాసనం పేర్కొంటున్నాయి.
  • ఇతని కుమార్తె రేవతి (రేవతీదేవి)ను పల్లవరాజు నందివర్మకు ఇచ్చి వివాహం చేశారు.
  • మాళ్వా, కోసల, కళింగ పాలకులను జయించి క్రీ.శ 750లో దక్షిణ, మధ్య గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు అధిపతి అయ్యాడు.

మొదటి కృష్ణుడు (756-775):

  • ఇతని కాలంలోనే ఎల్లోరా వద్ద కైలాసనాథ గుహాలయం నిర్మాణం మొదలైంది.
  • ఈ దేవాలయ నిర్మాణం దాదాపు 100 సం॥లు కొనసాగింది.
  • ఇది ప్రపంచంలోనే అత్యంత గొప్ప గుహాలయంగా గుర్తింపు పొందింది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఎలిఫెంటా ఆలయంను నిర్మించాడు.

రెండవ గోవిందుడు (775-780):

  • ఇతనిపై ఇతని తమ్ముడు ధృవుడు తిరుగుబాటు చేసినాడు.

ధృవుడు (780-794):

  • ఇతను రాష్ట్రకూట రాజులలో మొదటి గొప్పవాడు.
  • ఇతనికి నిరుపమ కవివల్లభ, శ్రీ వల్లభ, ధారవర్ష అనే బిరుదులు కలవు.
  • ఇతని కాలంలోనే ఉత్తర భారతదేశ సార్వభౌమాధికార చిహ్నమైన కనౌజ్ పై ఆధిపత్యపు పోరు ప్రారంభమైంది.
  • కనౌజ్ పై ఆధిపత్యం కోసం జరిగిన త్రైపాక్షిక పోరాటంలో పాల, ప్రతీహార రాజులను ఓడించి రాష్ట్రకూట చిహ్నంపై గంగా-యమున తోరణాన్ని చేర్చిన రాష్ట్రకూట రాజుగా ధృవుడు కీర్తించబడ్డాడు. గూర్జర అధిపతి అయిన వత్సరాజును ఓడించాడు.

మూడవ గోవిందుడు (క్రీ.శ.794-814):

  • ఇతని బిరుదులు : రాజాధిరాజ, రాజపరమేశ్వర, ప్రభూతవర్ష, జనవల్లభ, కీర్తినారాయణ & జగత్తుంగి.
  • ఇతనిపై తిరుగుబాటు చేసిన తన సోదరుడైన స్తంభుడిని ఓడించాడు.
  • ఇతను పల్లవ, పాండ్య, కేరళ, పశ్చిమ గాంగరాజుల కూటమిని ఓడించి రాష్ట్రకూటుల పేరుప్రతిష్టలు అత్యున్నత స్థితికి చేర్చాడు. ఇతని సోదరుడు అయిన ‘కంబ’ను గంగావాడిపై రాజప్రతినిధిగా నియమించాడు.
  • ఇతని చేతిలో ప్రతీహార రాజు-నాగభటుడు, పాలవంశరాజు-ధర్మపాలుడు, తూర్పు చాళుక్యరాజు-రెండవ విజయాదిత్యుడు, పల్లవరాజు-దంతివర్మ ఓడిపోయారు.
  • ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించిన కనౌజ్ పాలకుడు చక్రాయుధుడు. ఇతని తర్వాత ఇతని కుమారుడు అమోఘవర్షుడు రాజు అయ్యాడు.

అమోఘవర్షుడు (క్రీ.శ.814-878):

  • చిన్న వయసులో రాజ్యానికి వచ్చిన రాష్ట్రకూటులలో గొప్పవాడైన రాజు. ఇతని అసలుపేరు శర్వుడు.
  • ఆరు దశాబ్దాలకు పైగా దక్షిణాపథాన్ని ఏలాడు. ఇతని ఆధ్యాత్మిక గురువు హరిసేనుడు (ఇతను హరివంశం పుస్తక రచయిత).
  • నృపతుంగుడు, వీరనారాయణ, అతిశయధవళ బిరుదులతో పరిపాలించాడు.
  • ఇతను స్వయంగా కవి, కవిరాజు అనే బిరుదు కలదు, ఇతడు రచించిన గ్రంథాలు కవి రాజమార్గం (కన్నడ భాషలోని తొలి అలంకార గ్రంథం), ప్రశ్నోత్తర రత్నమాలిక (జైనకృతి).
  • ఇతను నిర్మించిన రాజధాని నగరం మాన్యఖేట (మాల్ఖేడ్). రాజధానిని ఎల్లోరా నుండి మాన్యఖేటంనకు మార్చాడు.
  • రాజ్యంలోని కరువు కాటకాలను నివారించడానికి కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారికి తన ఎడమచేతి వేళ్ళను నరికి నైవేద్యంగా సమర్పించాడు.
  •  ఎల్లోరాలోని 33వ గుహలో ఛోట కైలాస ఆలయం నిర్మించాడు. ఇతని సంరక్షకుడు కర్కరాజు. అరబ్బు యాత్రికుడు సులేమాన్ ఇతని ఆస్థానాన్ని సందర్శించాడు. అమోఘవర్షుడు సల్లేఖన వ్రతం చేస్తూ మరణించాడు.

రెండవ కృష్ణుడు (క్రీ.శ.880-914)

  • ఇతడు అమోఘవర్షుని కొడుకు. ఇతని కాలం నుండి రాష్ట్రకూట రాజ్యపతనం ప్రారంభమైంది.
  • క్రీ.శ.916లో జరిగిన వల్లాల యుద్ధంలో చోళరాజైన మొదటి పరాంతకుడి చేతిలో రాష్ట్రకూటులు ఓడిపోయారు.

రెండవ ఇంద్రుడు :

  • ఎల్లోరాలోని ఇంద్రసభ, రావణగుహ ఇతనికి చెందినవి.

మూడవ ఇంద్రుడు (915 – 927)

  • రాష్ట్రకూట రాజ్య వైభవాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు.
  • ఇతను కనౌజ్ పై దండెత్తి కనౌజ్ ను నాశనం చేశాడు.
  • అల్మసూది అనే అరబ్ యాత్రికుడు మూడవ ఇంద్రున్ని మాలిక్-ఉల్-ముల్క్ (ప్రపంచాధిపతి) అని పేర్కొన్నాడు.
  • ప్రతీహారులు, పాల వంశ పాలకులపై విజయం సాధించి తన సైన్యాలను గంగానదిలోయ నడిబొడ్డు వరకు తీసుకెళ్లాడు.

మూడవ కృష్ణుడు (క్రీ.శ. 934-963)

  • రాష్ట్రకూటులలో చివరి గొప్పరాజు, ఇతడు క్రీ.శ.949 లో జరిగిన తక్కోళం యుద్ధంలో చోళరాజైన మొదటి పరాంతక చోళ రాజును ఓడించి, కంజియం – తంజియంకొండ బిరుదు స్వీకరించాడు.
  • ఇతడు పాండ్య, కేరళ రాజ్యాలను దోచుకొని, ధ్వంసంచేసి రామేశ్వరం వద్ద విజయ స్థంభాన్ని నాటించాడు. రామేశ్వరంలో కృష్ణేశ్వరాలయంతోపాటు ఎన్నో దేవాలయాలు నిర్మించాడు.

ఖొట్టిగ (క్రీ.శ. 967-973)

  • పరమార సియకుడు కొట్టెగను ఓడించి మాన్యఖేట నగరాన్ని ధ్వంసం చేసినాడు.

రెండవ కర్కరాజు (క్రీ.శ.972-973)

  • ఇతను రాష్ట్రకూటులలో చివరి రాజు. ఇతని అసమర్థ పాలన వల్ల రాజ్యంలో అల్లకల్లోలాలు ఉధృతమై సామంతులు స్వతంత్రులైనారు.
  • ఇతనిని చాళుక్య రెండవ తైలపుడు ఓడించడంతో రాష్ట్రకూట రాజ్యం అంతరించింది.
  • ఇంద్ర-4 : ఇతను 982లో శ్రావణ బెళగొళలో సల్లేఖన వ్రతం చేస్తూ మరణించాడు. జైన సంప్రదాయమైన సల్లేఖనం (ఉపవాసం) ను ఆచరించి మరణించిన రెండవ రాష్ట్రకూట రాజు.
  • దక్షిణ భారతంలో 975 లో సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయిన రాజు – మారసింహ (పశ్చిమ గాంగ).

పరిపాలన

  • వీరి పాలనలో రాజుకు సర్వాధికారాలు కలవు. రాష్ట్రకూట సామ్రాజ్యంలో కొంతభాగం చక్రవర్తి ప్రత్యక్ష పాలనలో, మరికొంత భాగం సామంతరాజుల ఆధీనంలో ఉండేది.
  • సామంతరాజులు చక్రవర్తియొక్క ఆజ్ఞలను పాటించి అతనికి కప్పం చెల్లిస్తుండేవారు.
  • విషయపతి, భోగపతి అనే అధికారులు రెవెన్యూ పాలనను దేశగ్రామకూట అనే రెవెన్యూ అధికారుల సహాయంతో నిర్వహించేవారు.
  • రాష్ట్రకూటుల ఆదాయంలో అధిక భాగం సామంతరాజులు చెల్లించిన కప్పం నుండే వచ్చేది.
  • పంటలో 1/4వ వంతు పన్నుగా విధించేవారు. భూమిశిస్తును భాగ, కర అని పిలిచేవారు. అనావృష్టి పరిస్థితులలో పన్నుల మినహాయింపు ఉండేది.
  • వీరు రాజ్యాన్ని రాష్ట్రాలు, విషయాలు, గ్రామాలుగా విభజించి పాలన చేశారు:

 రాజ్యము రాజు

 రాష్ట్రాలు – రాష్ట్రపతి / మహాసామంత / మహామండళేశ్వర

 విషయము (జిల్లా) – విషయపతి / భోగపతి

 గ్రామము – గ్రామాధికారి

  • మొదటి అమోఘవర్షుడి కూతురు ‘చంద్రబ్బలబ్బె’ రాయచూర్ దోఆబ్ ప్రాంతాన్ని కొంతకాలం పాలించినది.

మతం

  • రాష్ట్రకూటుల కాలంలో హిందూ, బౌద్ధ, జైన మతాలు ఉన్నప్పటికి బౌద్ధం పతనావస్థలో, జైనమతం మహోన్నత స్థితిలో ఉంది. ముస్లింలకు తమ రాజ్యంలో మసీదులు నిర్మించుకొనుటకు అనుమతులిచ్చారు. ఈ కాలంలో హిందువులు శివ, విష్ణు, లక్ష్మి, సూర్యుడిని ఆరాధించేవారు.
  • దేవాలయాల్లో దేవదాసీలు దైవారాధన సమయంలో నృత్యం చేసేవారు.
  • విద్యాభ్యాసం కొరకు దేవాలయాలకు అనుబంధంగా పాఠశాలలు నిర్మించారు. అగ్రహారాలు సంస్కృత విద్యకు కేంద్రాలుగా రూపొందాయి.
  • రాజ్యంలో ఉన్న ముఖ్యనగరాలు, పుణ్యక్షేత్రాలు కూడా విద్యాకేంద్రాలుగా వర్ధిల్లాయి.

సామాజిక-ఆర్థిక అంశాలు

  • సమాజంలో నిమ్నకులాల పరిస్థితి మెరుగైంది.
  • సతి ఆచారం అంతగా ప్రచారంలో లేదు. బాల్యవివాహాలు ఉన్నాయి, కానీ వితంతు వివాహాలు లేవు.
  • వీరి రాజ్యంలో ప్రధాన పంటలుగా వరి, జొన్న, పత్తిలను పండించారు.
  • వస్త్రపరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది.
  • గుజరాత్, బీరార్, తెలంగాణలు ఈ పరిశ్రమకు ముఖ్య కేంద్రాలుగా విలసిల్లాయి. దేశంలో తయారైన వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేస్తూ, అరబ్బులతో వ్యాపారాన్ని ప్రోత్సహించారు.

శిల్పకళ

  • రాష్ట్రకూటుల కాలానికి చెందిన ముంబయి సమీపంలోని ఎలిఫెంటా గుహాలయాలను (ఎలిఫెంటా ద్వీపం లేదా ఘరపురి (The City of Caves)) 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది.
  • ఈ గుహాలయంలోని ప్రఖ్యాత శిల్పం త్రిమూర్తి శిల్పం.
  • భారతీయ శిల్పకళారంగంలో ఎనలేని పేరుగాంచినది రాష్ట్రకూటుల యొక్క ఏకశిలా వాస్తు నిర్మాణం.
  • ఎల్లోరాలోని 15వ గుహలో దశావతార గుహాలయంను దంతిదుర్గుడు నిర్మించాడు.
  • వీరి అత్యున్నత వాస్తుశైలికి నిదర్శనం ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం.
  • పశ్చిమచాళుక్యుల లేదా బాదామి చాళుక్యుల కాలంలో మొదలైన వేసరశైలి వీరి కాలంనాటికి అత్యున్నత స్థితికి చేరుకుంది.

ఎల్లోరా గుహలు :

  • వీటిని ఔరంగాబాద్ (మహారాష్ట్ర)కు సమీపంలో నిర్మించినది రాష్ట్రకూటులు.
  • ఇవి బౌద్ధ, జైన, హిందూ మతాలకు సంబంధించిన అంశాలను కలిగి ఉన్నాయి.

సాహిత్యం

  • వీరు సంస్కృత, కన్నడ భాషలను పోషించారు.
  • పంప (కన్నడ ఆదికవి), పొన్న, రన్న అను ముగ్గురు కన్నడ కవిత్రయంగా ప్రసిద్ధి. పంపకవి రాష్ట్రకూటుల సామంతుడైన వేములవాడ చాళుక్యరాజు రెండవ అరికేసరి పోషణను అందుకున్నాడు.
  • ఇతడు ఆదిపురాణం అనే జైనపురాణంను, విక్రమార్జున విజయం (అర్జునుడు కథానాయకుడు) రచనలు చేశాడు.
  • పొన్న రాష్ట్రకూటరాజైన మూడవకృష్ణుని ఆస్థానంలో ఉంటూ శాంతిపురాణం అనే జైనపురాణంను, భువనైక రామాభ్యుదయం రచనలు చేశాడు.
  • రన్న కళ్యాణి చాళుక్యరాజైన రెండవతైలపుని ఆస్థానంలో ఉన్నాడు. ఇతడు అజిత పురాణం అనే జైనపురాణంను, గదాయుద్ధం (భీముడు కథానాయకుడు) లేదా సాహసభీమ విజయం రచనలు చేశాడు.

అమోఘవర్షుని సాహిత్యం:

  • ఇతడు కవిరాజమార్గ (కన్నడ భాషలో మొదటి అలంకారశాస్త్ర గ్రంధం), ప్రశ్నోత్తర రత్నమాళిక, నీతికావ్యం అనే రచనలు చేశాడు.
  • గణితసార సంగ్రహంను రాసిన మహావీరాచార్య, అమోఘవృత్తి గ్రంథాన్ని రాసిన శాక్తాయనుడు, హరివంశంను రాసిన హరిసేనుడు, ఆదిపురాణంలో కొంతభాగం మరియు పార్శ్వనాథాభ్యుదయం గ్రంథాలు రాసిన జినసేనుడు ఇతని కాలంలోని ప్రముఖ జైనమత కవులుగా పేరుగాంచారు.

Related Posts

ఇక్ష్వాకులు – Telangana history Ikshvakulu practice bits

ఇక్ష్వాకులు మరియు దక్కన్ చరిత్ర – ముఖ్యమైన బిట్స్ (మరిన్ని ప్రశ్నలు) 1. ఇక్ష్వాక రాజుల కాలంలో నాణేల తయారీలో ఎక్కువగా ఉపయోగించిన లోహం ఏది? A) సీసం (Lead) B) బంగారం C) వెండి D) ఇనుము జవాబు: A)…

UPSC , TGPSC APPSC GROUP 1 ANCIENT HISTORY QUESTION AND ANSWERS TELUGU

1. “విజయనగర వాస్తుశిల్పం గత సంప్రదాయాలను సమకాలీన పద్ధతులతో మిళితం చేయడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.” తగిన ఉదాహరణలతో విశదీకరించండి. (250 పదాలు) పరిచయం (Introduction) 14 నుండి 17వ శతాబ్దాల మధ్య వికసించిన విజయనగర వాస్తుశిల్పం కేవలం గతం యొక్క…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *