17 SEPTEMBER 2026 Current Affairs – 17 సెప్టెంబర్ 2026 కరెంట్ అఫ్ఫైర్స్

17 సెప్టెంబర్ 2026 కరెంట్ అఫ్ఫైర్స్

వార్తల్లో ఎందుకు ఉంది? ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2026 సందర్భంగా ముంబైలో పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) ఇండియా నెట్ జీరో పోర్టల్ మరియు NAPCC డాష్‌బోర్డ్‌లను అధికారికంగా ప్రారంభించింది.

ముఖ్యమైన amshalu:

  • ప్రారంభించిన సందర్భం: ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2026
  • వేదిక: ముంబై
  • మంత్రిత్వ శాఖ: పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC)
  • నెట్ జీరో పోర్టల్ (Net Zero Portal): వివిధ సంస్థలు తమ నెట్ జీరో లక్ష్యాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవడానికి మరియు బహిర్గతం చేయడానికి ఒక కేంద్రీకృత వేదికను అందిస్తుంది.
  • NAPCC డాష్‌బోర్డ్ (NAPCC Dashboard): భారతదేశ జాతీయ వాతావరణ మార్పుల కార్యాచరణ ప్రణాళిక (NAPCC – National Action Plan on Climate Change) కింద ఉన్న వివిధ మిషన్‌ల పురోగతిని సమగ్రంగా పర్యవేక్షించడానికి ఇది సహాయపడుతుంది.

1. నీతి ఆయోగ్ ‘ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ (IEMI) 2025’ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ మొత్తం 84 పాయింట్ల అత్యధిక స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది.

మొదటి 5 రాష్ట్రాలు:

  • ఢిల్లీ: 84 పాయింట్లు
  • మహారాష్ట్ర: 78 పాయింట్లు
  • కర్ణాటక: 73 పాయింట్లు
  • చండీగఢ్: 71 పాయింట్లు
  • గోవా: 65 పాయింట్లు

మూడు ప్రధాన అంశాలు (Core Themes):

  • రవాణా విద్యుద్దీకరణ (Transport Electrification): ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ మరియు పురోగతి.
  • ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు (Charging Infrastructure): ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఉన్న సన్నద్ధత.
  • ఈవీ పరిశోధన & ఆవిష్కరణ (EV Research & Innovation): ఎలక్ట్రిక్ వాహన రంగంలో పరిశోధనలు మరియు నూతన ఆవిష్కరణల స్థితి.

వార్త విశేషాలు:

IEMI 2025 నివేదిక ప్రకారం, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును మూడు థీమ్‌ల పరిధిలోని 16 సూచికల ఆధారంగా అంచనా వేశారు. గత ఎడిషన్‌లో 77 పాయింట్లు సాధించిన ఢిల్లీ, ఈసారి తన స్కోర్‌ను 84కి పెంచుకుని అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.


భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఇటీవల మ్యాన్-పోర్టబుల్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ (ఎంపీ-ఏయూవీ) రూపకల్పన చేయగా, దాని ప్రయోగం విజయవంతమైంది.

విశాఖపట్నంలోని నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్‌)లో ఈ పరీక్షలను నిర్వహించి దీని పనితీరును అధికారులు నిర్ధారించారు.

సముద్ర జలాల్లో నీటి అడుగు భాగంలో ఉన్న శత్రుదేశాల క్షిపణులు మరియు మందుపాతరలను శబ్ద తరంగాల సాంకేతికతతో ఎలాంటి మానవ సహాయం లేకుండా గుర్తించడం, వర్గీకరించడం ఈ వాహనం యొక్క ప్రత్యేకత.

ఇది చిన్న పరిమాణంలో మరియు తక్కువ బరువుతో ఉండటం వల్ల దీన్ని సులభంగా ఒక చోటు నుండి మరో చోటుకి తరలించవచ్చు.


ప్రపంచ ఉత్పాదక రంగంలో భారత్ విశ్వసనీయ ప్రత్యామ్నాయ కేంద్రంగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

దిల్లీలో ‘సెమికాన్ ఇండియా’ సదస్సును ప్రధాని ప్రారంభించారు.

భారత్‌లో తయారైన చిప్స్ తొలిసారిగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయని, ఇవి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ లభిస్తున్నాయని తెలిపారు.

2022లో ప్రారంభించిన సెమీకండక్టర్ల కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని, ఈ విజయానికి పారిశ్రామిక ప్రముఖులే మూలస్తంభాలని పేర్కొన్నారు.

భారత్ సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కేటాయింపులను మొదటి దశలో ఉన్న 8 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లకు ప్రభుత్వం భారీగా పెంచింది.

చిప్ డిజైనింగ్ మరియు తదనుబంధ రంగాలలో లక్ష మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 70 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

దేశంలో ఆధునిక పరిజ్ఞాన అభివృద్ధికి స్వదేశీ, విదేశీ యువ పరిశోధకులు కలిసికట్టుగా ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు.


  • ​నివేదిక విడుదల: ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్-2026’ నివేదికను బుధవారం విడుదల చేసింది.
  • ​భారత్ స్థానం: గత మాదిరిగానే భారత్ ఈసారీ కూడా 131వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 145 దేశాల జాబితాలో భారత్ తర్వాత కేవలం 14 దేశాలు మాత్రమే ఉన్నాయి.
  • ​అగ్రస్థానాలు: ఐస్‌లాండ్, ఫిన్‌లాండ్, నార్వే దేశాలు మొదటి మూడు స్థానాల్లో నిలవగా, లింగ సమానత్వంలో ఐస్‌లాండ్ వరుసగా 16వ సారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
  • ​ప్రపంచ సగటు & అంచనా: వంద శాతం స్త్రీ-పురుష సమానత్వ సాధన లక్ష్యంగా ఉన్న ఈ సూచికలో ప్రస్తుత ప్రపంచ సగటు 69.2 శాతంగా ఉంది (గత ఏడాది కన్నా 0.4 శాతం మెరుగుపడింది). పూర్తి లింగ సమానత్వం సాధనకు ఇంకా 120 ఏళ్లు పట్టవచ్చని WEF అంచనా వేసింది.
  • ​భారత్ స్థితిగతులు: 140 కోట్ల మందికి పైగా జనులున్న భారత్‌లో స్త్రీ-పురుష సమానత్వ స్థాయి 64.5 శాతంగా ఉంది. ఇది ప్రపంచ సగటు కంటే తక్కువైనప్పటికీ, గత ఏడాది కన్నా భారత్‌లో కొంత పురోగతి ఉంది. 2006తో పోలిస్తే భారత్‌లో 4.3 శాతం మేర పురోగతి నమోదయింది.
  • ​రాజకీయ మరియు ఉద్యోగ రంగాల్లో పురోగతి: చట్టసభలు, సీనియర్ అధికారులు, మేనేజర్లలో మహిళల ప్రాతినిధ్యం 10 శాతానికి మెరుగుపడింది. మంత్రి పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం 2006లో 2.4 శాతం ఉండగా, 2026 నాటికి 5.9 శాతానికి పెరిగింది. రాజకీయ సాధికారత పరంగాంతరం 24.5 శాతం మేర తగ్గింది.
  • ​శ్రామిక శక్తి మరియు విద్య: శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం 2026లో 44.1 శాతంగా ఉంది. విద్యాసంస్థల్లో స్త్రీ-పురుష సమానత్వ స్థాయి 96.6 శాతంగా ఉంది (గత ఏడాది కన్నా ఇది 0.05 శాతం తక్కువ).
  • ​భారత్ కంటే దిగువన ఉన్న కొన్ని దేశాలు: పాపువా న్యూ గినియా, కువైట్, ఒమన్, ఖతార్, తజికిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, మొరాకో, మాలి, అల్జీరియా, కాంగోతో పాటు పాకిస్థాన్ (143), ఇరాన్ (144), చాద్ (145) దేశాలు ఉన్నాయి.

​ఏఐ రంగంలో మహిళలు తక్కువ: కృత్రిమ మేధ (ఏఐ) ఇంజనీరింగ్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారని, ఏఐ సంస్థలలో ప్రతి స్థాయిలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని డబ్ల్యూఈఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సాదియా జాహిది తెలిపారు.


  • ​కొత్త బాధ్యతలు: ప్రపంచ బ్యాంక్ తదుపరి ముఖ్య ఆర్థికవేత్తగా నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమెర్ (61) నియమితులయ్యారు.
  • ​ఎవరి స్థానంలో: గతంలో ఆగస్టులో పదవీ విరమణ చేసిన ఇందర్మిత్ గిల్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.
  • ​బాధ్యతల స్వీకరణ తేది: 2026 అక్టోబరు 1 నుంచి మైఖేల్ ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు.
  • ​ప్రస్తుత హోదా: ఈయన ప్రస్తుతం ‘యూనివర్సిటీ ఆఫ్ షికాగో’లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
  • ​నోబెల్ బహుమతి నేపథ్యం: ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలనకు చేసిన ప్రయోగాత్మక పరిశోధనలకు గాను, అభిజిత్ బెనర్జీ మరియు ఎస్తేర్ డఫ్లోలతో కలిసి 2019లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.
  • ​ప్రత్యేక రికార్డు: ప్రపంచ బ్యాంక్‌లో ముఖ్య ఆర్థికవేత్తగా బాధ్యతలు చేపట్టడానికి ముందే నోబెల్ బహుమతి సాధించిన మొదటి వ్యక్తిగా క్రెమెర్ రికార్డు సృష్టించారు.

​ఇతర ప్రముఖులు: గతంలో ప్రపంచ బ్యాంక్‌లో పనిచేసిన జోసెఫ్ స్టిగ్లిట్జ్, పాల్ రోమర్ వంటి వారు తమ పదవీ కాలం ముగిసిన తర్వాత నోబెల్ బహుమతి అందుకోవడం విశేషం.


  • ​యూరప్ కూటమి నిర్ణయం: చిన్నారుల సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధించే దిశగా 27 ఐరోపా దేశాల కూటమి చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
  • ​13 ఏళ్లలోపు వారికి నిషేధం: 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు, టీనేజర్లకు కొన్ని పరిమితులు విధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
  • ​ఉర్సులా వాన్ డెర్ లెయిన్ ప్రతిపాదనలు: ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయిన్ ఈ విషయమై పలు కీలక ప్రతిపాదనలను వెల్లడించారు.
  • ​ఆమె వ్యాఖ్యల ఉద్దేశ్యం: సాంకేతిక శక్తి అపారమైనదని దానిని వెనక్కి తీసుకెళ్లడం అసధ్యమనే వాదనతో ఏకీభవించమని, వ్యసనాలకు గురిచేసే ఫీచర్లు మరియు ఏఐ సాయంతో అమ్మాయిల ఫోటోలను అసభ్య చిత్రాలుగా మార్చడాన్ని అంగీకరించలేమని బ్రసెల్స్‌లో జరిగిన ఈయూ వార్షిక సమావేశంలో ఆమె పేర్కొన్నారు.
  • ​13-15 ఏళ్ల వయసు వారికి: 13 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలు తమ సంరక్షకుల పర్యవేక్షణలో సోషల్ మీడియాలో మినీ ఖాతాలు తెరవవచ్చు; అయితే వాటిలోని ఫీచర్లు, యాక్సెస్ చేసే సమయంపై పరిమితులు ఉంటాయి.

​15-18 ఏళ్ల వయసు వారికి: 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి ప్రత్యేకంగా సురక్షితమైన డిజైన్‌ను ఆయా ప్లాట్‌ఫామ్‌లు రూపొందించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు.


  • ​భారత్‌లో జూన్ – ఆగస్టు మధ్యకాలంలో వాతావరణ మార్పుల కారణంగా 11.7 కోట్ల మంది ప్రజలు కనీసం 30 రోజులపాటు ప్రమాదకర వేడికి గురయ్యారు.
  • ​ప్రపంచంలోనే ఈ వేడి బాధితులు అత్యధికంగా ఉన్న దేశం భారత్ అని ఓ అధ్యయనం వెల్లడించింది.
  • ​స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ‘క్లైమేట్ సెంట్రల్’ బుధవారం ఈ నివేదికను విడుదల చేసింది.
  • ​1991-2020 మధ్య నాటి సరాసరితో పోలిస్తే, ఈ ఏడాది జూన్ – ఆగస్టు నెలల్లో భారత్‌లో ఉష్ణోగ్రత సాధారణం కన్నా 0.7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది.
  • ​ఈ వేసవిలో భారత్‌లో ప్రతి ఒక్కరూ సగటున 39 రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలను అనుభవించారు.

​ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మందికి పైగా ప్రజలు 30 లేదా అంతకంటే ఎక్కువ రోజులు ప్రమాదకరమైన వేడితో సతమతమయ్యారు.

​వివిధ నగరాల్లో ప్రమాదకర వేడి నమోదైన రోజులు:

  • ​ముంబయిలో అత్యధికంగా 86 రోజులు.​శ్రీనగర్‌లో 53 రోజులు.​చెన్నైలో 40 రోజులు.​రాజ్‌కోట్‌లో 29 రోజులు.​అమృత్‌సర్‌లో 29 రోజులు.​లఖ్‌నవూలో 27 రోజులు.


  • ​అగ్రస్థానానికి యిమింగ్: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ మాతృసంస్థ ‘బైట్‌డ్యాన్స్’ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ అవతరించారు.
  • ​ఎవరిని వెనక్కి నెట్టారంటే: ఈ క్రమంలో ఆయన అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని వెనక్కి నెట్టారు.
  • ​నికర సంపద వివరాలు: అంతర్జాతీయంగా కృత్రిమ మేధ (ఏఐ) అనుబంధ సంస్థల్లో భారీ వృద్ధి నమోదవుతుండటంతో, యిమింగ్ నికర సంపద 105 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 10 లక్షల కోట్లు) మార్కును దాటినట్లు బ్లూమ్‌బెర్గ్ బుధవారం వెల్లడించింది.
  • ​సంపదలో భారీ పెరుగుదల: 43 ఏళ్ల జాంగ్ యిమింగ్ సంపద 2019 మార్చిలో 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం అది 8 రెట్లకు పైగా పెరిగింది. ఒక్క ఈ నెలలోనే ఆయన సంపద విలువ 12 బిలియన్ డాలర్లకు పైగా ఎగబాకింది.
  • ​అదానీ సంపద క్షీణత కారణాలు: జూన్‌లో అదానీ సంపద గరిష్ఠంగా 120 బిలియన్ డాలర్లకు చేరినప్పటికీ, ఎంఎస్‌సీఐ సూచీ రీబ్యాలెన్సింగ్, ముడిచమురు ధరల పెరుగుదల, బాండ్ల రాబడుల ఒత్తిడి కారణంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు క్షీణించాయి.
  • ​టిక్‌టాక్ నుంచి ఏఐ వైపు: షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమైన బైట్‌డ్యాన్స్ సంస్థ.. ఆ తర్వాత ఏఐ రంగంలోకి విస్తరించి, ‘డౌావో చాట్‌బాట్’, ‘సీడ్యాన్స్ వీడియో జనరేషన్ టూల్స్’ వంటి వాటితో భారీగా ప్రజాదరణ పొందింది. అమెరికాలో రాజకీయ, నియంత్రణ సవాళ్లు ఎదురైనా ఏఐ పెట్టుబడులను యిమింగ్ తగ్గించలేదు.

​టెక్నాలజీ ఆధిపత్యం: సంప్రదాయ ఇంధనం, పోర్టులు, మౌలిక రంగాలు లేదా భారీ పరిశ్రమల సంపద కంటే.. కృత్రిమ మేధ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సృష్టిస్తున్న ‘న్యూఏజ్’ సంపద ఆసియాలో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు ఈ తాజా పరిణామం తెలియజేస్తుంది.


  • ​పారా షూటింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది.
  • ​మిలీ షా, మోనా అగర్వాల్, అవని లేఖరాలతో కూడిన భారత జట్టు ఆర్2 మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్‌1 విభాగంలో స్వర్ణం గెలుచుకుంది.
  • ​ఈ జట్టు మొత్తం 1878.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
  • ​వ్యక్తిగత విభాగంలో మోనా అగర్వాల్ రజతం నెగ్గగా, అవని లేఖర కాంస్య పతకం సాధించారు.
  • ​ఆర్1 పురుషుల ఎయిర్‌రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్‌1 విభాగంలో రాకేష్, ఆనందం కృష్ణ, స్వరూపల త్రయం రజత పతకం సొంతం చేసుకుంది.

​ఈ పురుషుల జట్టు 1856.3 పాయింట్లు స్కోర్ చేసింది.


  • ​ప్రపంచంలోని టాప్ 100 ఎంబీఏ, బిజినెస్ మాస్టర్స్ విద్యా సంస్థల్లో మన దేశానికి చెందిన 3 ఐఐఎంలు తమ చోటును నిలబెట్టుకున్నాయి.
  • ​అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ విద్యా సంస్థల స్థానాలు కొంత దిగజారాయి.
  • ​ఉపాధి, ఉద్యోగ కల్పనలో రాబడిని ఇచ్చే స్థాయి తగ్గిపోవడం వల్ల ర్యాంకుల్లో ఇవి వెనుకబడ్డాయి.

​బుధవారం విడుదలైన క్యూఎస్-2027 ర్యాంకుల ప్రకారం ఐఐఎంల స్థానాలు:

  • ​ఐఐఎం బెంగళూరు: 64వ స్థానం.​ఐఐఎం అహ్మదాబాద్: 70వ స్థానం.​ఐఐఎం కలకత్తా: 95వ స్థానం.


  • ​కొత్త జాతి ఆవిష్కరణ: కేంద్ర సముద్ర మৎস্য పరిశోధన సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్తలు అరేబియా సముద్రపు లోతుజలాలలో ఒక కొత్త రకం కాంగర్ ఈల్ చేప జాతిని కనుగొన్నారు.
  • ​నామకరణం: సంస్థ 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కొత్త చేప జాతికి ‘సీఎంఎఫ్‌ఆర్‌ఐ’ (CMFRI) అని పేరు పెట్టారు.
  • ​ఎక్కడ, ఎప్పుడు కనుగొన్నారు: ఈ జాతిని ఈ ఏడాది జనవరిలో కొల్లం తీర ప్రాంత జలాల్లో సుమారు 300 మీటర్ల లోతులో గుర్తించినట్లు సీఎంఎఫ్‌ఆర్‌ఐ బుధవారం వెల్లడించింది.
  • ​ప్రత్యేకత: భారతదేశ తీరజలాల్లో ఇప్పటివరకు గుర్తించిన 12 అరియోసోమా ఈల్ జాతులతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంది.

​శాస్త్రవేత్తల అభిప్రాయం: ఈ పరిశోధనా ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన సీఎంఎఫ్‌ఆర్‌ఐ ముఖ్య శాస్త్రజ్ఞురాలు డాక్టర్ రేఖా జె నాయర్ మాట్లాడుతూ.. ఈ జాతి వాణిజ్య సామర్థ్యాన్ని సవివరంగా అధ్యయనం చేసిన తర్వాతే తేల్చగలమని తెలిపారు.


  • ​ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘ఓం దివ్య దర్శన్ సంస్థాన్’ అనే సంస్థ ఆవుపేడ ఆధారంగా బుల్లెట్‍ప్రూఫ్ జాకెట్లు, స్పేన్ సూట్లు తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది.

​ఆవుపేడ నుంచి లభించే నానో సెల్యులోజ్‌ను ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి రక్షణ కవచాల తయారీలో ఉపయోగించే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

Related Posts

భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే, సురక్షితమైన మరియు నాణ్యమైన హైవే మౌలిక సదుపాయాల కోసం “చింతన్ శిబిర్ 2026”

“చింతన్ శిబిర్ 2026” దేశంలో హైవే మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పంపిణీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు అమలు చేసే ఏజెన్సీల సీనియర్ ప్రతినిధులతో కలిసి కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ…

భారత్‌లో మొట్టమొదటి 5.56 కి.మీ. ఫ్రీ-స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) లింక్ విజయవంతం

భారత్‌లో మొట్టమొదటి 5.56 కి.మీ. ఫ్రీ-స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) లింక్ విజయవంతం పీఐబీ ఢిల్లీ: క్యూన్యూ ల్యాబ్స్ (QNu Labs), భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N) మరియు ఐఐటీ గాంధీనగర్ సంయుక్తంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *