21-22 August Daily current Affairs – 21,22 ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ తెలుగు

21-22 August Daily current Affairs

1.  ‘జైపూర్‌ డిక్లరేషన్‌’ ఆమోదం

  • భారత్‌ బ్రిక్స్‌ చైర్‌షిప్‌–2026లో భాగంగా జరిగిన బ్రిక్స్‌ టూరిజం మినిస్టర్స్‌ మీటింగ్‌ “జైపూర్‌ డిక్లరేషన్‌”ను ఏకగ్రీవంగా ఆమోదించారు.
  •  బ్రిక్స్‌ సభ్య దేశాల మధ్య టూరిజం సహకారాన్ని బలోపేతం చేసేందుకు జైపూర్‌ డిక్లరేషన్‌ ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది.
  • సస్టైనబుల్‌ టూరిజం, టూరిజం కనెక్టివిటీ, కల్చరల్‌–హెరిటేజ్‌ టూరిజం, డిజిటల్‌ ఇన్నోవేషన్‌, ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించడం
  • బ్రిక్స్‌ దేశాల మధ్య బెస్ట్‌ ప్రాక్టీసెస్‌, విజ్ఞానం, అనుభవాల మార్పిడిని ప్రోత్సహించి రెసిలియెంట్‌, సమగ్ర టూరిజం ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక సమాజాల అభివృద్ధి, సాంస్కృతిక మార్పిడిలో టూరిజం పాత్రను డిక్లరేషన్‌ ప్రధానంగా గుర్తించింది.

బ్రిక్స్‌ (BRICS)

  • స్థాపన సంవత్సరం: 2009
  • సభ్య దేశాలు: బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (మొత్తం 11)
  • ప్రధాన లక్ష్యం: ఆర్థిక సహకారం, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ పరిపాలనా వ్యవస్థలో సంస్కరణలను ప్రోత్సహించడం.

బ్రిక్స్‌ – భారత్‌ చైర్‌షిప్‌ 2026

  • చైర్‌: భారత్‌
  • థీమ్‌: “Building for Resilience, Innovation, Cooperation and Sustainability”
  • • ప్రధాన సహకార రంగాలు: ఆర్థికం, టెక్నాలజీ, సైన్స్‌, ఇంధనం, పర్యావరణం, సంస్కృతి, యువజన, క్రీడలు

2. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌ (పీఎం–ఆశా)

  • రైతులకు గిట్టుబాటు ధరలను అందించి మినిమమ్‌ సపోర్ట్‌ ప్రైస్‌ (ఎంఎస్‌పీ) అమలును బలోపేతం చేసేందుకు
  • ప్రధానమంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌ (పీఎం–ఆశా)ను 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించారు.
  • మార్కెట్‌ ధరలు ఎంఎస్‌పీ కంటే తగ్గినప్పుడు రైతులు తక్కువ ధరలకు పంటలను విక్రయించాల్సిన పరిస్థితి నుంచి రక్షించడం,
  • వారి ఆదాయానికి మద్దతు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
  • మార్కెట్‌ జోక్యం, ధరల స్థిరీకరణ చర్యల ద్వారా వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని అందించడంలో కూడా ఈ పథకం తోడ్పడుతుంది.
  • 2026–27లో పీఎం–ఆశాకు ₹7,200 కోట్లు కేటాయించారు.

పీఎం–ఆశాలో నాలుగు ప్రధాన భాగాలు ఉన్నాయి —

ప్రైస్‌ సపోర్ట్‌ స్కీమ్‌ (పీఎస్‌ఎస్‌),

ప్రైస్‌ స్టెబిలైజేషన్‌ ఫండ్‌ (పీఎస్‌ఎఫ్‌),

 ప్రైస్‌ డెఫిషియెన్సీ పేమెంట్‌ స్కీమ్‌ (పీడీపీఎస్‌),

మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ (ఎంఐఎస్‌).

  • ప్రైస్‌ సపోర్ట్‌ స్కీమ్‌ కింద మార్కెట్‌ ధర ఎంఎస్‌పీ కంటే తగ్గినప్పుడు, నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన పంటలను నిర్దేశిత సంస్థలు రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి.
  • ప్రైస్‌ స్టెబిలైజేషన్‌ ఫండ్‌ ద్వారా ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు మార్కెట్‌ జోక్యానికి మద్దతు అందిస్తారు.
  • ప్రైస్‌ డెఫిషియెన్సీ పేమెంట్‌ స్కీమ్‌ కింద భౌతికంగా పంటను కొనుగోలు చేయకుండా, నిర్దేశిత నిబంధనల ప్రకారం ఎంఎస్‌పీ–మార్కెట్‌/విక్రయ ధర మధ్య వ్యత్యాసానికి అనుసంధానించిన పరిహారాన్ని అర్హత కలిగిన రైతులకు అందిస్తారు.
  • మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ ద్వారా సాధారణంగా ఎంఎస్‌పీ కొనుగోలు వ్యవస్థ పరిధిలో లేని నిర్దిష్ట వ్యవసాయ, ఉద్యాన పంటల ధరలు తీవ్రంగా పడిపోయినప్పుడు రైతులకు మద్దతు కల్పిస్తారు.

3. జలాంతర్గామి విధ్వంసక నౌక “మంగ్రోల్‌”

  • కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌) నిర్మించిన యాంటీ-సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌ (ఏఎస్‌డబ్ల్యూఎస్‌డబ్ల్యూసీ) “మంగ్రోల్‌”ను ఇండియన్‌ నేవీకి అందజేసింది.
  • తక్కువ లోతు గల తీర జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించడం, ట్రాక్‌ చేయడం, వాటిని ఎదుర్కోవడం కోసం మంగ్రోల్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.
  • ఇండియన్‌ నేవీ కోసం కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ నిర్మిస్తున్న 8 ఏఎస్‌డబ్ల్యూఎస్‌డబ్ల్యూసీ నౌకల్లో మంగ్రోల్‌ మూడోది.

4. ‘దివ్యాస్త్ర ఎంకే3’

  • ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన డిఫెన్స్‌ టెక్‌ సంస్థ కావా యూపవీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హోవర్‌ఇట్‌) అభివృద్ధి చేసిన ‘దివ్యాస్త్ర ఎంకే3’ తొలి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
  • దివ్యాస్త్ర ఎంకే3 అనేది స్వదేశీగా డిజైన్‌ చేసి, అభివృద్ధి చేసి, తయారు చేసిన జెట్‌–పవర్డ్‌ లాయిటరింగ్‌ మ్యూనిషన్‌. ఇందులో స్వదేశీ పవర్‌ప్లాంట్‌ను ఉపయోగించారు.
  • పూర్తి స్వదేశీ ప్రొపల్షన్‌ వ్యవస్థతో రూపొందించిన జెట్‌–పవర్డ్‌ లాయిటరింగ్‌ మ్యూనిషన్‌ భారత్‌లో తొలిసారి గగనతలంలోకి ఎగరడం ఈ పరీక్ష ప్రత్యేకతగా పేర్కొన్నారు.
  • లాయిటరింగ్‌ మ్యూనిషన్‌ను సాధారణంగా కామికాజే డ్రోన్‌ లేదా సూసైడ్‌ డ్రోన్‌ అని కూడా పిలుస్తారు. ఇది లక్ష్య ప్రాంతం చుట్టూ గాల్లో సంచరిస్తూ, నిర్దేశిత లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత తనలోని వార్‌హెడ్‌తో నేరుగా దాడి చేస్తుంది.
  • అధిక విలువ కలిగిన శత్రు సైనిక లక్ష్యాలు, యుద్ధరంగ మౌలిక సదుపాయాలు, శత్రు సిబ్బందిని లక్ష్యంగా చేసుకునేలా దివ్యాస్త్ర ఎంకే3ను రూపొందించారు.
  • సాధారణ రికానైసెన్స్‌ డ్రోన్‌ మిషన్‌ అనంతరం తిరిగి రావచ్చు. కానీ లాయిటరింగ్‌ మ్యూనిషన్‌ లక్ష్యాన్ని ఢీకొట్టి తన వార్‌హెడ్‌తో పాటు ధ్వంసమవుతుంది.

దివ్యాస్త్ర ఎంకే3

అభివృద్ధి సంస్థ: కావా యూపవీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ / హోవర్‌ఇట్‌

రకం: జెట్‌–పవర్డ్‌ లాయిటరింగ్‌ మ్యూనిషన్‌

ప్రత్యేకత: స్వదేశీ డిజైన్‌, తయారీ, పవర్‌ప్లాంట్‌

ప్రధాన విధి: అధిక విలువ కలిగిన యుద్ధరంగ లక్ష్యాలపై కచ్చితమైన దాడి.

5. ‘ఐఎన్‌ఎస్‌ జలాశ్వ’ నవీకరణకు విశాఖ హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌కు చేరిక

  • ఇండియన్‌ నేవీకి చెందిన ప్రముఖ ల్యాండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డాక్‌  “ఐఎన్‌ఎస్‌ జలాశ్వ” భారీ రీఫిట్‌, సాంకేతిక నవీకరణ పనుల కోసం విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ కు చేరుకుంది.
  • ఇండియన్‌ నేవీ అధికారుల సమన్వయంతో హెచ్‌ఎస్‌ఎల్‌ ఈ నౌకలో ఆధునిక సాంకేతిక వ్యవస్థలను అమర్చి, ఆపరేషనల్‌ సామర్థ్యాన్ని మెరుగుపరచనుంది.
  • ఐఎన్‌ఎస్‌ జలాశ్వ గతంలో అమెరికా నౌకాదళంలో ‘యూఎస్‌ఎస్‌ ట్రెంటన్‌’ పేరుతో సేవలందించిన ఆస్టిన్‌–క్లాస్‌ యాంఫిబియస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డాక్‌.
  • భారత్‌ ఈ నౌకను 2007లో అమెరికా నుంచి కొనుగోలు చేసి, అనంతరం “ఐఎన్‌ఎస్‌ జలాశ్వ”గా పేరు మార్చింది. 2007 జూన్‌ 22న దీనిని ఇండియన్‌ నేవీలో కమిషన్‌ చేశారు.
  • ఈ నౌక 1,000 మందికి పైగా సిబ్బందితో పాటు హెలికాప్టర్లు, ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌, సైనిక వాహనాలు, ఇతర యుద్ధ సామగ్రిని తరలించగలదు.
  • ఇందులో నాలుగు ఆపరేషన్‌ థియేటర్లు, 12 పడకల మెడికల్‌ వార్డు ఉండటంతో విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించగలదు.
  • ఎవాక్యుయేషన్‌, హ్యూమానిటేరియన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ కార్యక్రమాల్లో ఈ నౌక కీలకంగా పనిచేసింది.
  • ప్రస్తుత నవీకరణ ద్వారా ఆధునిక వ్యవస్థలను అమర్చి, మరికొంతకాలం సమర్థంగా ఆపరేషనల్‌ సేవలు అందించేలా ఐఎన్‌ఎస్‌ జలాశ్వను సిద్ధం చేయనున్నారు.

ఐఎన్‌ఎస్‌ జలాశ్వ

రకం: ల్యాండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డాక్‌ / యాంఫిబియస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డాక్‌

పూర్వపు పేరు: యూఎస్‌ఎస్‌ ట్రెంటన్‌

పూర్వపు నౌకాదళం: అమెరికా నేవీ

శ్రేణి: ఆస్టిన్‌ క్లాస్‌

భారత్‌ కొనుగోలు: 2007

ఇండియన్‌ నేవీలో కమిషనింగ్‌: 2007 జూన్‌ 22

6. మారిటైమ్‌ హెరిటేజ్‌ సహకారానికి భారత్‌–సింగపూర్‌ ఒప్పందం

  • మారిటైమ్‌ హెరిటేజ్‌ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్‌, సింగపూర్‌ 2026 ఆగస్టు 20న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి.
  • భారత్‌కు చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ పోర్ట్స్‌, షిప్పింగ్‌ అండ్‌ వాటర్‌వేస్‌, సింగపూర్‌కు చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌, కమ్యూనిటీ అండ్‌ యూత్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
  • ఇరు దేశాల ఉమ్మడి సముద్ర వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం, ప్రజలకు ప్రదర్శించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.
  • భారత్‌, సింగపూర్‌లలోని మ్యూజియంలు, మారిటైమ్‌ హెరిటేజ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, సంబంధిత సంస్థల మధ్య పరస్పర మార్పిడి, సహకారాన్ని ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుంది.
  • గుజరాత్‌లోని లోథల్‌లో నిర్మిస్తున్న నేషనల్‌ మారిటైమ్‌ హెరిటేజ్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎంహెచ్‌సీ) ఈ సహకారంలో కీలక సంస్థగా ఉండనుంది.
  • ఇరు దేశాల మధ్య నైపుణ్యం, విజ్ఞానం, మ్యూజియం నిర్వహణ పద్ధతులు, పరిశోధన, హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ అనుభవాల మార్పిడికి ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుంది.

నేషనల్‌ మారిటైమ్‌ హెరిటేజ్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎంహెచ్‌సీ)

స్థానం: లోథల్‌, గుజరాత్‌

ప్రధాన లక్ష్యం: ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు భారత సముద్ర చరిత్ర, వారసత్వాన్ని ప్రదర్శించడం.

ప్రత్యేకత: హరప్పా నాగరికతకు చెందిన ప్రముఖ పట్టణ కేంద్రం; ప్రాచీన నౌకాయానం, సముద్ర వాణిజ్యానికి ప్రసిద్ధి.

మలక్కా జలసంధికి సమీపంలో ఉంది.

7. చెన్నై నీటి భద్రత ప్రాజెక్టుకు భారత్‌–ఏడీబీ 230 మిలియన్‌ డాలర్ల రుణ ఒప్పందం

  • క్లైమేట్‌–రెసిలియెంట్‌ వాటర్‌ సెక్యూరిటీ అండ్‌ సివరేజ్‌ ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) 2026 ఆగస్టు 21న 230 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
  • గ్రేటర్‌ చెన్నై ప్రాంతంలో క్లైమేట్‌–రెసిలియెంట్‌ నీటి సరఫరా, పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
  • దీని ద్వారా సుమారు 45 లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు.
  • భారత ప్రభుత్వం తరఫున డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌ డిప్యూటీ సెక్రటరీ సౌరభ్‌ సింగ్‌, ఏడీబీ తరఫున ఇండియా రెసిడెంట్‌ మిషన్‌ కంట్రీ డైరెక్టర్‌ మియో ఓకా ఒప్పందంపై సంతకాలు చేశారు.
  • ఈ ప్రాజెక్టు ద్వారా చెన్నైలో నీటి భద్రత, పారిశుద్ధ్య సేవలు, మౌలిక సదుపాయాల రెసిలియెన్స్‌, పట్టణ జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు వాతావరణ సంబంధిత సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరగనుంది.

8. చెన్నైలో బ్రిక్స్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ సమావేశం

  • ప్రదేశం : చెన్నై
  • థీమ్: “Building for Resilience, Innovation, Cooperation and Sustainability”
  • ఆవిష్కరణలు అందుబాటులో, సరసమైన ధరలో, విశ్వసనీయంగా, సుస్థిరంగా ఉండేలా చేసేందుకు అంతర్జాతీయ శాస్త్రీయ సహకారం అవసరమని జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.
  • బ్రిక్స్‌ దేశాల మధ్య సైంటిఫిక్‌ కోఆపరేషన్‌, టెక్నాలజికల్‌ ఇన్నోవేషన్‌, రీసెర్చ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ను బలోపేతం చేయడం చెన్నై సమావేశం ప్రధాన లక్ష్యం.

9.విశాఖలో బ్రిక్స్‌ యువజన, క్రీడా మంత్రుల సమావేశాలు

  • తేదీ : 2026 ఆగస్టు 22–23
  • ప్రదేశం : విశాఖపట్నం.
  • అధ్యక్షుడు: మన్సుఖ్‌ మాండవీయ
  • భారత్‌, బ్రెజిల్‌, చైనా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్‌, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
  • విద్య, నైపుణ్యాలు, వ్యవస్థాపకత, యువజన సంక్షేమం, సుస్థిరాభివృద్ధి, బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు.
  • ఆగస్టు 23న విశాఖ బీచ్‌ నుంచి నోవోటెల్‌ వరకు, సబ్‌మెరైన్‌ మ్యూజియం వరకు బ్రిక్స్‌ ప్రతినిధులతో కలిసి స్నేహపూర్వక సైకిల్‌ ర్యాలీ నిర్వహించనున్నారు.

10. అక్టోబర్‌లో భారత్‌ తొలి భారీ స్థాయి బయోపాలిమర్‌ ప్లాంట్‌ ప్రారంభం

  • లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • బలరాంపూర్‌ చినీ మిల్స్‌ లిమిటెడ్‌ సంస్థ గోలా గోకరణ్‌నాథ్‌లోని కుంభీ షుగర్‌ యూనిట్‌లో ఈ ప్లాంట్‌ను పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్‌ ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేస్తోంది.
  • స్థానికంగా పండించే చెరకును ప్రధాన ముడిపదార్థంగా ఉపయోగించి, చక్కెర తయారీని బయోపాలిమర్‌ ఉత్పత్తితో అనుసంధానించనున్నారు.
  • చెరకు నుంచి పొందిన చక్కెరను ఉపయోగించి పాలీలాక్టిక్‌ యాసిడ్‌ (పీఎల్‌ఏ)ను తయారు చేయనున్నారు. ఇది కొన్ని సంప్రదాయ పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్‌లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే బయో-బేస్డ్‌ థర్మోప్లాస్టిక్‌.
  • పీఎల్‌ఏను ప్యాకేజింగ్‌, డిస్పోజబుల్‌ ఉత్పత్తులు, ఫుడ్‌–సర్వీస్‌ మెటీరియల్స్‌, ఇతర బయోప్లాస్టిక్‌ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు.
  • ఈ ప్రాజెక్టుకు 2025 ఫిబ్రవరి 22న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శంకుస్థాపన చేశారు.

11. విడిగా వంట నూనెల విక్రయాలను నిషేధించిన మహారాష్ట్ర

• మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) 2026 ఆగస్టు 20న రాష్ట్రవ్యాప్తంగా లూజ్‌ లేదా ప్యాకేజింగ్‌ లేని ఎడిబుల్‌ ఆయిల్స్‌, ఫ్యాట్స్‌ విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

• ఈ నిషేధం ఆయిల్‌ ఎక్స్‌పెల్లర్స్‌, రిఫైనర్స్‌, బ్లెండర్స్‌, రీప్యాకర్స్‌, ఇంపోర్టర్స్‌, హోల్‌సేలర్స్‌, ట్రాన్స్‌పోర్టర్స్‌, రిటైలర్స్‌, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ సహా మొత్తం ఎడిబుల్‌ ఆయిల్‌ సప్లై చైన్‌కు వర్తిస్తుంది.

• ఇకపై వంట నూనెలను నిర్దేశిత లేబులింగ్‌ వివరాలతో కూడిన సీల్డ్‌, టాంపర్‌-ఎవిడెంట్‌ ప్యాకేజీల్లో మాత్రమే విక్రయించాలి.

• ప్రతి ప్యాక్‌పై ఉత్పత్తి గుర్తింపు, మూలం, బ్యాచ్‌ వివరాలు, ట్రేసబిలిటీ, గడువు తేదీకి సంబంధించిన సమాచారం తప్పనిసరిగా ఉండాలి.

• మల్టీ-సోర్సెస్‌ వెజిటబుల్‌ ఆయిల్‌ ప్యాక్‌ల గరిష్ట పరిమాణాన్ని 15 కిలోలుగా నిర్ణయించారు.

• ప్రామాణిక సీల్డ్‌ రిటైల్‌ ప్యాక్‌, నిర్దేశిత లేబుల్‌ లేకుండా విక్రయించే వంట నూనెను లూజ్‌ ఎడిబుల్‌ ఆయిల్‌గా పరిగణిస్తారు.

• కల్తీ, నాసిరకం, తప్పుదోవ పట్టించే లేబులింగ్‌ ఉన్న వంట నూనెల విక్రయాలను అరికట్టి, ఆహార భద్రత, ట్రేసబిలిటీ, వినియోగదారుల రక్షణను బలోపేతం చేయడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.

12. నీట్‌ ఆందోళనలు–పోలీసుల చర్యలపై ఐదుగురు సభ్యులతో సుప్రీంకోర్టు కమిటీ

నీట్‌ వ్యవహారంపై ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసనలు, ఆ సందర్భంగా పోలీసుల చర్యలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

  • ఈ కమిటీకి తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌ రెడ్డి నేతృత్వం వహించనున్నారు.

• ఆందోళనల సందర్భంగా నిరసనకారుల ప్రవర్తనతో పాటు పోలీసు సిబ్బంది చర్యలకు సంబంధించిన ఆరోపణలను కమిటీ పరిశీలించనుంది.

• మాజీ న్యాయమూర్తులు, సీనియర్‌ మాజీ దర్యాప్తు, పోలీసు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఘటనలపై స్వతంత్ర విచారణకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది.

కమిటీ సభ్యులు

జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌ రెడ్డి — సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి — చైర్మన్‌

జస్టిస్‌ శలిందర్‌ కౌర్‌ — న్యాయ సభ్యురాలు

ఆర్‌.కె. శుక్లా — సీబీఐ మాజీ డైరెక్టర్‌

ఎల్‌.ఆర్‌. బిష్టోయ్‌ — మేఘాలయ మాజీ డీజీపీ

ఎల్‌.ఆర్‌. బిష్టోయ్‌ — సభ్యుడు

13. ‘పరిశ్రమ’ నిర్వచనానికి సుప్రీంకోర్టు మెరుగులు

  • పరిశ్రమ’ అనే పదానికి చట్టపరమైన నిర్వచనంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 48 ఏళ్ల క్రితం బెంగళూరు వాటర్‌ సప్లై అండ్‌ సివరేజ్‌ బోర్డ్‌ వర్సెస్‌ ఎ. రాజప్ప–1978 కేసులో ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని పునఃపరిశీలించింది.
  • భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:3 మెజారిటీతో తీర్పు వెల్లడించింది.

• ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌, 1947 కింద రూపొందిన విస్తృత “పరిశ్రమ” నిర్వచనాన్ని ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ కోడ్‌, 2020 కింద తలెత్తే కొత్త వివాదాలకు యథాతథంగా వర్తింపజేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే 1978 తీర్పులోని ప్రాథమిక చట్రాన్ని కొనసాగిస్తూ, ఒక కార్యకలాపాన్ని పరిశ్రమగా నిర్ణయించేందుకు ఉపయోగించే సూత్రాలు, మార్గదర్శకాలకు మెరుగులు దిద్దింది.

• తాజా తీర్పు భవిష్యత్‌ వివాదాలకు మాత్రమే వర్తిస్తుంది.

• ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులను పాత నిర్వచనం, అప్పటి చట్టపరమైన స్థితి ప్రకారమే పరిష్కరించనున్నారు.

• ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌, 1947 స్థానంలో ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ కోడ్‌, 2020 కొత్త చట్టపరమైన వ్యవస్థను తీసుకొచ్చిన నేపథ్యంలో పాత నిర్వచనాన్ని కొత్త కేసులకు యాంత్రికంగా వర్తింపజేయరాదని కోర్టు పేర్కొంది.

పరిశ్రమగా గుర్తించేందుకు ప్రధానంగా మూడు అంశాలను పేర్కొంది:

• క్రమబద్ధమైన కార్యకలాపాలు

• యజమాని–ఉద్యోగుల మధ్య సహకారం

• మానవ అవసరాలను తీర్చే వస్తువులు లేదా సేవల ఉత్పత్తి/పంపిణీ

• ఈ విస్తృత నిర్వచనం కారణంగా కొన్ని ఆసుపత్రులు, విద్యాసంస్థలు, క్లబ్బులు, సంక్షేమ సంస్థలు కూడా నిర్దిష్ట పరిస్థితుల్లో పారిశ్రామిక వివాదాల చట్ట పరిధిలోకి వచ్చాయి.

• తాజా తీర్పు ద్వారా ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ కోడ్‌, 2020 నేపథ్యంలో 1978 సూత్రాలను యథాతథంగా కాకుండా మెరుగుపరిచిన విధంగా అన్వయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

14. లడఖ్‌లో జమ్మూ కశ్మీర్‌ అండ్‌ లడఖ్‌ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో, లడఖ్‌లో హైకోర్టు ఆఫ్‌ జమ్మూ కశ్మీర్‌ అండ్‌ లడఖ్‌ బెంచ్‌ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. లడఖ్‌ ప్రజలకు న్యాయ సేవలను మరింత సులభంగా, వేగంగా, అందుబాటులోకి తీసుకురావడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.

• గత జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం 2019 అక్టోబర్‌ 31న లడఖ్‌ ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడింది.

• పునర్వ్యవస్థీకరణ ద్వారా జమ్మూ కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతం, లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతం అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. పరిపాలనాపరంగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ, ప్రస్తుతం రెండింటికీ హైకోర్టు ఆఫ్‌ జమ్మూ కశ్మీర్‌ అండ్‌ లడఖ్‌ ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతోంది.

• లడఖ్‌లో ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు ద్వారా సుదూర ప్రాంతాల ప్రజలకు న్యాయ ప్రాప్తి, న్యాయ మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి.

15. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు – 2025–26లో రుణ వితరణలో బలమైన వృద్ధి

2025–26 ఆర్థిక సంవత్సరంలో రీజినల్‌ రూరల్‌ బ్యాంక్స్‌ (ఆర్‌ఆర్‌బీలు) రుణ వితరణలో బలమైన వృద్ధిని నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

• ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తులవారు, గ్రామీణ చిన్న వ్యాపారులకు రుణాలు, ఇతర ఆర్థిక సేవలను అందించడం వీటి ప్రధాన లక్ష్యం.

• నరసింహం వర్కింగ్‌ గ్రూప్‌–1975 సిఫార్సుల ఆధారంగా ఆర్‌ఆర్‌బీలను ఏర్పాటు చేశారు. వీటికి రీజినల్‌ రూరల్‌ బ్యాంక్స్‌ యాక్ట్‌, 1976 ద్వారా చట్టబద్ధత కల్పించారు.

• తొలి రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ‘ప్రథమ బ్యాంక్‌’ను 1975 అక్టోబర్‌ 2న ఏర్పాటు చేశారు.

• ఆర్‌ఆర్‌బీల్లో కేంద్ర ప్రభుత్వం 50%, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం 15%, స్పాన్సర్‌ బ్యాంక్‌ 35% వాటాలను కలిగి ఉంటాయి.

• గ్రామీణ సమస్యలపై సహకార సంస్థలకు ఉండే స్థానిక అవగాహన, వాణిజ్య బ్యాంకులకు ఉండే ప్రొఫెషనల్‌ బ్యాంకింగ్‌, ఆర్థిక వనరుల సమీకరణ సామర్థ్యాలను ఆర్‌ఆర్‌బీలు సమన్వయం చేస్తాయి.

• కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ మేరకు ఒక రాష్ట్రంలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలకు ఆర్‌ఆర్‌బీ కార్యకలాపాలు పరిమితమవుతాయి.

• ఆర్‌ఆర్‌బీలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నియంత్రిస్తుండగా, నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) పర్యవేక్షిస్తుంది.

• వీటి నిధుల వనరుల్లో సొంత నిధులు, డిపాజిట్లు, నాబార్డ్‌, స్పాన్సర్‌ బ్యాంకులు, స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ నుంచి రుణాలు ఉన్నాయి.

• గ్రామీణాభివృద్ధి లక్ష్యం కారణంగా ఆర్‌ఆర్‌బీలకు ప్రాధాన్యతా రంగ రుణాల్లో అధిక ప్రాధాన్యం ఉంటుంది.

రీజినల్‌ రూరల్‌ బ్యాంక్స్‌

• తొలి ఏర్పాటు: 1975 అక్టోబర్‌ 2

• చట్టపరమైన ఆధారం: రీజినల్‌ రూరల్‌ బ్యాంక్స్‌ యాక్ట్‌, 1976

• సిఫార్సు చేసిన కమిటీ: నరసింహం వర్కింగ్‌ గ్రూప్‌

• యాజమాన్య వాటాలు: కేంద్రం – 50%; రాష్ట్రం – 15%; స్పాన్సర్‌ బ్యాంక్‌ – 35%

• నియంత్రణ సంస్థ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

• పర్యవేక్షణ సంస్థ: నాబార్డ్‌

• ప్రధాన లక్ష్యం: గ్రామీణ రుణ వితరణ, ఆర్థిక సమ్మిళితం.

16. నౌకాయాన భద్రత బలోపేతానికి భారత్–జపాన్ ఒప్పందం

భారత్–జపాన్ రక్షణ సహకారం

  • ద్వైపాక్షిక నౌకాయాన భద్రత, రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్, జపాన్ కొత్త ఒప్పందంపై సంతకాలు చేశాయి.
  • భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి మధ్య జరిగిన చర్చల సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది.
  • ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సైనిక, నౌకాయాన సహకారాన్ని మరింత విస్తరించి, ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సమన్వయాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
  • స్వేచ్ఛాయుత, బహిరంగ, శాంతియుత, నిబంధనల ఆధారిత ఇండో–పసిఫిక్ ప్రాంతానికి తమ నిబద్ధతను భారత్, జపాన్ పునరుద్ఘాటించాయి.
  • ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, మారిటైమ్ సెక్యూరిటీ, సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ భద్రతను పరిరక్షించాల్సిన అవసరాన్ని ఇరు దేశాలు నొక్కిచెప్పాయి.
  • ఈ ఒప్పందం ద్వారా భారత్–జపాన్ మధ్య డిఫెన్స్ ఎక్సేంజెస్, ఆపరేషనల్ కోఆర్డినేషన్, మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్, ఇంటర్‌ఆపరబిలిటీ మరింత బలోపేతం కానున్నాయి.
  • భారత్, జపాన్ దేశాలు అమెరికా, ఆస్ట్రేలియాతో కలిసి క్వాడ్‌లో సభ్యదేశాలుగా ఉన్నాయి.

భారత్–జపాన్ రక్షణ సహకారం

  • 2+2 మినిస్టీరియల్ డైలాగ్ – ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశం.
  • జిమెక్స్ (JIMEX) – జపాన్–ఇండియా మారిటైమ్ ఎక్సర్‌సైజ్.
  • ధర్మ గార్జియన్ – భారత్–జపాన్ ద్వైపాక్షిక ఆర్మీ విన్యాసం.
  • వీర్ గార్జియన్ – భారత్–జపాన్ ద్వైపాక్షిక ఎయిర్‌ఫోర్స్ విన్యాసం.
  • మలబార్ – భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా పాల్గొనే మారిటైమ్ విన్యాసం.

Related Posts

భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే, సురక్షితమైన మరియు నాణ్యమైన హైవే మౌలిక సదుపాయాల కోసం “చింతన్ శిబిర్ 2026”

“చింతన్ శిబిర్ 2026” దేశంలో హైవే మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పంపిణీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు అమలు చేసే ఏజెన్సీల సీనియర్ ప్రతినిధులతో కలిసి కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ…

భారత్‌లో మొట్టమొదటి 5.56 కి.మీ. ఫ్రీ-స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) లింక్ విజయవంతం

భారత్‌లో మొట్టమొదటి 5.56 కి.మీ. ఫ్రీ-స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) లింక్ విజయవంతం పీఐబీ ఢిల్లీ: క్యూన్యూ ల్యాబ్స్ (QNu Labs), భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N) మరియు ఐఐటీ గాంధీనగర్ సంయుక్తంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *