*** సింధు నాగరికత ***

నగర నిర్మాణం (Town Planning)
- సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత. మోహెంజోదారో, హరప్పా, చాన్హుదారో, లోథాల్ మొదలైన నగరాలు భారతదేశంలో జరిగిన తొలి నగరీకరణ ఫలితాలని రోమిల్లా థాపర్ వ్యాఖ్యానించారు.
ఈ నాగరికతలోని నగరముల ప్రధాన లక్షణాలు:
1. పట్టణ ప్రణాళిక
2. నిర్మాణాలు:
ఎ) పౌర నిర్మాణాలు
బి) గృహ నిర్మాణాలు
3. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ
—
1. పట్టణ ప్రణాళిక (Town Planning):
- ఈ నగరాలలో ఇళ్లను గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నిర్మించారు. నగరంలోని ప్రధాన వీధులు, ఉపవీధులు, ఒకదానికొకటి క్రమపద్ధతిలో కుడి కోణంలో ఖండించుకొని (Cut each other at right angle) నగరాన్ని దీర్ఘచతురస్రాకార విభాగాలుగా (Rectangular Divisions) విభజించే వ్యవస్థను గ్రిడ్ వ్యవస్థ అంటారు.
- ఈ గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నిర్మించబడిన ప్రస్తుత నగరం చండీగఢ్ కాగా, గ్రిడ్ వ్యవస్థ కనబడని ఏకైక నగరంగా బనవాలి పిలవబడింది.
- రహదారులన్ని (వీధులన్నీ) పరస్పరం $90^\circ$ కోణంలో ఖండించుకుంటూ సమాన భాగాలుగా 9-34 అడుగుల వెడల్పుతో విభజించబడినవి. ఈ నగరాలను ఆకాశం నుండి చూస్తే చెస్‌బోర్డ్ మాదిరిగా కనబడును.
- ప్రధాన వీధులు ఉత్తరం-దక్షిణాలుగా, తూర్పు-పడమరలుగా తిన్నగా ఉండేవి. తూర్పు వీధిని ‘రాజవీధి’ గా పేర్కొనేవారు. పురావస్తు శాస్త్రవేత్తలు తూర్పు, దక్షిణ వీధులు కలిసే ప్రాంతాన్ని ‘ఆక్స్ఫర్డ్ సర్కస్’ గా వర్ణించారు.
రాజకీయ వ్యవస్థ
ఇంతటి మహోన్నతమైన నాగరికతను ఎవరు పరిపాలించారో తెలియదు.
| అభిప్రాయం | రాజకీయ వ్యవస్థ | ముఖ్యఅంశాలు |
| — | — | — |
| డి.డి. కౌశాంబి | పురోహిత వర్గం | కౌశాంబి ప్రకారం ఈ నాగరికత మతపరమైన రాజ్యం. |
| ఆర్.ఎస్. శర్మ | వర్తకుల వర్గం | ఇతని ప్రకారం ఇది ఒక లౌకిక రాజ్యం. |
| స్టూవర్ట్ పిగ్గట్ | మతాధికారులు | – |
| దీక్షిత్ & గోర్డన్ చైల్డ్ | పురపాలక సంఘాలు | అద్భుతమైన పట్టణ ప్రణాళిక, పారిశుధ్యం ఈ అభిప్రాయానికి ఆధారం. |
| ఎ.ఎల్. భాషం | బలమైన కేంద్రీకృత వ్యవస్థ | – |
—
సింధు ప్రజల కళాస్వరూపాలు
1. ముద్రికలు (Seals):
- సింధు నాగరికత కాలాన్ని మరియు సింధు నాగరికతను విశ్లేషించటంలో ప్రధాన ఆధారాలు ముద్రికలు.
- ఈ ముద్రికలను సింధు ప్రజలు అత్యంత కళాత్మకంగా తయారుచేశారు. వీటిని ‘స్టియాటైట్’ అనే మెత్తని రాయితో తయారు చేశారు.
- ఇప్పటివరకు 1400 స్థలాల నుండి దాదాపు 4000 వరకు ముద్రికలు కనుగొన్నారు. ఎక్కువగా 1398 ముద్రికలు మొహెంజోదారోలో, 891 ముద్రికలు హరప్పాలో కనుగొన్నారు.
- ఈ ముద్రికలలో అత్యంత ప్రధానంగా కనిపించేది ‘మూపురం లేని ఎద్దు బొమ్మ’. చేప గుర్తు గల ముద్రికను అత్యంత శుభప్రదమైనదానిగా భావించేవారు.
ఈ ముద్రికలు ప్రధానంగా 3 రకాలుగా ఉన్నాయి:
1. చతురస్రాకారం : అనేక ప్రదేశాలలో లభ్యమైనవి.
2. దీర్ఘచతురస్రాకారం : కాలిబంగన్ (రాజస్థాన్)లో లభ్యమైనవి.
3. వృత్తాకారం : జుక్కార్ (ప్రస్తుత పాకిస్తాన్)లో లభ్యమైనవి.
- ఈ ముద్రికలపై జంతువులు, వృక్షాల బొమ్మలు కూడా ముద్రించారు.
ఈ ముద్రికలపై ముద్రించిన ముఖ్యమైన జంతువులు:
1. ఎద్దు (వృషభం)
2. ఏనుగు
3. కొమ్ములున్న పులి (సుమేరియన్ పురాణ గాథలలోని ఎంకిడు)
4. ఖడ్గమృగం
5. చేప
6. మహిషం (దున్నపోతు)
7. కొమ్ములున్న పులితో పోరాడుతున్న యోధుడు
- నాటి సమకాలీన నాగరికత అయిన మెసపోటేమియా నాగరికత ప్రజలు స్థూపాకార ముద్రికలు (Cylindrical Seals) ముద్రించేవారు. మొహెంజోదారో త్రవ్వకాలలో మూడు స్థూపాకార ముద్రికలు లభ్యమయ్యాయి. దీని ద్వారా సింధు ప్రజలకు, మెసపోటేమియా ప్రజలకు వ్యాపార సంబంధాలు ఉండేవని అర్థం అవుతుంది.
- సింధు నాగరికత ముద్రికలు అధిక సంఖ్యలో లభించిన మెసపోటేమియా నగరం ‘టెల్ అస్సార్’ .
—
2. టెర్రకోట బొమ్మలు :
- ఈ బొమ్మలు సింధునాగరికత ప్రజల సాంఘిక జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. కాల్చిన బంకమట్టితో స్త్రీ, పురుషుల, జంతువుల, ఆట బొమ్మలను తయారు చేశారు. వీరు మృణ్మయ బొమ్మలలో ఎక్కువగా కోతి బొమ్మలు కనిపిస్తాయి.
—
3. ఇతర లోహాల బొమ్మలు (Other Metal Dolls) :
- సింధు ప్రజలు పాత్రల తయారీకి మట్టితో పాటు వెండి, రాగి, కంచు వంటి ఇతర లోహాలు వాడారు. వీరు ఎక్కువగా ఉపయోగించిన లోహం కాంస్యం. ప్రపంచంలో మొదటిగా వెండిని వాడినది వీరే.
- వీరి అద్భుతమైన కళకు నిదర్శనం మొహెంజోదారోలో బయల్పడిన కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహం. కాగా, వీరి కళాత్ముకతకి మరో నిదర్శనం ‘గడ్డం గల పురుషుని విగ్రహం’ (మొహెంజోదారో).
- నాట్యగత్తె నెక్లెస్ ధరించి నగ్నంగా (Naked) ఉన్నది. కుడిచేయి నడుముపై (Hip), ఎడమ చేయి గాజుల కలిగి విశ్రాంతి స్థితిలో (Relaxed Mode) ఉంది.
- దైమాబాద్‌లో (మహారాష్ట్ర) జరిపిన త్రవ్వకాలలో కాంస్యముతో చేసిన ఏనుగు, ఖడ్గమృగం(రైనో), మరియు రథము గల బొమ్మలు బయల్పడ్డాయి.
—
4. కుండలు (Pottery):
- నల్లని బంకమట్టితో కుండలను తయారు చేసేవారు. కుండలపై ⁸రేఖాకృతులను మరియు చిత్రాలను నల్లటి పూతతో చిత్రీకరించేవారు. సింధు నాగరికత వాసుల కుండలకు గల పేరు
- మట్టిపాత్రల అలంకారాలలో ఎక్కువగా ఆకులు కనిపిస్తాయి. చేపలు, వలయాలు కూడా ఉన్నాయి.
సింధు నాగరికత ప్రజలకు తెలియనవి :
> 1. లోహం : ఇనుము
> 2. వస్త్రం : సిల్కు
> 3. జంతువులు : గుర్రం, జిరాఫీ, సింహం
> 4. పంటలు : చెరకు మరియు పప్పుదినుసులు
ఆర్థికవ్యవస్థ
- ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధార పరిశ్రమలపై ఆధారపడింది. అనగా వీరి ముఖ్యవృత్తులు వ్యవసాయం & వాణిజ్యం. సింధు నాగరికత ఆర్థిక వ్యవస్థను వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపార-వాణిజ్యం అను 3 రకాలుగా విభజించవచ్చు.
1. వ్యవసాయం (Agriculture):
- సింధుప్రజలు వ్యవసాయాన్ని ప్రధానంగా బావులు, చెరువుల ద్వారానే చేశారు.
- సాగునీటి కాలువల ద్వారా వ్యవసాయాన్ని అవలంబించకపోవడాన్ని D.D. కౌశాంబి పేర్కొంటూ “సింధు ప్రజలు వినూత్న పద్ధతుల స్వీకరణకు విముఖులు” అన్నాడు.
వ్యాపార, వాణిజ్యములు కూడా దాదాపుగా వ్యవసాయంపై ఆధారపడేవి.
వీరి ఆర్థికవ్యవస్థ వ్యవసాయ ఆధారితం మరియు మిగులు ఆర్థికవ్యవస్థగా ఉండేది. ప్రజలు సింధునది వరద నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు.
సింధు నాగరికత కాలపు వ్యవసాయ పనిముట్లు: గొర్రు మరియు పారలు (కొయ్యతో చేసినవి).
వీరు పండించిన ప్రధాన పంటలు బార్లీ మరియు గోధుమ కాగా, ఇతర పంటలు పత్తి, నువ్వులు, జొన్నలు, తృణధాన్యాలు, బఠాణీ, ఆవాలు. కాలాల వారీగా చూస్తే, ఖరీఫ్ కాలంలో పత్తి, ఆవాలు, నువ్వులను పండించగా, రబీ కాలంలో గోధుమ మరియు బార్లీ పంటలను పండించారు.
నాణ్యమైన బార్లీ పంటను పండించిన ప్రాంతం : బనవాలి.
వరి సాగు చేసినట్లు ఆధారాలు లేవని A.L. భాషం భావించగా, అయితే కొన్ని ప్రాంతాలలో వరిసాగు జరిగిందని రోమిల్లా థాపర్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలో మొదటిగా పత్తిని పండించిన వారు సింధు ప్రజలు. సుమేరియన్లు మరియు గ్రీకులు పత్తిని సిండన్ (Sindon) అని పిలిచేవారు. కారణం పత్తిని క్యూనిఫామ్ లిపిలో (సుమేరియన్ లిపి) సిందన్ అని పేర్కొంటారు.
సింధు ప్రాంతం నుండి దిగుమతి చేసుకున్న పత్తి బేళ్ళు లభ్యమైన మెసపోటేమియా నాగరికత పట్టణం-ఉమ్మా.
ఈ నాగరికత ప్రజలు ఎద్దులు, కుక్కలు, పందులు, పిల్లులు, గేదెలు, మేకలు, గొర్రెల వంటి జంతువులను మచ్చిక చేసుకున్నారు. కుక్కలు Pets గా ఉండేవి. ముద్రికలపై ఎక్కువగా ముద్రించిన జంతువు ఎద్దు.
సింధు ప్రజల ప్రధానమైన రవాణా సాధనం – ఎడ్లబండి లేదా ఎక్కా (Ekka).
**వివిధ జంతువుల అవశేషాలు లభించిన ప్రాంతాలు:**
| ప్రాంతం | అవశేషాలు |
| **లోథాల్** | టెర్రకోట గుర్రపు బొమ్మ |
| **సుర్కోటడా** | గుర్రపు అస్థిపంజరం (ఇది గుర్రానిది కాదని రోమిల్లా థాపర్ పేర్కొంది) |
| **ఆమ్రి** | ఖడ్గమృగం |
| **కాలిబంగన్** | ఒంటె |
| **గుజరాత్** | ఏనుగు |
**2. పరిశ్రమలు (Industries) :**
సింధు ప్రజల ముఖ్య పరిశ్రమలుగా ఇటుకల పరిశ్రమ, పూసల పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమ, నౌకానిర్మాణ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమలను పరిగణిస్తారు. ముడి ధాతువు నుండి రాగిని వేరుచేయడం ఈ నాగరికత ప్రజల లోహ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం.
నూలు, ఉన్నితో తయారుచేసిన వస్త్ర పరిశ్రమ ప్రధానమైనది. కాగా, రాగి, తగరాన్ని (Copper & Tin) కలిపి కంచు (Bronze) తయారుచేసి కంచు పరిశ్రమను అభివృద్ధి చేశారు. కంచు పరిశ్రమ ఆధారాలు హరప్పా, చాన్హుదారోలలో బయల్పడ్డాయి
పూసల, గాజుల పరిశ్రమ ఆధారాలు లభించిన ప్రాంతాలు – బాలకోట్, లోథాల్, చాన్హుదారో.
సింధు ప్రజలు దువ్వెనలు, కాటుక పుల్లలు, సూదులను తయారు చేయడానికి జంతువుల దంతాలు ఉపయోగించారు.
**3. వ్యాపార, వాణిజ్యాలు (Trade & Commerce) :**
సింధు నాగరికత కాలంలో వ్యాపారం దేశీయంగాను మరియు అంతర్జాతీయంగాను జరిగింది. వివిధ రకాలైన వస్తువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు లభించకపోవడంతో అనేక ప్రాంతాల నుండి అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకునేవారు. దాంతో పాటు మిగులు ఉత్పత్తులను, వస్తువులను ఎగుమతి చేసేవారు. వీరు వ్యాపారంలో వస్తు మార్పిడి / వినిమయ విధానం (Barter System) అవలంబించారు.
వీరి వ్యాపారానికి ప్రధాన ఆధారం ముద్రికలు. పర్షియన్ గల్ఫ్ ముద్రిక లోథాల్లో లభ్యం అయింది. పర్షియన్ గల్ఫ్‌లోని ‘సైలక్’ లో సింధునాగరికత ముద్రికలు లభ్యం అయ్యాయి. మెసపోటేమియా నాగరికతకు చెందిన బాబిడ్ కుండలు హరప్పాలో లభ్యమయ్యాయి.
- **హరప్పా ముద్రికలు లభ్యమైన సుమేరియా నాగరికత ప్రాంతాలు :**
- ఉర్
- సుసా
- తెష్
- టెల్ అస్సార్
- నిప్పూర్
సింధు నాగరికత వ్యాపారంలో ప్రముఖ పాత్ర పోషించిన రవాణా సాధనాలు – ఎడ్లబండి, ఓడ.ఈ నాగరికత వ్యాపారం జరిగిన రేవు పట్టణాలు – లోథాల్, సుర్కోటడా, బాలకోట్, సుత్కజేండోర్.
సింధు ప్రజల వ్యాపారం మరియు వర్తక ప్రాంతాలు –** దిల్మున్, బహ్రెయిన్, మకన్
క్రీ.పూ 2300 సం॥లో ‘అక్కాడ్’ సామ్రాజ్యానికి చెందిన రాజు సార్గాన్ క్యూనిఫామ్ లిపిలో ఒక శాసనం వేయించాడు. ఈ శాసనంలో నౌకలు సుమేరియా మరియు మెలూహా (సింధు లేదా భారత్) మధ్య ప్రతిరోజు తిరిగావని పేర్కొన్నాడు.
సుమేరియా నుండి నౌకలు దిల్మున్ (నేటి బహ్రెయిన్) మరియు ‘మకన్’ రేవు పట్టణాల గుండా సింధు ప్రాంతానికి వచ్చేవని ఈ శాసనంలో పేర్కొన్నాడు
సుమేరియా శాసనాలలో సింధుప్రజలను **”మెలూహా” (Meluhha)** అని ప్రస్తావించారు.
**1. ప్రధాన ఎగుమతులు (Major Exports):**
- పత్తి
- కాటన్ టెక్స్టైల్స్
- ధాన్యాలు
- ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు, రాగి లోహం
- ఆభరణాలు, పూసలు మరియు విలువైన రాళ్లతో చేసినవి.
**2. ప్రధాన దిగుమతులు (Major Imports):**
- **ముఖ్యమైన దిగుమతి – వెండి**
సింధు వర్తకులు ఓడలకు దిక్సూచిగా పక్షిని ఉపయోగించినట్లుగా మెసపోటేమియాలోని ‘ఘరా’ వద్ద దొరికిన ముద్రికపై పక్షి ఉన్న ఓడ బొమ్మ బయటపడింది.
పక్షిని దిక్సూచిగా వాడే పద్ధతి జాతక (బాబిలోన్) జాతక కథలలో కనిపిస్తుంది.
వస్తువు దిగుమతి చేసుకున్న ప్రాంతాలు
| **1. బంగారం** | ఆఫ్ఘనిస్తాన్, దక్షిణ భారతదేశం (కోలార్ గనులు – కర్ణాటక) |
| **2. రాగి** | రాజస్థాన్‌లోని ఖేత్రి గనులు, బెలూచిస్తాన్, అరేబియా ప్రాంతం |
| **3. తగరం** | అరేబియా, బీహార్ |
| **4. లాపిస్ లాజులీ (ఇంద్రనీలమణి)** | బదక్షాన్ (ఆఫ్ఘనిస్తాన్) |
| **5. ఆగేట్ (Gemstone)** | సౌరాష్ట్ర (గుజరాత్) |
| **6. అమెథిస్ట్** | మహారాష్ట్ర |
| **7. జేడ్** | మధ్య ఆసియా |
| **8. వెండి** | ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ |
| **9. గవ్వలు** | గుజరాత్ |
| **10. టార్కోయిస్** | ఇరాన్ |
| **11. పగడాలు** | ఈజిప్టు |
| **12. స్టియాటైట్** | ఇరాన్ |
**తూనికలు–కొలతలు:
సింధు నాగరికత ప్రజలు ఖచ్చితమైన తూకములు, బరువులను ఉపయోగించారు. తూనిక రాళ్ల తయారీ మరో నైపుణ్యం గల వృత్తి. వీరు ఉపయోగించిన తూనిక రాయి ఆల్బాస్టార్.
తూనిక రాళ్ళు, కొలబద్దలు మొహెంజోదారో, హరప్పా మరియు చాన్హుదారోలలో లభ్యమైనవి. అదే విధంగా మెసపోటేమియాలో, పర్షియన్ గల్ఫ్‌లో తూనికలు బయల్పడినవి.
ప్రాథమిక తూనిక రాయి 13.63 గ్రా॥ బరువుంది. దీనిని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.
సింధు ప్రాంతాలలో లభ్యమైన తూనిక రాళ్ళ బరువులు 1, 2, 4, 10, 20, 40, 100, 200, 400, 800 యూనిట్ల రాళ్ళు.
పొడవులను కొలవడానికి క్రమబద్ధమైన గుర్తులున్న కొలబద్దను తయారు చేసేవారు. కొలబద్దలలో దశాంశమానం ను ఉపయోగించారు.
తూచే బరువుకు ప్రామాణికంగా 16 సంఖ్యతో పాటు, దాని రెట్టింపు సంఖ్యను (ఉదా॥ 32, 64) వాడారు.


