ప్రాచీనా భారత దేశ చరిత్ర – సింధు నాగరికత part 3

*** సింధు నాగరికత ***

మత పరిస్థితులు (Religious Conditions)

  • సింధు నాగరికత ప్రజల మతం గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. మతా విశ్వాసాలను ప్రతిబింబించే దేవాలయాలు కానీ, ప్రజలంతాకలిసి ఆరాధించే ప్రదేశాలు కానీ లభించలేదు. దీనిని బట్టి సింధు ప్రజల మతం వ్యక్తిగత విశ్వాసమని అర్థమవుతుంది. ముద్రికలు, టెర్రకోట బొమ్మలు, కంచుబొమ్మలు, హోమగుండాలు, సమాధులలో లభించిన వస్తువులు మరియు తాయెత్తులపై ఆధారపడి వీరి మతంను విశ్లేషిస్తున్నారు.

1. అమ్మతల్లి లేదా మాతృదేవత (Mother Goddess):

  • సింధు ప్రజలచే పూజలందుకున్న ప్రధాన దైవం అమ్మతల్లి. ఈమెనే ప్రకృతి దేవత, పునరుత్పత్తి దేవత, వ్యవసాయ దేవతగా చెప్పారు. అమ్మతల్లి ఆరాధన స్త్రీ దేవతలను పూజించడాన్ని సూచిస్తుంది.
  • అనాది సమకాలీన నాగరికతలలో అమ్మతల్లిని పోలిన దేవతలు :

 సుమేరియా – ఇనన్న (ఇష్టార్)

 ఈజిప్టు – ఇసీస్

2. జననాంగముల పూజ:

  • సింధు ప్రజలు స్త్రీ, పురుషుల మర్మాంగాలను కూడా పూజించారు. ‘లింగాన్ని’ పూజించే ఆధారం మొహెంజోదారోలో లభ్యం కాగా, రాతి ‘యోనిని’ పూజించే ఆధారం (Phallus worship) హరప్పాలో లభ్యం అయింది.

3. ప్రకృతి జీవులను పూజించుట:

  • వృక్షారాధన చేసిన ప్రాచీన ప్రజలు సింధు ప్రజలు. ఈ నాగరికత ప్రజలు పూజించిన ప్రధాన వృక్షం రావిచెట్టు (అశ్వత్థ వృక్షం), మర్రిచెట్టు.

 సింధు ప్రజలు పావురమును, మొసలి, మూపురం గల ఎద్దును (వృషభం) కూడా పూజించారు. పామును పూజించారనే (పడగవిప్పిన సర్పం) ఆధారం గుమ్లా (సింధు) ప్రాంతంలో లభించింది. ఈ విధమైన పూజ సంకేతాత్మక మత విధానాన్ని సూచించును.

—

4. పశుపతి మహాదేవుడు (Proto-Shiva):

  • ఈ నాగరికత ప్రజలు పూజించిన ఏకైక పురుష దేవుడు పశుపతి మహాదేవుడు.
  • పశుపతి మహాదేవుడి బొమ్మ కలిగిన చతురస్రాకార ముద్రిక మొహెంజోదారోలో లభ్యం అయినది. ముద్రికలో పశుపతి మహాదేవుడు ధ్యాన భంగిమలో కూర్చొని ఉన్నాడు.
  • పశుపతి మహాదేవుడు అర్ధ నిమీలిత నేత్రాలతో, మూడు తలలు, రెండు కొమ్ములు కలిగి ఒక వేదికపై ధ్యాన నిష్ఠలో (పద్మాసనం) కూర్చొని ఉన్నాడు. అతని చుట్టూ 4 జంతువులు కలవు:
  • కుడి ప్రక్క – ఏనుగు, పులి
  • ఎడమ ప్రక్క – మహిషం (దున్న), ఖడ్గమృగం
  • వేదిక కింద – రెండు జింకలు (లేడి)

5. స్వస్తిక్ గుర్తు:

  • ఇది సింధు ప్రజల చిహ్నం. దీనిని కూడా పూజించారు. సింధు ప్రజలు భూత, ప్రేత పిశాచాలను నమ్మారు. ఈ భూత, ప్రేతాల నుండి తమను తాము కాపాడుకోవడానికి తాయెత్తులను కట్టుకొనే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఇది మూఢనమ్మకాలను (Superstitions) తెలియజేయును.

—

మత సంస్కారాలు (Rites and Rituals)

  • ప్రజలు వివిధ రకాలైన ఖనన పద్ధతులను పాటించారు. మృతిని పూడ్చి పెట్టే విధానాన్ని అధికంగా పాటించారు. సమాధులలో ఆ వ్యక్తులు జీవించి ఉండగా వారికి ఇష్టమైన వస్తువులను ఉంచేవారు. మృత దేహాలను ఉత్తర-దక్షిణంగా పెట్టి ఖననం చేసేవారు. మృతదేహం యొక్క తల ఉత్తరం వైపు ఉండేటట్లు వెల్లికిలా పడుకోబెట్టి ఉన్నాయి.
  • పాక్షిక ఖననం (శరీరంలోని ఏదో ఒక అవయవమును పూడ్చిపెట్టే విధానం) చేసినట్లు ఆధారం లభించిన సింధు నాగరికత ప్రాంతం బనావళి. ఇది వీరశైవ మత సంప్రదాయాన్ని పోలివుంది.
  • కుండలలో ‘చితాభస్మం’ను పూడ్చి పెట్టే ఆచారానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన నగరం రంగ్‌పూర్.

—

సామాజిక వ్యవస్థ (Social System)

  • సింధు సమాజం ప్రధానంగా మాతృస్వామ్య సమాజం (Matriarchial Society) గా ఉండేదని పేర్కొన్నది – సర్ జాన్ మార్షల్.
  • హరప్పా శ్మశానవాటికలో ఒకేరకమైన జన్యు లక్షణాలు గల మహిళలను పూడ్చిపెట్టిన విధానం మరియు ఇళ్లలో పెద్దమొత్తంలో లభించిన మాతృదేవత విగ్రహాలను బట్టి మాతృస్వామ్య పద్ధతి అమలులో ఉండి ఉంటుందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
  • ఆర్థిక అసమానతలు కనిపిస్తాయి. ధనికుల ఇండ్లు సాపేక్షంగా పెద్ద ప్రాంతంలో, చుట్టూ ప్రహరీతో, కాల్చిన ఇటుకలతో, స్వంత బావితో, విశాలమైన గదులతో నిర్మితమై ఉంటాయి. పేదలు కేవలం రెండు గదుల నిర్మాణంలో జీవించేవారు. హరప్పా, మొహెంజోదారో నగరాలలోని ధనికుల ఇళ్లను, కూలీల ఇళ్లతో పోలిస్తే ఈ అంతరాలు మరింత స్పష్టంగా తెలుస్తాయి.

వస్తువులు–అలంకరణలు :

  • ప్రత్తి, ఉన్ని వస్త్రాల ఉత్పత్తికి ఉపయోగించడమైనది, స్త్రీ,పురుషులిద్దరూ ఉత్తరీయం,అంతరీయం ధరించారు, స్త్రీలు అలంకరణ ప్రియులు, అలంకరణలో భాగంగా వీరికి దువ్వెన, లిప్‌స్టిక్, అద్దం తెలుసును. స్త్రీ,పురుషులు కంఠాభరణాలు,కంకణాలు,ఉంగరాలు,ఉష్ణీషాలు(తలపాగాలు) ధరించారు.
  • సమాజంలో ఉన్నత స్థానం పొందిన సామాజిక వర్గం – తాపీ మేస్త్రీలు
  • ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చేతి వృత్తి–ఇటుకల నిర్మాణం (ఇటుకల తయారీలో ఎత్తు, వెడల్పు, పొడవుల ప్రమాణం 1:2:4)
  • సింధు ప్రజల ప్రధాన వినోదం – జూదం (లేదా) పాచికల ఆట

సింధు ప్రజల ఇతర వినోదములు – చదరంగం, నృత్యం, వేట

  • సింధు ప్రజల ఆట బొమ్మలలో అధికంగా లభ్యమైన ఆటబొమ్మ – బండి బొమ్మ
  • వీరీ కాలంలో వాడే బొగ్గుముక్కలకు పేరు-శిలాజిత్.

—

లిపి (Script)

  • సింధు నాగరికత లిపి బొమ్మలతో కూడుకొని ఉన్నది కావున సింధు లిపిని ‘చిత్రలిపి’ (Pictography) గా పేర్కొంటారు. చిత్రలిపికి మరొక పేరు జ్యూలిఫ్.
  • సింధు లిపిని అధ్యయనం చేయుటకు ముఖ్య ఆధారాలు ముద్రికలు. కొన్ని సందర్భాలలో రాగి తాయెత్తులపై, గాజులపైన కనిపిస్తాయి.
  • ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు ఉన్న వీరి లిపి ఆధారంగా వీరిది ‘సర్పలేఖనం’ లేదా నాగవల్లిక లిపి (Boustrophedon) అని పేర్కొన్నారు. ఈ లిపిలో కొనసాగింపు కనబడలేదు.
  • క్రీ.శ 1965 కంటే ముందు ఈ లిపిపై పరిశోధన చేసిన వారు : ఫాదర్ హెన్రీ హేరాస్, జి.ఆర్.హంటర్
  • 1965 సం॥ తర్వాత ఈ లిపిపై పరిశోధన చేసినవారు : ఎస్.ఆర్. రావు, కృష్ణారావు, మహదేవన్
  • హరప్పా ప్రజల భాష సంస్కృతం అన్నది – ప్రొ॥ మధుసూదన మిశ్రా
  • లిపి యొక్క తొలి సమాచారం 1853 లో, పూర్తి లిపి 1923 లో అందుబాటులోకి వచ్చింది కానీ ఇప్పటివరకు దీనిని చదవలేకపోతున్నారు.
  • సింధు ప్రజల భాష మూల ద్రావిడమని పేర్కొన్న చరిత్రకారుడు – హెన్రీ హెరాస్, నోరోజోవ్, మహదేవన్, అస్కో పర్పొలా
  • కంప్యూటర్‌ను ఉపయోగించి సింధు లిపిని విశ్లేషించుటకు ప్రయత్నించినది – యూరిజ్ నోరోజోవ్ (రష్యా).
  • నటవర్ ఝా సింధు లిపిపై రాసిన గ్రంథం – The Vedic Glossary on Indus Script

లిపిపై వ్యాఖ్యానాలు (Statements on Script):

 ఎస్.ఆర్.రావు : సంస్కృతికి మొదటి రూపం సింధులిపి.

 ఐరావతం మహదేవన్ : ద్రావిడ భాషలకు మొదటి రూపం సింధులిపి.

 లాంగ్‌డన్, రాజారామ్ : సింధులిపి నుండి బ్రాహ్మిలిపి ఆవిర్భవించినది.

—

సింధునాగరికత పతనం (Decline of Indus Valley Civilisation)

1. సర్ మార్టిమర్ వీలర్ & గోర్డాన్ చైల్డ్ : ఆర్యుల దండయాత్ర వలన సింధునాగరికత ఆకస్మాత్తుగా వినాశనం అయిందని భావించాడు. ఆర్యులు ఇంద్రున్ని పూజించారు. ఈయనే సింధు నాగరికతను నాశనం చేశాడని ఋగ్వేదంలో పేర్కొంటూ ఇంద్రున్ని పురంధరుడని పిలిచేవారు.

2. జార్జ్ F.డేల్స్ : సింధునాగరికత అంతరించిపోవడానికి కారణం ప్రకృతి వైపరీత్యాలు (వరదలు).

3. రాబర్ట్ L. రైక్స్ & డేల్స్ : సింధు నాగరికత అంతరించిపోవడానికి కారణం “భూకంపాలు” (టెక్టోనిక్ ఫలకల్లో మార్పులు).

4. డి.డి.కౌశాంబి : పర్యావరణ మార్పులే కారణం.

> నోట్: అమెరికాకు చెందిన రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (RIT) కి చెందిన నిషాంత్ మాలిక్, పరిశోధన శీతోష్ణస్థితి మార్పు వల్లనే సింధునాగరికత అంతరించిందని డిసెంబర్ 2020లో తన అధ్యయనం ద్వారా తెలిపారు.

5. రఫీక్ మొఘల్ : ఘగ్గర్-హక్రా నది ఎండిపోవుట.

6. H.T. లాంబ్రిక్ : నదులు తమ ప్రవాహదిశను మార్చుకోవడం వలన కొన్ని పట్టణాలు వరదలతో ముంపుకు గురికాగా, కొన్ని జలాభావ పరిస్థితుల వల్ల(నీటి ఎద్దడి) ఖాళీ చేయబడ్డాయి.

7. డి.పి.అగర్వాల్ & సూద్ : నదులు ఎండిపోయి జలాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల సింధు ప్రజలు పట్టణాలను విడిచి వెళ్ళిపోయారు. ఉదా : ఘగ్గర్ నది ఎండిపోయి దుర్భిక్షం ఏర్పాటు

8. ఆర్.ఎస్.శర్మ : సింధు నాగరికత పతనానికి ఒక బలమైన కారణం ‘నూతనత్వాలను అందిపుచ్చుకోకపోవడము’.

9. వాల్టర్ ఫెయిర్‌సర్వీస్ : సింధు నాగరికత అంతానికి పర్యావరణ పరిస్థితులే కారణమని తను రాసిన ‘Pre-historic India’ అనే గ్రంథంలో పేర్కొన్నాడు.

> నోట్: అందరూ అంగీకరించే వాస్తవం – పర్యావరణ మార్పుల సిద్ధాంతం.

10. మెకె & S.R. రావు : వరదలు కారణం

11. ఫెయిర్ చైల్డ్ : ఆవరణపరమైన అలజడి (Ecological Disturbance)

12. డేల్స్, వాట్స్ & లాంబ్రిక్ : తక్కువ వర్షపాతం (Low Rainfall)

13. K.A.R. కెన్నడీ : సహజ వైపరీత్యాలు (Natural Calamity) కారణం

Related Posts

ఇక్ష్వాకులు – Telangana history Ikshvakulu practice bits

ఇక్ష్వాకులు మరియు దక్కన్ చరిత్ర – ముఖ్యమైన బిట్స్ (మరిన్ని ప్రశ్నలు) 1. ఇక్ష్వాక రాజుల కాలంలో నాణేల తయారీలో ఎక్కువగా ఉపయోగించిన లోహం ఏది? A) సీసం (Lead) B) బంగారం C) వెండి D) ఇనుము జవాబు: A)…

UPSC , TGPSC APPSC GROUP 1 ANCIENT HISTORY QUESTION AND ANSWERS TELUGU

1. “విజయనగర వాస్తుశిల్పం గత సంప్రదాయాలను సమకాలీన పద్ధతులతో మిళితం చేయడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.” తగిన ఉదాహరణలతో విశదీకరించండి. (250 పదాలు) పరిచయం (Introduction) 14 నుండి 17వ శతాబ్దాల మధ్య వికసించిన విజయనగర వాస్తుశిల్పం కేవలం గతం యొక్క…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *