25 August 2026 Current Affairs – 25 ఆగస్ట్ 2026 కరెంటు అఫైర్స్

25 August 2026 Current Affairs

1. ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్”ను ప్రారంభించిన అమెరికా

  1. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచడానికి “ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్” పేరుతో కొత్త ఆర్థిక యుద్ధాన్ని ప్రారంభించింది.

ప్రధాన లక్ష్యం: ఇరాన్‌కు ఆర్థికంగా అందే ఆదాయ మార్గాలను, జీవనాధారాలను పూర్తిగా అడ్డుకోవడం మరియు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నిధులను నిలిపివేయడం.

లక్ష్యంగా చేసుకున్న రంగాలు: డిజిటల్ అసెట్స్ (క్రిప్టో కరెన్సీ), డిటర్జెంట్?, బొగ్గారం, ఏవియేషన్, షిప్పింగ్ అనే కీలక రంగాలు. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌తో సంబంధాలు కలిగి ఉన్న 60కి పైగా సంస్థలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది.

2. ఇరాన్ అనే దేశం అక్రమంగా యురేనియం నిల్వలను ఉపయోగించి అణుబాంబులు తయారు చేస్తుందన్న ఆరోపణతో అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా “OPERATION EPIC FURY” ద్వారా ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించగా, మరోవైపు ఇరాన్ “OPERATION TRUE PROMISE” ద్వారా ప్రతిదాడి చేయడం ప్రారంభించింది.

మరోవైపు ఇరాన్ దేశంలో ఉండే ప్రవాస భారతీయుల సంరక్షణకు OPERATION SINDHU, ఇజ్రాయెల్ దేశంలో ఉండే ప్రవాస భారతీయుల సంరక్షణకు OPERATION AJAYలను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

2. SCALP క్షిపణిని తయారుచేసిన ఫ్రాన్స్ మరియు బ్రిటన్

SCALP క్షిపణి అనేది ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు సంయుక్తంగా తయారుచేసిన శక్తివంతమైన దీర్ఘకాలిక క్రూయిజ్ క్షిపణి. దీనిని బ్రిటన్‌లో “Storm Shadow” అని కూడా పిలుస్తారు.

ఈ క్షిపణి సుమారు 250 కి.మీ. (150 మైళ్లు) దూరం వరకు వెళ్లి లక్ష్యాన్ని ఛేదించగలదు.

ఉద్దేశ్యం: శత్రువుల బలమైన బంకర్లు, కమాండ్ సెంటర్లు, వైమానిక స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం.

ఉక్రెయిన్‌లోనే స్వయంగా ఈ SCALP క్షిపణి విడిభాగాలను జోడించడానికి అవసరమైన సాంకేతిక రహస్యాలను పంచుకోవడానికి బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అంగీకరించాయి.

భారత వైమానిక దళం స్టాండ్-ఆఫ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి ఫ్రాన్స్‌తో సుమారు 300 మిలియన్ యూరోల వ్యయంతో కొత్త SCALP క్షిపణుల కొనుగోలు ఒప్పందం చర్చల్లో ఉంది.

భారత్–ఫ్రాన్స్ ఉమ్మడి సైనిక విన్యాసాలు: శక్తి (ARMY), వరుణ (NAVY), గరుడ (AIR FORCE).

భారత్–UK ఉమ్మడి సైనిక విన్యాసాలు: అజేయ్ వారియర్ (ARMY), ఇంద్రధనుష్ (NAVY), కొంకణ్ (AIR FORCE)

3. భారతదేశపు తొలి నాన్-GMO పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్

భారతదేశంలోనే మొట్టమొదటి నాన్-GMO అధిక విస్తరణ పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ వంగడాలను ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు వద్ద గౌర్మెట్ పాప్‌కార్నికా ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

కొత్త వంగడాల పేర్లు: క్రిస్మా 459, గోదారి 234.

వీటిని ఉపరాష్ట్రపతి C. P. రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. అబ్దుల్ నజీర్ ప్రారంభించారు.

లక్ష్యం: పాప్‌కార్న్ మొక్కజొన్న దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడం, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం మరియు రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం.

దేశవ్యాప్తంగా మొక్కజొన్నను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు – కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.

5. గర్భిణీ మిత్ర కోర్సును ప్రవేశపెట్టిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద

ఢిల్లీలోని All India Institute of Ayurveda (AIIA) 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6 నెలల “గర్భిణీ మిత్ర” కోర్సును ప్రారంభించింది.

ఒక్కో బ్యాచ్‌కు 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు.

అర్హత: కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండి, గుర్తింపు పొందిన బోర్డు నుండి విద్యార్హత కలిగి ఉండాలి.

ముఖ్య ఉద్దేశ్యాలు:

  1. గర్భిణీలకు ఆయుర్వేద పద్ధతిలో గర్భిణీ పరిచర్య, సూతిక పరిచర్య మరియు గర్భాధాన విధిపై అవగాహన కల్పించడం.
  2. పుట్టబోయే బిడ్డ సంరక్షణ, నవజాత శిశువు మసాజ్, బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోటోకాల్స్ నేర్పించడం.
  3. కోర్సు పూర్తి చేసినవారు ఆయుష్ కేంద్రాలు, ప్రసూతి క్లినిక్‌లు, NGOsలో గర్భిణీ మిత్ర అసిస్టెంట్లు మరియు యాంటెనాటల్ వెల్‌నెస్ గైడ్స్‌గా ఉద్యోగాలు పొందవచ్చు.

6. IT రెసిలెన్స్ ఇండెక్స్‌ను ప్రవేశపెట్టిన SEBI

మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల IT వ్యవస్థల పనితీరు, భద్రత మరియు స్థితిస్థాపకత (Resilience) అంచనా వేయడానికి SEBI (Securities and Exchange Board of India) IT రెసిలెన్స్ ఇండెక్స్ (ITRI) ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది.

ముఖ్య ఉద్దేశ్యం: స్టాక్ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలు మరియు క్లియరింగ్ కార్పొరేషన్లలో సాంకేతిక అవాంతరాలను ముందస్తుగా గుర్తించి సరిదిద్దడం.

ITRIకి సంబంధించిన పారామీటర్లు: లభ్యత, భద్రత, సమగ్రత (Integrity), పాలన (Governance), విశ్వసనీయత & పర్యవేక్షణ, వ్యాపార కొనసాగింపు, మాడ్యులారిటీ & ఫ్లెక్సిబిలిటీ, స్కేలబిలిటీ.

2027 ఫిబ్రవరి 28 నాటికి రియల్‌టైమ్ మానిటరింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పూర్తిస్థాయిలో అమల్లోకి రావాలి.

7. క్లౌడ్ అండ్ AI స్కిల్లింగ్ ఇనిషియేటివ్

National Skill Development Corporation (NSDC), AWS Education, Amazon Web Services తదితర సంస్థల సహకారంతో Cloud & AI Skilling Initiativeను ప్రారంభించాయి.

లక్ష్యం:

  1. దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది అభ్యర్థులకు ప్రాథమిక క్లౌడ్ మరియు AI అక్షరాస్యతను అందించడం.
  2. ఎంపిక చేసిన 10,000 మందికి Amazon Web Services re/Start ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగానికి ఉపయోగపడే ప్రత్యేకమైన ఇంటెన్సివ్ శిక్షణ ఇవ్వడం.
  3. ముఖ్యంగా Tier-2 (జనాభా 50,000కు పైగా), Tier-3 (జనాభా 20,000–50,000) నగరాలు మరియు వెనుకబడిన ప్రాంతాల్లోని యువతపై ప్రత్యేక దృ

8. సమరసతా సంకల్ప్ అభియాన్

సమరసతా సంకల్ప్ అభియాన్ అనేది 15వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి–సంత్ గురు రవిదాస్ 650వ జయంతిని స్మరించుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన దేశవ్యాప్త ప్రచారం.

ముఖ్య కార్యకలాపాలు:

  1. గురు రవిదాస్ మహారాజ్ కలశ్ వందన్ అభియాన్ – జాతీయ, రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయిలో 2026 జూలై 29 నుంచి సెప్టెంబర్ 10 వరకు నిర్వహించబడుతుంది.
  2. సమరసతా యాత్ర: 2026 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 5 వరకు పంజాబ్‌లోని జలంధర్ నుంచి వారణాసిలోని కాశీ వరకు సాగుతుంది

9. DURAND CUP 2026 విజేత – ఈస్ట్ బెంగాల్

కోల్‌కతాలోని వివేకానంద యువభారతి స్టేడియంలో 2026 సంవత్సరానికి నిర్వహించిన DURAND CUP (135వ ఎడిషన్) ఫైనల్‌లో మోహన్ బగాన్‌ను 4–1 తేడాతో ఓడించి ఈస్ట్ బెంగాల్ రికార్డు స్థాయిలో 17వసారి ఛాంపియన్‌గా నిలిచింది.

డ్యూరాండ్ కప్ అనేది భారతదేశంలో జరిగే వార్షిక ఫుట్‌బాల్ పోటీ.

ఇది మొట్టమొదటగా 1888లో హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలోని అన్నాడేల్‌లో జరిగింది.

డ్యూరాండ్ కప్ 2026 అవార్డులు

  1. ఉత్తమ ఆటగాడు (Golden Ball): ఎడ్మండ్ లాల్‌రిండికా – ఈస్ట్ బెంగాల్.
  2. అత్యధిక గోల్స్ (Golden Boot): అల్లాద్దీన్ అజరై – నార్త్ ఈస్ట్ యునైటెడ్ FC – 9 గోల్స్.
  3. ఉత్తమ గోల్ కీపర్ (Golden Glove): విశాల్ కైత్ – మోహన్ బగాన్ సూపర్ జెయింట్.

డ్యూరాండ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ సొసైటీ (DFTS) మరియు AIFF (All India Football Federation) సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తాయి.

ఇది ఆసియాలోనే పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో ఒకటి.

తొలి విజేత/రన్నరప్‌లు – రాయల్ స్కాట్స్ ఫ్యూజిలియర్స్, హైలాండ్ లైట్ ఇన్‌ఫాంట్రీ.

2025 విజేత/రన్నరప్‌లు – నార్త్‌ఈస్ట్ యునైటెడ్, మోహన్ బగాన్

10. స్కూల్ అడ్మిషన్ ఫారం లో కులం ఉండదు

  1. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ అడ్మిషన్ ఫార్మ్స్ లో స్టూడెంట్స్ జాయిన్ అయ్యేటప్పుడు కులం కాలమ్స్ తీసేసింది
  2. స్కూల్ పిల్లలలో కుల భావన లేకుండా అందరు సమానం అనే భావన కలిగేలా ఉండాలని ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది

11. ఆన్లైన్ సేఫ్టీ బిల్

  1. న్యూజీలాండ్ ప్రభుత్వం ఆన్లైన్ సేఫ్టీ బిల్ అనే కొత్త బిల్ ని తీసుకొచ్చింది
  2. 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధం.

12. తొలి స్వదేశీ బహుళార్ధసాధక నౌక ‘సమర్థక్’ నావికా దళానికి అప్పగింత

  1. కట్టుపల్లిలోని లార్సెన్ అండ్‌ టూబ్రో లిమిటెడ్ (ఎల్ అండ్‌టి) సంస్థ నిర్మించిన తొలి దేశీయ బహుళార్ధ సాధక నౌక (ఎంపీవీ) ‘సమర్థక్‌’ను ఇవాళ భారత నావికాదళానికి అప్పగించారు.
  2. ఈ నౌకలో 75 శాతానికి పైగా పరికరాలు దేశీయంగానే రూపొందించినవి
  3. ముద్ర నిఘా-గూఢచర్యం, తీరప్రాంత గస్తీ, మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలకు తోడ్పడే విధంగా ఈ నౌకను అత్యాధునికంగా తీర్చిదిద్దారు.
  4. సమర్థక్’ అంటే అండగా నిలిచేవాడు అని అర్ధం.

13. హైదరాబాద్‌లో ప్రారంభమైన బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూపు సమావేశం

  1. రెండు రోజుల పాటు నిర్వహించే బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ (ఏసీడబ్ల్యూజీ) సమావేశం ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది
  2. 26 ఆగస్టు 4, 5 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుంది
  3. హైదరాబాద్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Related Posts

APEDA బీహార్‌లోని పూర్ణియా నుండి గ్రీస్‌కు మఖానా ఎగుమతికి సులభతరం చేసింది

APEDA బీహార్‌లోని పూర్ణియా నుండి గ్రీస్‌కు మఖానా ఎగుమతి FOR TGPSC APPSC COMPITATIVE EXAMS PURPOSE APEDA గ్రీస్‌కు మఖానా ఎగుమతి

SUPREME COURT OF INDIA- భారత సుప్రీమ్ కోర్టు

భారత సుప్రీంకోర్టు మరియు న్యాయవ్యవస్థ – MCQs 1. భారత రాజ్యాంగంలోని ఏ భాగం (Part) మరియు ఏ ఆర్టికల్స్ సుప్రీంకోర్టు గురించి వివరిస్తాయి? A) పార్ట్-V, ఆర్టికల్స్ 124 నుండి 147 B) పార్ట్-VI, ఆర్టికల్స్ 214 నుండి 231…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *