05 – 06 సెప్టెంబర్ 2026 కరెంట్ అఫ్ఫైర్స్
01. జాతీయ స్మారక కట్టడంగా “గొల్ల గుడి”
- Historic Gollala Gudi temple added to India’s national monuments list
- తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేటలోని పురాతన కట్టడం “గొల్ల గుడి”కి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
- ఈ కట్టడాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యలోని భారత పురావస్తు సర్వేక్షణ (ASI) అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
- ”గొల్ల గుడి”ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా ప్రకటించే ఉద్దేశంతో 2026 మార్చి 6న కేంద్రం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది, దీనిలో భాగంగా గొల్ల గుడి పరిధిలోని పావు ఎకరం విస్తీర్ణాన్ని రక్షిత ప్రాంతంగా ASI తమ యజమాన్యంలోకి తీసుకుంటుంది.
- 1958 నాటి ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాల చట్టం వీటిని ASI (ARCHAEOLOGICAL SURVEY OF INDIA) పరిరక్షిస్తుంది.
- దేశవ్యాప్తంగా దాదాపు 3693 జాతీయ ప్రాముఖ్యత గల స్మారక చిహ్నాలున్నాయి.
- అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో (741) ఉన్నాయి. తదుపరి కర్ణాటక (506), తమిళనాడు (413) నిలుస్తాయి.
- తెలంగాణ నుండి జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలు: చార్మినార్, గోల్కొండకోట, రామప్ప ఆలయం, వరంగల్కోట, కుతుబ్‌షాహీ సమాధులు, వేయిస్తంభాల గుడి.
- నిబంధనలు: స్మారక చిహ్నాలకు 100 మీటర్ల దూరం వరకు నిషిద్ధ ప్రాంతం (PROHIBITED AREA), మరో 200 మీటర్ల వరకు నియంత్రిత ప్రాంతం (REGULATED AREA) ఉంటుంది.
02. ARTEMIS ACCORDS లో చేరిన 71వ దేశంగా తుర్కియే
- 2026వ సం||లో ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసిన 71వ దేశంగా తుర్కియే ఆగష్టు 31న అధికారికంగా చేరింది.
- చంద్రుడు, అంగారకుడు, ఇతర ఖగోళ వస్తువులపై శాంతియుత, సురక్షిత మరియు పారదర్శక అంతరిక్ష అన్వేషణను ప్రోత్సహించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.
- ఆర్టెమిస్ ఒప్పందాలపై తౌలుత 2020వ సం||లో అమెరికాతోపాటు మరో 7 దేశాలు (ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, లక్సెంబర్గ్, UAE, UK) కలిసి సంతకం చేశారు.
- భారత్ (27వ దేశం) 2023 జూన్ 21న ఈ ఒప్పందాలపై సంతకం చేసింది మరియు 69వ దేశంగా సెర్బియా, 70వ దేశంగా మారిషస్ నిలిచాయి.
- మరోవైపు భవిష్యత్తులో చంద్రుడిపై వ్యోమగాములను ప్రవేశపెట్టేందుకు చైనా 2030ని మరియు భారత్ 2040ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.
03. RS-24 యార్స్ ఖండంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా
- RS-24 యార్స్ అనేది రష్యాకు చెందిన అత్యంత శక్తివంతమైన ఖండంతర బాలిస్టిక్ క్షిపణి. రష్యా తన భూ ఆధారిత అణు రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి దీనిని రూపొందించింది.
- ఇటీవల రష్యా సైన్యం ప్లేసెట్స్ కాస్మోడ్రోమ్ నుండి కంచత్కాలోని కురా టెస్ట్ రేంజ్ వరకు 6700Kmల దారాన్ని విజయవంతంగా ఛేదించి, RS-24 యార్స్ మొబైల్ లాంచర్ సామర్థ్యాన్ని పరీక్షించింది మరియు దీని గరిష్ట పరిధి 10,500-12,000Kmలు.
- RS-24 యార్స్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికిల్స్ (MIRV) సాంకేతికతను కలిగి ఉంది దీనిద్వారా ఒకే క్షిపణి 4-10 వేర్వేరు అణు వార్హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించగలదు.
- ఇది 3 స్టేట్ సాలిడ్ ప్యুয়ারిల్ ఆధారంగా పనిచేస్తుంది మరియు దీనిని అండర్ గ్రౌండ్ గోతులు (SILOS), రోడ్ మొబైల్ లాంచర్ల (టక్కులు) ద్వారా కూడా ప్రయోగించవచ్చు. MIRV టెక్నాలజీ దేశాలు – అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ మరియు ఇండియా.
- రష్యా రక్షణ దళాలలో పాతబడిపోయిన టోపోల్-ఎమ్ (TOPOL-M) వంటి క్షిపణుల స్థానంలో ఈ RS-24 యార్స్ ప్రస్తుతం రష్యా అణు రక్షణ దళానికి ప్రధాన వెన్నుముకగా మారింది.
04. భారతదేశపు మొట్టమొదటి “ఫ్లయింగ్ డ్రోన్స్ క్యారియర్”
- భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ ఎగిరే డ్రోన్ క్యారియర్ వ్యవస్థ “క్యారియర్-6” దీనిని “వాహాక్-6” అని కూడా పిలుస్తారు.
- ఆధునిక యుద్ధ రంగంలో భారత సైన్యానికి సహాయపడేలా ఆండ్రోయియిర్ అనే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ మరియు ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వాహాక్-6ను సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
- ప్రత్యేకతలు: 1. క్యారియర్-6లో రెండు రకాల డ్రోన్స్ ఉంటాయి అవి అలఫ్-5 (శత్రువుల స్థావరాలను కనిపెట్టి నిఘావేయడం), అలఫ్-K (శత్రువులపై నేరుగా దాడులు) ఇవి GPS సిగ్నల్స్ సాయం లేకుండానే శత్రువుల స్థావరాలను గుర్తించి నాశనం చేయగలవు.
- క్యారియర్-6 మదర్షిప్ (SABAL 20) గాల్లో ప్రయాణిస్తూ తదతో పాటు 6 చిన్న అలఫ్ మైక్రోడ్రోన్లను మోసుకెళ్లగలదు మరియు గాల్లో వాటిని మోహరించగలదు, దీనికి సాంకేతిక సహకారాన్ని IIT ఖాన్పూర్ అందించింది.
05. స్వచ్ఛ సాగర్ – సురక్షిత సాగర్ 5వ ఎడిషన్
- దేశవ్యాప్తంగా సముద్ర తీరాల శుభత, తీరప్రాంత పరిరక్షణే ప్రధాన ఉద్దేశ్యంతో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 సెప్టెంబర్ 12-19 వరకు జరుగుతుంది.
- దీనిలో భాగంగా 100మైన ప్రదేశాలలో బీచ్ క్లీనప్ డ్రైవులు, సైక్లింగ్ ర్యాలీలు, మారథాన్లు నిర్వహిస్తారు. విద్యార్థులలో అవగాహన కోసం మొట్టమొదటిసారిగా నేషనల్ ఓషన్ ఒలిపియాడ్ నిర్వహిస్తున్నారు.
- దీనిని కేంద్ర S&T శాఖమంత్రి జితేంద్రసింగ్ “పృథ్వీవిజ్ఞాన్” పథకంలో భాగంగా ప్రారంభించారు. స్వచ్ఛసాగర్, సురక్షిత సాగర్ యొక్క మొదటి ఎడిషన్ 2022వ సం||లో నిర్వహించబడింది.
- దీనిని కేంద్ర భూగర్ధ శాస్త్రాల మంత్రిత్వశాఖ మరియు నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (చెన్నై) సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది (INTERNATIONAL COASTAL CLEANUP DAY SEPTEMBER 19).
- భారతదేశ మొత్తం సముద్రతీరరేఖ పొడవు 11098Kmలు కాగా, వాటిలో 9 రాష్ట్రాలు మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. దేశవ్యాప్తంగా శూన్య కర్బన ఉద్గార లక్ష్యాన్ని సాధించుటకు నిర్దేశించుకున్న టార్గెట్ 2070.
- అత్యధిక మరియు అత్యల్ప సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు-గుజరాత్ (2340.62KM), గోవా (193.97KM)/అండమాన్ నికోబార్ (3063KM), పుదుచ్చేరి (42.65KM).
- భూమి వ్యవస్థ మరియు వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి కేంద్రం పృథ్వీ విజ్ఞాన్ పథకానికి ఆమోదం తెలిపింది. దీని వ్యవధి 2021-2026 మరియు అంచనా వ్యయం రూ॥ 4797 కోట్లు.
06. జాతీయ పోషకాహార వారం (సెప్టెంబర్ 1 నుండి 7)
- సమతుల్య ఆహారం మరియు సరైన పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దేశంలో ప్రతి సం|| సెప్టెంబర్ 1 నుండి 7 వరకు జాతీయ పోషకాహార వారాన్ని పాటిస్తారు.
- జాతీయ పోషకాహార వారం అనేది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యలోని ఆహార మరియు పోషకాహార బోర్డు ద్వారా 1982లో ప్రారంభించబడింది.
- ముఖ్యమైన పథకాలు: 1. పోషణ్ పక్ష్యాడా (2019)-మహిళలు, పిల్లల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడానికి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించే వార్షిక అవగాహన కార్యక్రమం. 8వ విడత పోషణ్ పక్ష్యాడా కార్యక్రమం 2026 ఏప్రిల్ 9-23 వరకు నిర్వహించబడింది, థీమ్-MAXIMIZING BRAIN DEVELOPMENT IN THE FIRST SIX YEARS OF LIFE.
-
- పోషణ్ శక్తి నిర్మాణ్-దేశవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూళ్లలో 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు పాష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకం స్థానంలో ఇది 2021లో ప్రవేశపెట్టబడింది.
07. AYURVARTA (ఆయుర్వార్త) డిజిటల్ డైలాగ్ 2026
- ఆయుర్వేదం యొక్క ప్రామాణిక విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాలను మరియు నేటి కాలంలో దాని ప్రాముఖ్యతను భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్త శ్రోతలకు చేరవేయడమే లక్ష్యంగా ఆల్ ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఆయుర్వార్త అనే ప్రత్యేక డిజిటల్ డైలాగ్ సిరీసన్ను ప్రారంభించింది.
- సెప్టెంబర్ 23న జరగబోయే ఆయుర్వేద దినోత్సవానికి ముందుగా ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకువచ్చారు.
- దేశంలో తొలిసారిగా ఆయుష్ మంత్రిత్వశాఖను 2014వ సం||లో ప్రవేశపెట్టడం జరిగింది (AYURVAGED YOGA AND NATUROPUNY UNANI SIDDHA AND HOMEOPATHY) దీనికి ప్రస్తుత మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ వ్యవహరించడం జరుగుతుంది.
- భారతదేశం యొక్క మొట్టమొదటి అంకితమైన ఆయుష్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న మహాయోగి గురు గోరఖ్‌నాథ్ ఆయుష్ విశ్వవిద్యాలయం గుర్తింపబడింది.
- దేశంలో 2010-2024 వరకు ధన్వంతరి జయంతి తిథి (అక్టోబర్ 28) ప్రకారం ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకునేవారు, కాని 2025 నుండి సెప్టెంబర్ 23న ఆయుష్ మంత్రిత్వశాఖ ఆయుర్వేద దినోత్సవాన్ని అంతర్జాతీయంగా నిర్వహిస్తుంది.
07. పరిశ్రమల భద్రతకు అగ్నికవచ్
- అగ్నికవచ్ అనేది పారిశ్రామిక భద్రతను బలోపేతం చేయడానికి ప్రారంభించిన మొట్టమొదటి స్వదేశీ AI ఆధారిత ప్రైసెస్-సేఫ్టీ మరియు రిస్క్ మోడలింగ్ ప్లాట్‌ఫామ్.
- అగ్నికవచ్ సేఫ్టీ సొల్యూషన్స్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ J.P గుప్తా నేతృత్వంలో ఈ సాంకేతికతను రూపొందించారు.
- ఈ ప్లాట్‌ఫామ్ క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్, AI మరియు అడ్వాన్స్డ్ సిమ్యులేషన్ సహాయంతో పారిశ్రామిక ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి నివారిస్తుంది.
- ప్రధాన లక్ష్యం : గ్రీన్ హైడ్రోజన్, బయో ఇథనాల్, న్యూక్లియర్ ఎనర్జీ వంటి కొత్త ఇంధన రంగాలలో పారిశ్రామిక భద్రతను మెరుగుపరచడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
08. తుమ్మిడి హట్టి బ్యారేజ్ వివాదం
- తుమ్మిడి హట్టి బ్యారేజ్ ప్రాజెక్టును 152 మీటర్ల FRL (FULL RESERVOIR LEVEL) ఎత్తుతో నిర్మించే అంశంపై కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల మధ్య కీలక సమావేశం జరిగింది.
- ప్రాజెక్ట్ విశేషాలు: 1. తెలంగాణలోని ఉత్తర ప్రాంతాలకు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించేందుకు ప్రాణహిత నదిపై తుమ్మిడి హట్టి బ్యారేజీని ప్రతిపాదించారు.
-
- ప్రాజెక్టు ఎత్తును 148-152 మీటర్లకు పెంచినా ముంపు ప్రమాదం పెద్దగా ఉండదని పూణేలోని CWPRS (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) అధ్యయనం స్పష్టం చేసిందని తెలంగాణ తెలిపింది. మరోవైపు ముంపు సమస్యపై మహారాష్ట్ర ఆందోళన వ్యక్తం చేసింది.
- గోదావరి నదికి ప్రాణహిత అతిపెద్ద ఉపనది కాగా, మంజీర అత్యంత పొడవైన ఉపనది.
- గోదావరి ప్రధాన ఉపనదులు (ఎడమ): పూర్ణ, ప్రాణహిత (పెన్‌గంగ, వార్ధా, హైన్గంగ నదుల సంయుక్త ప్రవాహం), ఇంద్రావతి, శబరి.
- గోదావరి కుడి ఉపనదులు :- ప్రవర, మంజీర, మనేరు, కిన్నెరసాని.
- దేశవ్యాప్తంగా ఉండే డ్యాముల యొక్క భద్రతకై డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021లో ప్రవేశపెట్టబడింది మరియు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWE) స్థాపన-1945, చైర్మన్-అనుపమ్ ప్రసాద్, కేంద్రజలశక్తి శాఖమంత్రి C.R.పాటిల్.
09. టెన్నింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులు-2024
- భూ సాహసం, జల సాహసం, వాయు సాహసం మరియు జీవితకాల సాఫల్య పురస్కారం అనే విభాగాలలో ఈ అవార్డులను ప్రధానం చేస్తారు.
- ఈ అవార్డుల విజేతలు:
- 1. బల్జిత్ కౌర్ (విభాగం-లాండ్ అడ్వెంచర్ భూ సాహసాలు).
- 2. స్కాళ్లంగ్ రిగ్జిన్ (విభాగం-లాండ్ అడ్వెంచర్ భూ సాహసాలు).
- 3. రిమో సాహా (విభాగం-వాటర్ అడ్వెంచర్ జల సాహసాలు).
- 4. శివ్ ప్రసాద్ చమోలి (విభాగం-లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ జీవితకాల సాఫల్య పురస్కారం).
- అర్జున అవార్డుతో సమాన హోదా కలిగిన ఈ అవార్డులను యువతలో ధైర్యం, పట్టుదల, రిస్క్ తీసుకునే తత్వం మరియు క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను పెంపొందించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేస్తుంది.
- ఈ అవార్డు గ్రహీతలకు కాంస్య విగ్రహం, ధృవీకరణ పత్రం మరియు రూ.15 లక్షల నగదును బహుమతిగా ప్రధనం చేస్తారు.
10. విద్యా మంత్రిత్వ శాఖ (MoE) AISHE 2022-23 & 2023-24 విడుదల: గత దశాబ్ద కాలంలో గణనీయమైన విస్తరణను నమోదు చేసిన భారతదేశ ఉన్నత విద్యా రంగం
- సంస్థాగత విస్తరణ: 2014-15లో 760గా ఉన్న విశ్వవిద్యాలయాల సంఖ్య 2023-24 నాటికి 69.6% పెరిగి 1,289కి చేరింది, కళాశాలల సంఖ్య 38,498 నుండి 48,246కి (25.3%) పెరిగింది, మరియు స్టాండ్అలోన్ సంస్థలు 12,276 నుండి 15,221కి (సుమారు 24%) పెరిగాయి.
- నమోదు మరియు స్థూల నమోదు నిష్పత్తి (GER): భారతదేశ ఉన్నత విద్యలో మొత్తం విద్యార్థుల నమోదు 31.5% పెరిగి, 2014-15లో 3.42 కోట్ల నుండి 2023-24 నాటికి 4.50 కోట్లకు చేరుకుంది. ఉన్నత విద్యలో మొత్తం GER 2014-15లో 23.7% నుండి 2023-24 నాటికి 30.0%కి పెరిగింది.
- మహిళల భాగస్వామ్యం మరియు లింగ సమానత్వం: మహిళల నమోదు 42.2% వేగంగా పెరిగి 2.24 కోట్లకు చేరుకుంది. మహిళల GER 31.2%కి పెరిగి, 28.9% ఉన్న పురుషుల GERను దాటింది. అలాగే జెండర్ పారిటీ ఇండెక్స్ (GPI) 1.08కి చేరుకుంది, మహిళల భాగస్వామ్యం సమానత్వం కంటే పైన ఉండటం ఇది వరుసగా ఏడవ సంవత్సరం.
- సామాజిక వర్గాల ప్రాతినిధ్యం: 2014-15 నుండి సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల నమోదులో భారీ వృద్ధి నమోదయింది. 2023-24 నాటికి షెడ్యూల్డ్ కులాల (SC) విద్యార్థులు 51.4% పెరిగి 69.72 లక్షలకు, షెడ్యూల్డ్ తెగల (ST) విద్యార్థులు 75.7% పెరిగి 28.83 లక్షలకు, మరియు ఇతర వెనుకబడిన తరగతుల (OBC) విద్యార్థులు 60.2% పెరిగి 1.80 కోట్లకు చేరుకున్నారు.
- STEM నమోదు: సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ (STEM) లో నమోదు మొదటిసారిగా ఒక కోటి మార్కును దాటి, 2023-24 నాటికి 1.02 కోట్లకు చేరుకుంది. ఇందులో మహిళల వాటా 38.4% నుండి 44%కి పెరిగింది.
- ఫ్యాకల్టీ బలం: ఉన్నత విద్యా సంస్థలలో మొత్తం అధ్యాపకుల సంఖ్య 2023-24 నాటికి 17.32 లక్షలకు చేరుకుంది, ఇందులో మహిళా అధ్యాపకుల బలం 7.78 లక్షలకు పెరిగింది.
- గత 10 సంవత్సరాలలో, మహిళల నమోదు 42.2% పెరిగింది, అనగా 2014-15లో ఉన్న 1.57 కోట్ల నుండి 2023-24 నాటికి 2.24 కోట్లకు చేరుకుంది.
- స్థూల నమోదు నిష్పత్తి (GER): 2011 జనాభా అంచనాల ఆధారంగా 18-23 సంవత్సరాల వయస్సు గల మొత్తం జనాభాతో విద్యార్థుల నమోదు నిష్పత్తిని GERగా లెక్కిస్తారు.
- జెండర్ పారిటీ ఇండెక్స్ (GPI): డేటా ప్రకారం, ఉన్నత విద్యలో GPI 1.08గా ఉంది (2023-24లో). GPI 1.0 కంటే ఎక్కువగా ఉండటం ఇది వరుసగా 7వ సంవత్సరం, ఇది ఉన్నత విద్యలో పురుషులతో పోలిస్తే మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉందని సూచిస్తుంది.
11. లక్షద్వీప్‌లో ‘మిషన్ రంగీన్ మచ్ఛి 2031’
- లక్షద్వీప్‌లో ‘మిషన్ రంగీన్ మచ్ఛి 2031’ వ్యూహాత్మక చర్య ప్రణాళికను విడుదల చేసిన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్
- సెప్టెంబర్ 2026లో, మత్స్యశాఖ, మత్స్యకార, పాడిపరిశ్రమ మరియు పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ (MoFAHD) ఆధ్వర్యంలో లక్షద్వీప్‌లోని అగట్టిలో నిర్వహించిన మత్స్యకార అవగాహనా కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అలంకార చేపల పెంపకం అభివృద్ధి కోసం రూపొందించిన వ్యూహాత్మక చర్య ప్రణాళిక ‘మిషన్ రంగీన్ మచ్ఛి 2031’ని విడుదల చేశారు.
- ఈ కార్యక్రమంలో MoFAHD కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, MoFAHD రాష్ట్ర మంత్రి (MoS) ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్ మరియు తదితరులు పాల్గొన్నారు.
మిషన్ రంగీన్ మచ్ఛి 2031 గురించి:
- ఉద్దేశ్యం: ఈ చొరవ శాస్త్రీయ నిర్వహణ, బయోసెక్యూరిటీ చర్యలు, నాణ్యతా భరోసా మరియు నియంత్రణ పాటించడం ద్వారా అలంకార చేపల రంగానికి వ్యవస్థీకృత వృద్ధికి ఒకే రకమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది.
- ఫ్రేమ్‌వర్క్‌లు: ఈ చొరవకు సుస్టెయినబుల్ హార్నెస్టింగ్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ది ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (EEZ) రూల్స్, 2025 మరియు గైడ్‌లైన్స్ ఫర్ సుస్టెయినబుల్ హార్నెస్టింగ్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ది హై సీస్ బై ఇండియన్-ఫ్లాగ్డ్ ఫిషింగ్ వెసెల్స్, 2025 మద్దతునిస్తున్నాయి.
- నోడల్ మంత్రిత్వ శాఖ: ఈ కార్యక్రమాన్ని మత్స్యకార, పాడిపరిశ్రమ మరియు పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ (MoFAHD) ఆధ్వర్యంలోని మత్స్యశాఖ (DoF) నిర్వహిస్తోంది.
12. తూర్పు భారతదేశంలో పాక నూతన ఆవిష్కరణలు మరియు ఆహార వాణిజ్యాలను వేగవంతం చేయడానికి FIFI మరియు EICA ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
- తూర్పు మరియు ఈశాన్య భారతదేశంపై దృష్టిసారించి, పాక కార్యకలాపాలు, పరిశ్రమల విస్తరణ మరియు గ్లోబల్ ఫుడ్ అండ్ బెవరేజ్ ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం సహకరించడానికి ఆగస్ట్ 2026లో ఫోరమ్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ (FIFI) మరియు ఈస్టర్న్ ఇండియా కల్నరీ అసోసియేషన్ (EICA) ఒక అవగాహన ఒప్పందం (MoU) పై సంతకం చేశాయి.
- పశ్చిమ బెంగాల్ (WB) లోని కోల్‌కతాలో FIFI వ్యవస్థాపక డైరెక్టర్లు రాకేష్ బంగా మరియు ఉదయ్ చుగ్, అలాగే EICA అధ్యక్షుడు చెఫ్ అభిరు బిశ్వాస్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
MoU యొక్క ముఖ్య వివరాలు:
- ఉద్దేశ్యం: తూర్పు భారతదేశాన్ని పాక నూతన ఆవిష్కరణలు, ఫుడ్ టూరిజం, హాస్పిటాలిటీ అభివృద్ధి మరియు ఆహార, పానీయాల వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ చొరవ యొక్క ప్రధాన లక్ష్యం.
- పాక కార్యకలాపాలు: చెఫ్‌లు, ఆహార వ్యవస్థాపకులు, హాస్పిటాలిటీ నిపుణులు మరియు గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీ భాగస్వాముల మధ్య సహకారాన్ని బలపరుస్తూ, వర్క్‌షాప్‌లు, పాక పోటీలు, ఫుడ్ ఫెస్టివల్స్ మరియు చెఫ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్‌లను ఇది ప్రోత్సహిస్తుంది.
- ప్రోత్సాహం: గ్లోబల్ ఫుడ్ అండ్ బెవరేజ్ కంపెనీలు, FIFI సభ్యులు మరియు ప్రాంతీయ పాక కమ్యూనిటీలు ప్రొడక్ట్ షోకేస్‌లు, ప్రమోషనల్ యాక్టివిటీస్ మరియు చెఫ్-నేతృత్వంలోని ఈవెంట్ల ద్వారా మమేకమయ్యేందుకు ఈ సహకారం చక్కటి అవకాశాలను కల్పిస్తుంది.
13. ఒడిశాలో రూ. 24,700 కోట్ల షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌కు NSHIPOLకు సూత్రప్రాయ ఆమోదం
- సెప్టెంబర్ 2026లో, ఒడిశాలోని కేంద్రపరలో ప్రతిపాదిత రూ. 24,700 కోట్ల షిప్‌బిల్డింగ్ మరియు హెవీ ఇండస్ట్రీస్ క్లస్టర్ కోసం నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఒడిశా లిమిటెడ్ (NSHIPOL) సూత్రప్రాయంగా ఆమోదం పొందింది.
- ఈ ఆమోదం పోర్టులు, షిప్పింగ్ మరియు జలసంధుల మంత్రిత్వ శాఖ (MoPSW) యొక్క షిప్‌బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్ (SbDS) కింద మంజూరు చేయబడింది.
- ఒడిశాలోని షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ముఖ్య ముఖ్యాంశాలు:
- ప్రాంతం: పారాదీప్‌లోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) ప్లాంట్‌కు ఎదురుగా ఉన్న మహానది ఉత్తర గట్టు వెంబడి ఈ ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ క్లస్టర్ అభివృద్ధి చేయబడుతుంది.
- మౌలిక సదుపాయాలు: ఈ ప్రాజెక్ట్‌లో వార్షికంగా సుమారు 1.2 మిలియన్ గ్రాస్ టొన్నేజ్ (GT) సామర్థ్యం గల షిప్‌యార్డ్‌లు ఉంటాయి. ఇది 2,000–2,500 ఎకరాల విస్తీర్ణంలో మరియు 2–2.5 కిలోమీటర్ల (km) వాటర్‌ఫ్రంట్‌తో కూడి ఉంటుంది.
- అమలు: ఒడిశా మారిటైమ్ బోర్డ్ (OMB) మరియు పారాదీప్ పోర్ట్ అథారిటీ (PPA) భాగస్వామ్యంతో కూడిన స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ద్వారా ఇది అమలు చేయబడుతుంది.
- పర్యావరణ వ్యవస్థ: ఈ ప్రాజెక్ట్ తయారీ, మెరైన్ పరికరాలు మరియు శిక్షణ సౌకర్యాలను అనుసంధానిస్తుంది. షిప్‌బిల్డింగ్ కోసం ఇంటర్-మినిస్టీరియల్ గ్రూప్ (IMGB) సిఫార్సుల ఆధారంగా, తుది ఆమోదం కోసం పర్యావరణ మరియు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) క్లియరెన్స్‌లతో పాటు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) అవసరం.
- విస్తరణ: ఈ ప్రాజెక్ట్ పెట్టుబడులు, ఉపాధి మరియు సముద్ర తయారీని పెంచుతుంది. నీతి ఆయోగ్‌కు అనుగుణంగా, ఇది హరిత సాంకేతికత (green technology) మరియు నైపుణ్యాభిద్ధితో కూడిన షిప్‌బిల్డింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని అంచనా.
14. స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ 2026
- కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ సముద్ర పరిరక్షణ కోసం ‘స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ 2026’ 5వ ఎడిషన్‌ను ప్రారంభించారు.
- సెప్టెంబర్ 2026లో, కేంద్ర భూవిజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ (MoES) సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా. జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో Swachh Sagar, Surakshit Sagar 2026 (SSSS v5.0) 5వ ఎడిషన్‌ను ప్రారంభించారు.
- ఇది 12–19 సెప్టెంబర్ 2026 వరకు నిర్వహించే వారం రోజుల సముద్ర పరిరక్షణ ప్రచారం.
- ఈ ప్రచారం అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రత దినోత్సవం (International Coastal Cleanup Day) సందర్భంగా నిర్వహించబడుతుంది.
స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ 2026 ముఖ్యాంశాలు
- డా. జితేంద్ర సింగ్ SSSS v5.0 అధికారిక వెబ్సైట్, Ocean Conservation Pledge Platform, ప్రచార పరిచయ వీడియో, కార్యకలాపాల షెడ్యూల్ వీడియోలను ఆవిష్కరించారు.
- డిజిటల్ భాగస్వామ్యం కోసం ‘సాగర్ ప్రహరి (SAGAR PRAHARI)’ మొబైల్ అప్లికేషన్‌ను కూడా ప్రారంభించారు.
- **SSSS v5.0లో తొలిసారిగా జాతీయ ఓషన్ ఒలింపియాడ్ (National Ocean Olympiad)**ను ప్రారంభించారు.
- National Ocean Olympiadలో పాల్గొనేందుకు అధికారిక ప్లాట్‌ఫామ్: oceanolympiad.com
- ఈ కార్యక్రమం జన్ భాగీదారి (ప్రజా భాగస్వామ్యం) ద్వారా ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది.
- కార్యక్రమంలో భాగంగా బీచ్ క్లీనప్ డ్రైవ్‌లు, సముద్ర పరిరక్షణ ప్రతిజ్ఞలు, యువత కార్యక్రమాలు, మానవహారాలు, సైక్లింగ్ ర్యాలీలు, మారథాన్లు, ఓజోన్ డే కార్యక్రమాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
SSSS గురించి
- Swachh Sagar, Surakshit Sagar కార్యక్రమం 2022లో ప్రారంభమైంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 75 బీచ్‌లలో 75 రోజుల తీరప్రాంత శుభ్రత కార్యక్రమంగా దీనిని ప్రారంభించారు.
- ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి (UN) అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రత దినోత్సవం వారంలో నిర్వహిస్తున్నారు.
15.భారత్–జర్మనీ: చిత్తడి నేలల పరిరక్షణపై సంయుక్త ప్రకటన
భారత్–జర్మనీ: చిత్తడి నేలల పరిరక్షణపై సంయుక్త ప్రకటన
- సెప్టెంబర్ 2026లో, భారత్ మరియు జర్మనీ **అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల (Wetlands) పరిరక్షణ మరియు సముచిత వినియోగంపై Joint Declaration of Intent (JDI)**పై సంతకం చేశాయి.
- ఈ ఒప్పందం 4వ ఇండో–జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం (IGEF) సందర్భంగా న్యూఢిల్లీ, ఢిల్లీలో జరిగింది.
- 4వ IGEF యొక్క థీమ్: “Together for More Resilience”.
- ఈ ఒప్పందం ద్వారా **పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యం (Climate Resilience)**లో భారత్–జర్మనీ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యం.
- ఈ JDIపై భారత్ తరఫున కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంతకం చేశారు.
- జర్మనీ తరఫున కార్స్టెన్ ష్నైడర్, పర్యావరణం, వాతావరణ పరిరక్షణ, ప్రకృతి పరిరక్షణ మరియు అణుశక్తి శాఖ మంత్రి (BMUKN), సంతకం చేశారు.
4వ ఇండో–జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం (IGEF)
- ఆర్గనైజర్లు: భారతదేశంలోని MoEFCC మరియు జర్మనీలోని BMUKN సంయుక్తంగా ఈ ఫోరమ్‌ను నిర్వహించాయి.
- ఈ ఫోరమ్‌ను Asia-Pacific Committee of German Business (APA) మరియు Federation of Indian Chambers of Commerce and Industry (FICCI) సహకారంతో నిర్వహించారు.
- ప్రధాన దృష్టి ప్రాంతాలు:
- తక్కువ కార్బన్ పరిశ్రమలు
- చిత్తడి నేలలు, పర్వతాలు మరియు అడవుల్లో జీవవైవిధ్యం
- వనరుల సమర్థ వినియోగం
- సర్క్యులర్ ఎకానమీ
- సుస్థిర ఆర్థిక వ్యవస్థ (Sustainable Finance)
- గ్రీన్ స్కిల్స్
- పెట్టుబడుల సమీకరణ
ఇండో–జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం గురించి
- **Indo-German Environment Forum (IGEF)**ను 2008లో స్థాపించారు.
- ఇది భారత్ మరియు జర్మనీ మధ్య పర్యావరణ విధానాలపై అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక వేదిక.
- ఈ ఫోరం ద్వారా వాతావరణ చర్యలు, జీవవైవిధ్యం, సర్క్యులర్ ఎకానమీ, వనరుల సమర్థ వినియోగం మరియు సుస్థిర అభివృద్ధి వంటి అంశాల్లో సహకారాన్ని ప్రోత్సహిస్తారు.
- ఇందులో ప్రభుత్వం, వ్యాపార రంగం మరియు ఇతర భాగస్వాముల భాగస్వామ్యంతో పర్యావరణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్తారు.
16. CARA – Adoption Awareness 2026
CARA – Adoption Awareness 2026
- సెప్టెంబర్ 2026లో, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoWCD) ఆధ్వర్యంలోని Central Adoption Resource Authority (CARA), Adoption Awareness 2026 థీమ్‌ను ప్రారంభించింది.
- 2026 థీమ్:
“Legal Adoption. Safe Childhood. Secure Future. Say No to Illegal Adoption!”
👉 “చట్టబద్ధ దత్తత – సురక్షిత బాల్యం – భద్రమైన భవిష్యత్తు. అక్రమ దత్తతకు నో చెప్పండి!” - ఈ థీమ్‌ను CARA CEO భావనా సక్సేనా న్యూఢిల్లీలోని దూరదర్శన్ (DD National) లైవ్ మార్నింగ్ షోలో అధికారికంగా ప్రారంభించారు.
ముఖ్య వివరాలు
- లక్ష్యం: దేశవ్యాప్తంగా చట్టబద్ధమైన, సురక్షితమైన, పారదర్శకమైన మరియు బాలల ప్రయోజనాలకు అనుగుణమైన దత్తతను ప్రోత్సహించడం.
- అదే సమయంలో అక్రమ దత్తత విధానాలను నిరోధించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
- అవగాహన కార్యక్రమాలు: CARA సెప్టెంబర్ 2026 నుంచి అవగాహన కార్యక్రమాలు మరియు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల స్థాయి Adoption Awareness Workshops నిర్వహించనుంది.
- గతంలో దత్తత అవగాహన కార్యక్రమాలను ప్రధానంగా నవంబర్ నెలలో నిర్వహించే విధానానికి భిన్నంగా, 2026లో ఈ ప్రచారాన్ని సెప్టెంబర్ నుంచే విస్తరించనున్నారు.
- సమన్వయం: అక్రమ దత్తతను నిరోధించేందుకు CARA, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) మరియు **హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA)**తో సమన్వయాన్ని బలోపేతం చేసింది.
ఢిల్లీ వర్క్‌షాప్
- CARA, ఢిల్లీ ప్రభుత్వం మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ సహకారంతో 10 సెప్టెంబర్ 2026న న్యూఢిల్లీలోని Delhi Secretariatలో Adoption Awareness Workshop నిర్వహించింది.
- ఈ వర్క్‌షాప్‌లో ప్రధానంగా:
- చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ
- చట్టబద్ధమైన పిల్లల surrender విధానాలు
- అక్రమ దత్తత నివారణ
వంటి అంశాలపై దృష్టి సారించారు.
17. NABARD – IMD ఒప్పందం: వాతావరణ అనుకూల వ్యవసాయానికి ఊతం
NABARD – IMD ఒప్పందం: వాతావరణ అనుకూల వ్యవసాయానికి ఊతం
- సెప్టెంబర్ 2026లో, National Bank for Agriculture and Rural Development (NABARD), **India Meteorological Department (IMD)**తో **Memorandum of Understanding (MoU)**పై సంతకం చేసింది.
- ఈ MoU ద్వారా వ్యవసాయ-వాతావరణ డేటాను (Agro-Meteorological Data) Data in Climate Resilient Agriculture (DiCRA) ప్లాట్ఫామ్లో అనుసంధానం చేయనున్నారు.
- దీని ద్వారా రైతులు మరియు ఇతర భాగస్వాములకు వాతావరణ సమాచారాన్ని మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యం.
- ఈ MoUపై NABARD తరఫున సంజీవ్ డి. రోహిల్లా, IMD తరఫున బిక్రమ్ సింగ్ సంతకాలు చేశారు.
- ఈ కార్యక్రమంలో NABARD చైర్మన్ షాజీ కృష్ణన్ వి. మరియు IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర పాల్గొన్నారు.
MoU ముఖ్యాంశాలు
- ఇంటిగ్రేషన్: IMD అందించే కింది వ్యవసాయ-వాతావరణ ఉత్పత్తులను DiCRAలోని ప్రత్యేక Weather Portalలో అనుసంధానం చేస్తారు:
- వాతావరణ అంచనాలు
- వాతావరణ సలహాలు
- In-situ పరిశీలనలు
- వాతావరణ హెచ్చరికలు
- అందుబాటు: వెబ్ పోర్టల్స్, మొబైల్ ఇంటర్‌ఫేస్‌లు మరియు APIs ద్వారా వాతావరణ డేటాను ఓపెన్ మరియు వినియోగదారులకు సులభమైన విధానంలో అందించనున్నారు.
- దీని ద్వారా రైతులకు చివరి మైలు వరకు (Last-mile delivery) ఉపయోగకరమైన, చర్యలకు అనువైన సమాచారాన్ని అందించడం సాధ్యమవుతుంది.
- ప్రభావం: ఈ కార్యక్రమం ద్వారా:
- వాతావరణ సంబంధిత ప్రమాదాల అంచనా మెరుగుపడుతుంది.
- పంటలపై నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది.
- గ్రామీణ రుణ వ్యవస్థ బలోపేతం అవుతుంది.
- వాతావరణ డేటాను సమయానుకూలమైన, ప్రాంత-నిర్దిష్ట సమాచారంగా మార్చవచ్చు.
DiCRA గురించి
- DiCRA (Data in Climate Resilient Agriculture) ఒక Open-source digital platform.
- దీనికి NABARD మరియు United Nations Development Programme (UNDP) మద్దతు అందిస్తున్నాయి.
NABARD గురించి
- NABARDను 12 జూలై 1982న స్థాపించారు.
- ప్రధాన కార్యాలయం: ముంబై, మహారాష్ట్ర.
- ప్రస్తుత చైర్మన్: డా. షాజీ కె.వి. (Dr. Shaji K.V.).
18. BPCL – CSE: బయోఫ్యూయల్స్, సర్క్యులర్ ఎకానమీపై MoU
- సెప్టెంబర్ 2026లో, భారతదేశంలోని 2వ అతిపెద్ద Oil Marketing Company (OMC) అయిన Bharat Petroleum Corporation Limited (BPCL), **Centre for Science and Environment (CSE)**తో **Memorandum of Understanding (MoU)**పై సంతకం చేసింది.
- ఈ MoU ద్వారా బయోఫ్యూయల్స్, బయోమాస్ వినియోగం, Waste-to-Resource పరిష్కారాలు మరియు Circular Economy కార్యక్రమాలపై రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.
- ఈ ఒప్పందం ప్రకారం, **Compressed Biogas (CBG)**తో సహా మొత్తం Biofuel Value Chainలో అవకాశాలను గుర్తించి, వాటిని పరిశీలించేందుకు రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయి.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు
- ప్రధాన సహకార రంగాలు:
- Feedstock అంచనా మరియు Supply Chain అభివృద్ధి
- Biomass నిర్వహణ
- Waste Resource Management
- By-products వినియోగం
- Capacity Building
- ప్రాముఖ్యత:
BPCLకు ఉన్న Biofuel Portfolioను, CSEకు ఉన్న నైపుణ్యంతో కలిపి, విస్తృత స్థాయిలో అమలు చేయగల Scalable Bioenergy Solutionsను అభివృద్ధి చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. - బయోఫ్యూయల్ ఉప ఉత్పత్తులు:
రెండు సంస్థలు కింది Biofuel By-productsను అంచనా వేసి, వాటి వినియోగానికి అవకాశాలను అన్వేషించనున్నాయి:- Fermented Organic Manure (FOM)
- Digestate
- Bio-carbon dioxide (CO₂)
- Distillers Dried Grains with Solubles (DDGS)
- MoUపై సంతకం చేసినవారు:
- Subhankar Sen – Director (Marketing), BPCL
- Sunita Narain – Director General (DG), CSE
BPCL గురించి
Chairman & Managing Director (CMD): Sanjay Khanna.
BPCL (Bharat Petroleum Corporation Limited) ఒక “Maharatna” Public Sector Undertaking (PSU).
ఇది Ministry of Petroleum and Natural Gas (MoPNG) ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
స్థాపన: 1952
ప్రధాన కార్యాలయం: ముంబై, మహారాష్ట్ర
19. SEBI – Zerodhaకు Category-I Merchant Banking లైసెన్స్
- సెప్టెంబర్ 2026లో, Securities and Exchange Board of India (SEBI), Zerodha అనుబంధ సంస్థ Zerodha Corporate Advisorsకు Category-I Merchant Banking Licence మంజూరు చేసింది.
- ఈ లైసెన్స్‌తో Zerodha Investment Banking రంగంలోకి ప్రవేశించనుంది.
- సంస్థ ప్రధానంగా Capital Market సంబంధిత సేవలపై దృష్టి పెట్టనుంది.
- దేశవ్యాప్తంగా కార్యకలాపాలను కొన్ని నెలల్లో ప్రారంభించే అవకాశం ఉంది.
- Zerodha Corporate Advisors (Zerodha యొక్క Investment Banking విభాగం) ఈ లైసెన్స్ కోసం 27 ఏప్రిల్ 2026న దరఖాస్తు చేసింది.
- 1 సెప్టెంబర్ 2026న SEBI నుంచి రిజిస్ట్రేషన్ పొందింది.
- దీంతో Zerodha Corporate Advisors భారత్‌లో 249వ రిజిస్టర్డ్ Merchant Bankerగా నిలిచింది.
Zerodha Investment Bankingలోకి ప్రవేశం – ముఖ్యాంశాలు
- లక్ష్యం:
Brokerage వ్యాపారానికి మించి Advisory మరియు Capital-Raising Servicesలోకి విస్తరించడం ద్వారా Zerodha తన వ్యాపార నమూనాను విభిన్నీకరించుకోవడం. - Zerodha తన ఇప్పటికే ఉన్న తక్కువ ఖర్చు (Low-cost) మరియు Client-centric విధానాన్ని Investment Bankingలోనూ ఉపయోగించనుంది.
- ప్రారంభ దృష్టి:
Equity Capital Marketsపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. - ఇందులో ముఖ్యంగా:
- Initial Public Offerings (IPOs)
- Follow-on Public Offers (FPOs)
- Issuers మరియు Investorsకు Advisory Services
అందించనుంది.
- వ్యాపార నమూనా:
Brokerage రంగంలో అనుసరించిన విధంగానే తక్కువ ఖర్చుతో సేవలు, Aggressive Selling లేకుండా, పారదర్శకత మరియు సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని Zerodha లక్ష్యంగా పెట్టుకుంది.
Merchant Bankers – Category Classification
- Category-I Merchant Bankers:
- Main-board Public Issuesను నిర్వహించవచ్చు.
- Underwriting కార్యకలాపాలు చేపట్టవచ్చు.
- కనీస Net Worth అవసరం ₹50 కోట్లు.
- Liquid Net Worthకు గరిష్టంగా 20 రెట్లు పరిమితి ఉంటుంది.
- Category-II Merchant Bankers:
కనీస Net Worth ₹10 కోట్లు ఉండాలి.
Main-board Public Issuesను నిర్వహించలేరు.
20. Tenzing Norgay National Adventure Awards 2024
- సెప్టెంబర్ 2026లో, Ministry of Youth Affairs and Sports (MYAS), 2024 సంవత్సరానికి Tenzing Norgay National Adventure Awards (TNNAA) విజేతలుగా 4 మందిని ప్రకటించింది.
- TNNAA భారతదేశంలో అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు అందించే అత్యున్నత జాతీయ పురస్కారం.
- 2024 TNNAA పురస్కారాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేయనున్నారు.
- ఈ పురస్కారాలను National Sports Awards 2025తో పాటు ప్రదానం చేయనున్నారు.
TNNAA 2024 – ముఖ్యాంశాలు
- పురస్కారాల కేటగిరీలు:
MYAS ప్రతి సంవత్సరం 4 ప్రధాన విభాగాల్లో TNNAAలను ప్రదానం చేస్తుంది:- 🏔️ Land Adventure
- 🌊 Water Adventure
- 🪂 Air Adventure
- 🏆 Lifetime Achievement
- ఈ పురస్కారాలు భూమి, సముద్రం మరియు గాలిపై నిర్వహించే సాహస క్రీడలు/కార్యకలాపాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అందిస్తారు.
🏆 TNNAA 2024 విజేతలు
- Land Adventure:
- Baljeet Kaur
- Skalzang Rigzin
- Water Adventure:
- Rimo Saha
- Lifetime Achievement:
- Shiv Prasad Chamoli
- Air Adventure: ఈ కేటగిరీలో 2024 విజేతను ప్రకటించలేదు.
🎖️ పురస్కారం & నగదు బహుమతి
- ప్రతి అవార్డు గ్రహీతకు:
- కాంస్య విగ్రహం (Bronze Statuette)
- ప్రశంసాపత్రం (Certificate)
- బ్లేజర్‌తో సిల్కెన్ టైస్ / చీర
- 💰 ₹15 లక్షల నగదు బహుమతి
అందజేస్తారు.


