ప్రాచీన భారతదేశ చరిత్ర – సింధు నాగరికత part 1

*** సింధు నాగరికత***

  • సింధు నాగరికత-కాల విభజన (Date & Extent)

 రోమిల్లా థాపర్ 3 దశలుగా విభజించినది:

1. పూర్వదశ (Early Phase): క్రీ.పూ. 3500 – క్రీ.పూ. 2600 వరకు

2. పరాకాష్ట దశ (Mature Phase): క్రీ.పూ. 2600 – క్రీ.పూ. 1900 వరకు

3. తుది దశ (Late Phase): క్రీ.పూ. 1900 – క్రీ.పూ. 1750 వరకు

  • మూడు దశలు కనబడిన పట్టణం – ధోలవీరా, రాఖీగర్హి

1. పూర్వహరప్పా నాగరికత (Early Harappan Civilisation):

  • ఈ దశలో మానవుడు సంచార జీవితం వదిలి స్థిర నివాసం ఏర్పరుచుకున్నట్లు ఆధారాలు మొదటగా లభించిన ప్రదేశం :  మెహర్‌గర్‌
  • ఈ దశ తామ్రశిలాయుగం కన్నా ప్రాచీనమైనది.
  • ఈ దశలోనే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా రూపాంతరం చెందాయి.
  • ఈ దశకు చెందిన ముఖ్య పట్టణాలు: కాలిబంగన్, ధోలవీరా, హరప్పా, బాలకోట్, అమ్రి, భీర్రన (హర్యానా), కోట్‌డిజి & గుమ్లా.
  • ఈ కాలిబంగన్ సంస్కృతినే సోథీ సంస్కృతి అందురు. ఈ సంస్కృతికి సోథీ సంస్కృతి అని పేరు పెట్టినది :: ఎ.ఘోష్

—

2. పరిణతి చెందిన (లేదా) పూర్ణ స్థాయి హరప్పా నాగరికత (Mature harappan civilisation):

  • ఈ దశలోనే హరప్పా నాగరికత పూర్ణస్థాయి అభివృద్ధిని, విస్తరణను సాధించింది. అతిపెద్ద పట్టణాలు ఏర్పాటు జరిగింది. కొత్త కేంద్రాల ఏర్పాటు జరిగింది.

—

3. హరప్పా అనంతర నాగరికత (Late harappan civilisation):

  • సింధు నాగరికత క్షీణించింది.
  • పట్టణాల సంఖ్య పెరిగింది, కానీ వాటి పరిమాణం తగ్గింది.
  • హరప్పా నాగరికతలోని అభివృద్ధి చెందిన దశ యొక్క తరువాతి సంస్కృతులు ఈ కాలానికి చెందినవి.
  • ఉదా: ఝుకర్ సంస్కృతి, ఝంగర్ సంస్కృతి, లూస్థాల్ సంస్కృతి.

—

సింధు నాగరికత-సమకాలీన నాగరికతలు (Contemporary Civilisations)

1. మెసపోటేమియా నాగరికత (4500-1900 BCE)

  • మెసపోటేమియా అనగా రెండు నదుల మధ్య గల అంతర్వేది (Doab) అని అర్థం.
  • యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య విస్తరించి ఉంది.
  • మెసపోటేమియాకు ప్రస్తుత పేరు – ఇరాక్.
  • సింధు ప్రజలు ఎక్కువగా మెసపోటేమియా నాగరికత ప్రజలతో వ్యాపారపరమైన మరియు సాంస్కృతిక సంబంధాలు కొనసాగించారు.
  • ఈ నాగరికతలోని కట్టడాల నిర్మాణానికి కాల్చిన ఇటుకలను వాడారు. కాకపోతే సింధు నిర్మాణాలలో ఉపయోగించినంత వాడలేదు.

2. ఈజిప్ట్ నాగరికత (3200-1000 BCE)

  • నైలు నది ఒడ్డున ఈ నాగరికత వికసించింది.
  • ఈజిప్ట్ నిఘంటువులో పిరమిడ్ అనగా ఎండిన ఇటుకలు (Dried Bricks) వాడారు.
  • హోయంగ్ హో నది (Yellow River) ఒడ్డున విస్తరించింది.
  • ఈ నదిని చైనా విలపదాయిగా (Sorrow of China) పిలుస్తారు.

—

కాలక్రమము (Time Period)

| చరిత్రకారుడు / సంపాదకుడు | సింధు నాగరికత కాలం |

| — | — |

| సర్ జాన్ మార్షల్ | క్రీ.పూ. 3250 నుండి క్రీ.పూ. 2750 వరకు |

| మార్టిమర్ వీలర్ | క్రీ.పూ. 2500 నుండి 1500 వరకు |

| డి.పి.అగర్వాల్ | క్రీ.పూ. 2300 నుండి 1750 వరకు |

| రామిల్లా థాపర్ | క్రీ.పూ. 3500 నుండి 1500 వరకు |

| ఫెయిర్ సర్వీస్ | క్రీ.పూ. 2750 నుండి 1500 వరకు |

| ఫెయిర్ సర్వీస్ (మరొకటి) | క్రీ.పూ. 2000 నుండి 1500 వరకు |

 శాస్త్రీయంగా నిర్ధారించబడిన $C^{14}$-రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ప్రకారం సింధు నాగరికత కాలం – క్రీ.పూ. 2500 నుండి క్రీ.పూ. 1750 వరకు.

—

సింధు నాగరికత విస్తీర్ణం (Area)

 ప్రాచీన సరిహద్దు నాగరికతలన్నింటిలో విస్తీర్ణం దృష్ట్యా చూస్తే హరప్పా నాగరికత అతిపెద్దది. హరప్పా నాగరికత దాదాపు 13 లక్షల చ.కి.మీ. విస్తరించి, త్రిభుజాకారంలో (Triangle) ఉన్నది.

సరిహద్దులు:

 ఉత్తర సరిహద్దు: మండ (జమ్మూ కాశ్మీర్) — చీనాబ్ నది ఒడ్డున

 దక్షిణ సరిహద్దు: దైమాబాద్ (మహారాష్ట్ర) — గోదావరి ఉపనది అయిన ‘ప్రవర’ నది ఒడ్డున

 తూర్పు సరిహద్దు: ఆలంగీర్‌పూర్ (ఉత్తరప్రదేశ్) — హిండన్ నది తీరం (యమునా ఉపనది)

 పశ్చిమ సరిహద్దు: సుత్కజేండోర్ (బలూచిస్తాన్) — దాష్ట్ నది తీరం (ప్రస్తుతం ఇది ఇరాన్ సరిహద్దు ప్రాంతం)

—

నాగరికత నిర్మాతలు

  • ఈ నాగరికతలో వివిధ జాతుల ప్రజలు కలసి నివసించారు అని చరిత్రకారులు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న సంచార తెగల నుంచి ఆవిర్భవించినట్లు కొందరు, కాకసస్ (ఇండో-ఆర్యన్లు), ద్రవిడులు, సుమేరియన్లు లేదా ప్రోటో-ఆస్ట్రలాయిడ్స్ అని పేర్కొన్నారు.

1. ప్రోటో-ఆస్ట్రలాయిడ్ జాతి: మెసపోటేమియాలో లభించిన కాంస్య విగ్రహాల మూలంగా ఈ జాతి లక్షణాలు కనబడినవి. వీరు సింధు నాగరికత తొలిదశలో ఉండే వారని భావిస్తున్నారు.

2. మంగోలాయిడ్ జాతి: మెసపోటేమియాలో లభించిన గడ్డం మనిషి, హోయ్ట్ ఈ జాతి లక్షణాలు కనబడినవి.

3. ఆల్ఫైన్/ఆర్యన్ జాతి: పూజార్యుల (Archaeological Excavations) ఈ జాతి ఆనవాళ్ళు కనిపించినవి.

4. మెడిటరేనియన్ జాతి: వీరే సింధు నాగరికత నిర్మాతలుగా చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం. వీరు ద్రవిడ భాష మాట్లాడటం వల్ల వీలు ద్రవిడులు అంటారు. సింధు ప్రజలు ద్రవిడులు అని ప్రతిపాదించినది – సర్ జాన్ మార్షల్.

  • ఇటీవల లభించిన ఆస్థిపంజర DNA నమూనాల అధ్యయనం ప్రకారం సింధు ప్రజలు స్వతంత్రంగా ఎదిగిన ఆరిజిన్ (Independent Origin) చెందారని తెలుస్తోంది.

సింధు నాగరికత ఆవిర్భావ సిద్ధాంతాలు

1. స్వదేశీ సిద్ధాంతం (Indigenous Theory):

  • అమలానంద్ ఘోష్ ప్రతిపాదించారు. అయితే ఈ సిద్ధాంతాన్ని ఎవరూ అంగీకరించలేదు.

2. విదేశీ సిద్ధాంతం (Foreign Theory):

 ఎ) మార్టిమర్ వీలర్: సుమేరియన్లు (మెసపోటేమియా నాగరికత) వలన వచ్చే సింధు నాగరికత ఏర్పడిందని ఈయన సిద్ధాంతీకరించాడు.

 బి) ప్రొ॥ రఫీక్ మొఘల్: ఇతను సింధు నాగరికత బిలూచిస్థాన్ నాగరికత (హరప్పా పూర్వ సంస్కృతి) నేరుగా ఉందని పేర్కొన్నారు.

 సి) అల్చిన్స్: ఇతను సింధు నాగరికత ఐరోపాలోని జోర్వే-ప్రభస్ నాగరికతతో చోటుచేసుకుంది, వృద్ధిపొందే విధానం సింధు నాగరికతకు తోడ్పడింది.

—

ప్రముఖ్య హరప్పా ప్రదేశాలు (Famous Harappan Sites)

| ప్రదేశం (Site) | త్రవ్వకాలు జరిపినవారు (Excavator) | సంవత్సరం | నది (River) | ప్రస్తుతం ఉన్న ప్రాంతం (Present Location) |

| — | — | — | — | — |

| హరప్పా | దయారాం సహానీ | 1921 | రావి | సాహివాల్ (పంజాబ్, పాకిస్తాన్) |

| మొహెంజొదారో | ఆర్. డి. బెనర్జీ | 1922 | సింధు | నార్కానా (సింధ్, పాకిస్తాన్) |

| చాన్హుదారో | ఎన్. జి. మజుందార్ | 1931 | సింధు | సింధ్ (పాకిస్తాన్) |

| కాలిబంగన్ | బి. బి. లాల్ | 1961 | ఘగ్గర్ | హనుమాన్‌గఢ్ (రాజస్థాన్) |

| ఆమ్‌రి | ఎన్. జి. మజుందార్ | 1935 | సింధు | సింధ్ (పాకిస్తాన్) |

| రంగ్‌పూర్ | ఎం. ఎస్. వాట్స్ | 1953 | భదర్ | గుజరాత్ |

| రోపార్ | వై. డి. శర్మ | 1953–56 | సట్లెజ్ | పంజాబ్ |

| లోథాల్ | వై. డి. శర్మ / శ్రీ రంగనాథరావు | 1958 | భోగావో | గుజరాత్ |

| కోట్‌డిజి | ఎఫ్. ఎ. ఖాన్ | 1955 | సింధు | సింధ్ (పాకిస్తాన్) |

—

సింధు నాగరికత-పట్టణాలు (Towns of IC)

1. హరప్పా

  • “ధాన్యగారాల ఉయ్యాలల నగరం”
  • Gateway City” అంటారు.
  • సమాధుల నగరం (City of Graveyard) అని కూడా అంటారు.
  • ట్రైయాంగిల్ ఆకృతిపడిన మొదటి నగరంగా గుర్తింపు పొందింది.
  • ఋగ్వేదంలో ‘హరి యూపియా’ అని ప్రస్తావించబడిన నగరం హరప్పాయే.
  • బయటపడిన విగ్రహాలు
  • అమ్మతల్లి
  • ,నటరాజ విగ్రహాలు (నాట్యం చేస్తున్న పురుషుడి విగ్రహం)
  •  ముద్రల గల ఎద్దు ముద్రిక (Bull Seal) ఇక్కడ లభించాయి.
  • రెండు ప్రముఖమైన రాతి విగ్రహాలు లభించాయి. ఒకటి ఎర్రరాతితో చేయబడినది, అందులో ఒకటి తలలేని దేహ స్వచ్ఛంగా ఉన్న పురుష విగ్రహం, రెండవది నల్లటి రాయి.
  • కాంస్యంతో చేసిన అద్దాలు (Bronze Mirrors) లభించాయి.
  • ధాన్యగారాలు (ఉదాహరణకి 15, 23 మీ. పొడవు, 6.03 మీ. వెడల్పు) బయల్పడ్డాయి. ధాన్యగారాల పక్కన ఇల్లు ఉన్నాయి, దీనిలో కూలీలు నివసించేవారని తెలుస్తోంది.
  • ఇక్కడ పొడవు తయారు పరిశ్రమకు, కాల్చిన కుండల తయారీకి కేంద్రం (కుమ్మరి చక్రం).
  • “H” ఆకారపు సమాధులు ఈ నగరంలోనే బయల్పడ్డాయి.
  • చెక్క శవపేటికలో (Wooden Coffin) శరీరాన్ని పెట్టి దహనం చేసే అలవాటు లభించింది.
  • ధాన్యాల్ని దంచేందుకు ఉపయోగించిన వృత్తాకార వేదికలు బయల్పడ్డాయి.
  • మట్టి ఇటుకలతో నిర్మించిన ప్రహరీ భాగం మరియు రక్షణ గోడ బయటపడింది.
  • రాగితో తయారు చేసిన సాధనాలు, కొలతలు కొలిచే కొలబద్ద (స్కేలు) దొరికాయి.
  • లింగం మరియు యోనికి సంబంధించిన ఆధారాలు లభించాయి.
  • కుమ్మరి చక్రానికి సంబంధించిన ఆధారాలు.
  • పాము ముద్రలకు సంబంధించిన ఆధారాలు.

—

2. మొహెంజొదారో

  • కాంస్యంతో తయారు చేసిన కాలినెజ్ కొలబద్ద (స్కేల్)
  • తామ్రంతో సంబంధమున్న ఆధారాలు
  • రాతితో అతి తక్కువ మందికి మాత్రమే సీల్స్ లభించాయి.
  • ఎడ్లబండి (Ekka) అస్థిపంజరం లభించాయి.
  • సింధీ భాషలో మొహెంజొదారో అంటే “మృతుల దిబ్బ” (Mound of the Dead) అని అర్థం.

 ఇది సింధు నాగరికతలో అతిపెద్ద నగరం (సుమారు 200 హెక్టార్ల విస్తీర్ణం). దీని జనాభా సుమారు 35,000–41,000.

 దీనికి గల ఇతర పేర్లు:

1. సింధు నాగరికత ఉద్యానవనం (Garden of Indus Civilisation)

2.  నిక్లిస్తాన్(Oasis of Sind)

3. మోడల్ సిటీ (Model City)

4. ల్యాంక్‌షైర్ నగరంతో పోల్చబడిన సింధు పట్టణం

 త్రవ్వకాలలో 9 పొరలలో ఇల్లు బయల్పడ్డాయి.

 ఇది 7 సార్లు వరదలకు గురైన నగరం.

  • మహాస్నానవాటిక (Great bath), మహా ధాన్యాగారాలు ఇక్కడ లభించాయి.

> నోట్: మహాస్నానవాటికను కనుగొన్నది – జాన్ మార్షల్.

  • పశుపతి మహదేవుని ప్రతిమ (ముద్ర).
  • ఎలుగు, ఆవు, మేక, పులి, ఏనుగు, ఖడ్గమృగాల నమూనాలు దొరికాయి.
  • ఇక్కడ పశుపతి ముద్ర వద్ద 2 జింకలు ఉన్నాయి. సింహం ప్రతిమ లేదు.
  • ఇక్కడ లభించిన ముద్రలపై ప్రాటో-శివ అని సర్ జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు.
  • మానవత్వముతో కూడిన ప్రొటో-శివుని బొమ్మ, పశువుల కాపరిగా ఉన్న ముద్ర దొరికింది.
  • మాతృదేవత విగ్రహం, నేత వస్త్రం లభించాయి.
  • గడ్డం ఉన్న పురోహితుని విగ్రహం
  • నేతవస్త్రం
  • స్కేల్స్ తయారీకి వాడే కార్డు
  • సూదులు, దారాలు లభించాయి.
  • నాట్యగత్తె కాంస్య విగ్రహం
  • మహాధాన్యాగారానికి దక్షిణాన ఆర్కెస్ట్రా లేదా అతిపెద్ద ధాన్యాగారం (Great Granary) బయల్పడింది. మొహెంజొదారోలో అతిపెద్ద నిర్మాణం.

3. చాన్హుదారో

  • 3 సార్లు వరదలకు గురైన నగరం.
  • కోట లేని ఏకైక నగరం (No Citadel).
  • ఇది పారిశ్రామిక పట్టణము, పూసల తయారీ పరిశ్రమ కేంద్రంగా వర్ధిల్లింది.
  • ఇక్కడ ‘Cat’ యొక్క ఆవాసాలు లభించాయి.
  • ఇంక్‌పాట్ (Inkpot) లభించింది.
  • కాంస్య రథము, మట్టి బొమ్మలు లభించాయి.
  • గాజుల తయారీ, ఐవరీ మట్టితో తయారు చేసిన ఎడ్లబండి బయల్పడింది
  • ఆభరణాలు, డ్రెస్సింగ్, రంగులద్దడానికి సంబంధించిన ఆధారాలు లభ్యం.

—

4. లోథాల్

 గుజరాత్ భాషలో లోథాల్ అంటే “మృతుల దిబ్బ” (Mound of Dead)

 దీనికి ఇతర పేర్లు:

1. మిని హరప్పా

2. మిని మొహెంజొదారో

3. కాస్మోపాలిటన్ నగరం

4. రెండవ ఓడరేవు నగరం

5. క్రాఫ్ట్‌సిటీ నగరము

  • లోథాల్ ఒక ప్రాచీన ఓడరేవు. ఇది సింధు ప్రజల మొదటి కృత్రిమ ఓడరేవు.
  • ఇది గుజరాత్ లోని ఖంబత్ సింధు శాఖ-దక్షిణానికి 213 మీ॥ పొడవు, తూర్పు-పడమరలకు 36 మీ॥ వెడల్పు ఉంది. ఈ రేవు ద్వారా అంతర్జాతీయ రేవు పట్టణంగా విలసిల్లింది.
  • ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ పోర్ట్.
  • సింధు నాగరికత ప్రజల ప్రధాన విదేశీ వ్యాపార కేంద్రం. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ముద్రిక దొరికింది.
  • ఉడక పెట్టిన బియ్యాన్ని ఉపయోగించిన ఆధారం (Dry dock) బయల్పడింది.
  •  భారతదేశంలో మొదటిసారిగా “వరి” పండించిన వారు లోథాల్ ప్రజలు (పరిశోధనల లభ్యం).
  • చెక్కతో తయారు చేసిన కాటన్ రోలర్ లభించింది.
  • పూసల, గాజుల పరిశ్రమ ఆధారాలు లభించాయి.
  • అద్దం దొరికింది
  • ద్వి శవఖననం దొరికిన ప్రాంతం (Double Burial) చేసిన ఆధారాలు ఈ ప్రాంతంలో లభించినవి. ఇది సతీసహగమనం కావచ్చు.
  • సమాధి చుట్టూ కాల్చిన కుండలలో శవం ఉంచి లేదా దహనకాండ ఉపయోగించినట్లు తెలుస్తోంది.
  • ఫైర్ ఆల్టర్స్ అగ్నికుండాలు
  • పశువుల బొమ్మ మరియు మిగిలిన బొమ్మలు దొరికాయి.
  • S.R. రావు ప్రకారం కేవలం లోథాల్ నగరంలో మాత్రమే అంతర్గత మండి నిర్మాణంలో ఐవరీ ఉత్పత్తులు దొరికాయి.
  • పనిముట్లు, ఉత్తిత్తి చేసిన వస్త్రాలను చూడవచ్చు.
  • ఒక కుండపై కాకి మరియు తాబేలు ఉన్న కథ మీద చెక్కిన చిత్రాలు లభ్యం.
  • ఒక మనిషి చిత్రం ఉన్నది. 12 సైజుల గదులు లభ్యం.
  • వీధి దీపాలకు సంబంధించిన ఆధారాలు లభ్యం.

—

5. కాలిబంగన్

  • కాలిబంగన్ అనగా “నల్లని గాజులు”
  • హరప్పా పూర్వ సంస్కృతి మరియు హరప్పా సంస్కృతి రెండూ కనబడతాయి.
  • అగ్నికుండాల ప్రామాణిక సమాచారం ఆధారాలు లభ్యం.
  • భారత్ ఉపఖండంలో అతి పురాతనమైన దుక్కిదున్నిన భూమి (నాగెలి చారలు) ఆధారాలు బయల్పడ్డాయి.
  • ఒంటె ఒంటి అస్థిపంజరం
  • ఎముకలతో తయారు చేసిన బాణం లభ్యం.
  • క్యాన్సర్‌తో తయారు చేసిన గుజ్జు లభ్యం.
  • 7 హోమగుండాలు (అగ్నివేదికలు) మరియు జంతువుల సమాధి లభ్యమయ్యాయి.

—

6. బనవాలి

  • హరప్పా పూర్వ సంస్కృతి మరియు హరప్పా సంస్కృతి రెండూ కనబడతాయి.
  • గ్రిడ్ విధానం పాటించక పోవడం వల్ల ఇది రహదారులు అస్తవ్యస్తంగా ఉన్న నగరం.
  • మురుగు నీటిపారుదల లేని ఏకైక నగరం.
  • ఇది ప్రణాళికతో నిర్మించబడిన నగరం.
  • 11 గదులు కలిగిన భవనం లభ్యమైనది.
  • పొలాల్లో మట్టితో చేసిన నాగలి బొమ్మ లభ్యమైనది.
  • బార్లీ పంటను పండించిన ఆధారాలు లభ్యం.
  • పూసల ముద్రల (సీల్స్) లభ్యమయ్యాయి.
  • కుమ్మరి చక్రానికి సంబంధించిన ఆధారాలు లభ్యం.

—

7. సుర్కోటడా

  • ఆవాల (Mustard) పంటకు సంబంధించిన ఆధారాలు లభ్యం.
  • గుర్రం అవశేషాలు లభ్యమైన ప్రదేశం. అయితే ఇవి గాడిద-కంచర గాడిద ఎముకలని పరిశోధకులు తీర్మానించారు.
  • హరప్పా ప్రజలు దైనందిన అవసరాలలో గానీ, ‘కర్మకాండలలో’ గానీ గుర్రాన్ని వాడలేదని రోమిల్లా థాపర్ తెలిపారు. కావున సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రం.
  • కుండలలో ‘శవాన్ని’ పూడ్చి పెట్టారు అనే ఆధారం లభించిన ప్రాంతం.
  • రాతిగోడతో నిర్మించిన రక్షణ కుడ్యం లభ్యం.
  • క్షీణ దశలో ఉన్న సింధూ నాగరికత అవశేషాలు బయటపడినాయి.
  • వరిపొట్టు ఆధారం లభించింది.

—

8. రంగ్‌పూర్

  • వరిపొట్టు ఆధారం లభించింది.

—

9. ధోలవీరా

  • మూడవ పారిశ్రామిక నగరంగా ప్రసిద్ధి చెందింది.
  • ఇటీవల బయటపడిన నూతన నగరంగా ప్రసిద్ధి గాంచింది.
  • పట్టణం ఎగువ, మధ్య, దిగువ అనే 3 విభాగాలగా విభజించబడింది.

 ఇక్కడ బయల్పడినవి:

1. Shopping Complex

2. పట్టాభిషేక మహోత్సవ ప్రదేశం (పెద్ద స్టేడియం)

3. సిటీ నీటి నిల్వ కట్టడాలు (రిజర్వాయర్స్), సిల్వర్ ఆభరణాలు

4. రాతి ముంగీస

5. వెండి కిరీటం, సిల్వర్ ఆభరణాలు లభ్యం

6. 10 పెద్ద గుర్తులతో గల హరప్ప ముద్రిక లభించింది

7. చెక్‌డ్యామ్‌కు సంబంధించిన ఆధారాలు లభ్యం

8. యుద్ధానికి సంబంధించిన పరికరాలు లభ్యం కాలేదు

  • జలసిరుల సిటీగా పిలువబడే ధోలవీరను 2021 లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.

—

10. ఆమ్రి

  • మొదటిసారిగా మూపురం ఉన్న ఎద్దు ముద్రిక లభించింది.
  • ఖడ్గమృగం అవశేషాలు లభ్యమైనవి.
  • హరప్పా నాగరికత యొక్క సంస్కృతికి సంబంధించిన నాలుగు దశలు వర్ధిల్లిన నగరం.
  • ఝూంగార్ సంస్కృతికి సంబంధించిన ఆధారాలు లభ్యం.

—

11. రోపార్

  • హరప్పా సంస్కృతి మరియు హరప్పా అనంతర సంస్కృతి బయల్పడినది.
  • స్వాతంత్రం తరువాత బయల్పడిన తొలి నగరం (సట్లెజ్ నదీ తీరం – పంజాబ్).
  • యజమాని మరణానంతరం అతనితోపాటు తన జంతువులను(కుక్కలను) కూడా పూడ్చేవారు.

—

12. ఆలంగీర్‌పూర్

  • ఇది హరప్పా నాగరికత పరిణతి దశకు చెందినది.
  • హరప్పా నాగరికత తుదిదశలో ఇక్కడ పత్తిని పండించారు.
  • సింధూ నాగరికతకు సంబంధించిన తూర్పు సరిహద్దు.

—

13. గుమ్లా

  • ఇది కాశ్మీర్‌లో గల పట్టణం.
  • ఇక్కడ ‘సర్పపూజ’ ఆనవాళ్లు లభ్యమైనవి.

—

14. కోట్‌డిజి

  • ఇక్కడ రాతి బాణాలు బయల్పడినవి.
  • ఇది అగ్నివల్ల నాశనమైన పట్టణం.
  • కాంస్యంతో తయారు చేయబడిన కడియం లభ్యం.
  • మూపురం కలిగిన ఎద్దుకు (Bull with hump) సంబంధించిన ముద్రికలు లభ్యం.
  • రావి ఆకులతో చిత్రించబడిన కుండ పెంకులు లభ్యం.

—

15. రాఖీగర్హి

  • ఇది ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద సింధూ నాగరికత నగరం.
  • ఇక్కడ కంచు అద్దాలు, కంచు బాణాలు లభ్యం.

Related Posts

ఇక్ష్వాకులు – Telangana history Ikshvakulu practice bits

ఇక్ష్వాకులు మరియు దక్కన్ చరిత్ర – ముఖ్యమైన బిట్స్ (మరిన్ని ప్రశ్నలు) 1. ఇక్ష్వాక రాజుల కాలంలో నాణేల తయారీలో ఎక్కువగా ఉపయోగించిన లోహం ఏది? A) సీసం (Lead) B) బంగారం C) వెండి D) ఇనుము జవాబు: A)…

UPSC , TGPSC APPSC GROUP 1 ANCIENT HISTORY QUESTION AND ANSWERS TELUGU

1. “విజయనగర వాస్తుశిల్పం గత సంప్రదాయాలను సమకాలీన పద్ధతులతో మిళితం చేయడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.” తగిన ఉదాహరణలతో విశదీకరించండి. (250 పదాలు) పరిచయం (Introduction) 14 నుండి 17వ శతాబ్దాల మధ్య వికసించిన విజయనగర వాస్తుశిల్పం కేవలం గతం యొక్క…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *