Daily Current Affairs – 01 ఆగస్ట్ 2026 కరెంట్ అఫైర్స్

01. 2030 నాటికి 100 కోట్ల 5G వినియోగదారుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న భారత్

• భారత్ 2030 నాటికి 100 కోట్లు (1 Billion) మంది 5G వినియోగదారులను కలిగి ఉండే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

2022 అక్టోబర్ 1న ప్రారంభమైన 5G సేవలు, ఆ తర్వాత సమయంలో దేశంలోని దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి.

• భారత ప్రభుత్వం మరియు టెలికాం సంస్థలు కలిసి 5G మౌలిక సదుపాయాల విస్తరణకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

• 2025 మార్చి 25న, 2030 నాటికి భారత్‌లో 100 కోట్ల 5G వినియోగదారులు ఉంటారని తెలిపారు. •దేశవ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగంలో 74% వాటాగా ఉన్నట్లు పేర్కొన్నారు.

02. 2030–31 వరకు పీఎం-కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

  • కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకాన్ని 2026–27 నుంచి 2030–31 వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది.
  • ఈ పథకానికి ₹3.15 లక్షల కోట్ల మొత్తం ఆర్థిక వ్యయాన్ని ఆమోదించింది.
  • లక్ష్యం: ఈ నిర్ణయం ద్వారా వ్యవసాయ పెట్టుబడులు పెరగడం, వ్యవసాయ ఉత్పాదకత మెరుగుపడడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • ఈ పథకం కింద ఇప్పటివరకు ₹4.47 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డీబీటీ) ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేశారు.
  • ప్రారంభం : 2019
  • అమలు చేసే మంత్రిత్వ శాఖ : వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
  • ప్రధాన లక్ష్యం : అర్హులైన రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతు అందించడం.
  • ప్రయోజనం : సంవత్సరానికి ₹6,000, మూడు సమాన వాయిదాల్లో చెల్లింపు.

03. పునర్ వ్యవస్థీకరించిన ‘ఖేలో ఇండియా’ పథకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం

  • కేంద్ర మంత్రిమండలి 2026–27 నుంచి 2030–31 వరకు అమలయ్యే పునర్ వ్యవస్థీకరించిన ‘ఖేలో ఇండియా’ పథకానికి ఆమోదం తెలిపింది.

వ్యయం : ₹36,441 కోట్ల

  • ఎమర్జింగ్ ఖేలో ఇండియా అథ్లెట్స్ (ఈ-కియాస్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి, క్రీడాకారుల అభివృద్ధి వ్యవస్థను దాదాపు పది రెట్లు విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • నేషనల్ కోచ్ అక్రిడిటేషన్ బోర్డ్ (ఎన్ సిఏబీ)ను ఏర్పాటు చేసి శిక్షకుల అర్హతలను ప్రమాణీకరించడం, వృత్తిపరమైన ప్రమాణాలను మెరుగుపరచడం, శిక్షకులు, సహాయక సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యం.

ఖేలో ఇండియా:

  • ప్రారంభం : 2018
  • అమలు చేసే మంత్రిత్వ శాఖ : యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ
  • ప్రధాన లక్ష్యం : అడుగుడుగునా క్రీడలను ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి తీర్చిదిద్దడం, దేశంలో సమగ్ర క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేయడం.

04. భారత్ నౌకాదళానికి స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెసెల్ ‘నిపుణ్’ అందజేత

డైవింగ్ సపోర్ట్ వెసెల్ ‘నిపుణ్’

  • భారత్ నౌకాదళానికి 2026 జూలై 30న స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెసెల్ ‘నిపుణ్’ను అందజేశారు.
  • ‘నిపుణ్’, ఐఎన్ ఎస్ నిస్సార్ తర్వాత ఈ శ్రేణిలోని రెండో నౌక.

తయారీ సంస్థ:

  • దీనిని హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (హెచ్ ఎస్ ఎల్), విశాఖపట్నం నిర్మించింది.
  • డైవింగ్ సపోర్ట్ వెసెల్ (డీఎస్ వీ) అనేది లోతుత్తు సముద్ర డైవింగ్, నీటి అడుగున రక్షణ, శిథిలాల వెలికితీత, సముద్ర రక్షణ కార్యకలాపాల కోసం ఉపయోగించే ప్రత్యేక నౌక.
  • ‘నిపుణ్’ 118 మీటర్ల పొడవు, 8,560 టన్నులకు పైగా స్థానభ్రంశ సామర్థ్యం కలిగి ఉండి, డీప్-సీ సాచురేషన్ డైవింగ్ వ్యవస్థలు, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ (ఆర్ ఓవీ), డైనమిక్ పొజిషనింగ్ వ్యవస్థలు వంటి ఆధునిక సదుపాయాలను కలిగి ఉంది.

05. ఇరాన్‌కు చైనా భుజంపై మోసుకెళ్లే క్షిపణి వ్యవస్థలు (MANPADS) సరఫరా

  • 2026లో, చైనా తయారు చేసిన భుజంపై మోసుకెళ్లే వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలు (Man-Portable Air Defence Systems – MANPADS) తొలి విడతను ఇరాన్ వచ్చే కొన్ని వారాల్లో స్వీకరించనున్నట్లు సమాచారం.
  • ఈ ఒప్పందం విలువ సుమారు 60–70 మిలియన్ అమెరికన్ డాలర్లు.
  • ఇందులో 300 నుండి 400 వరకు MANPADS వ్యవస్థలు ఉండనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

QW-12 మరియు FN-16 క్షిపణులు

  1. QW-12
  2. చైనా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి వాయు రక్షణ క్షిపణి.
  3. తక్కువ ఎత్తులో ప్రయాణించే గగన లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించబడింది.
  • FN-16
  • చైనా తయారు చేసిన మరో ఆధునిక MANPADS.
  • సాధారణంగా ఇన్ఫ్రారెడ్ (Infrared) సీకర్ (Seeker) సాంకేతికతను ఉపయోగించి లక్ష్యాన్ని గుర్తించి క్షిపణిని దిశానిర్దేశం చేస్తుంది.

06. HPV సంబంధిత గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్ చికిత్సకు SHetA2 డ్రగ్

భారత వైద్య పరిశోధనా మండలి (Indian Council of Medical Research – ICMR) ఆధ్వర్యంలోని జాతీయ క్యాన్సర్ నివారణ మరియు పరిశోధన సంస్థ  SHetA2 అనే కొత్త ఔషధ అణువును భారతదేశంలో తదుపరి అభివృద్ధి కోసం ధ్రువీకరించింది (Validated).

• ఈ ఔషధం హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV) వల్ల కలిగే గర్భాశయ ముఖద్వార (Cervical) క్యాన్సర్ వ్యాధుల చికిత్స కోసం అభివృద్ధి చేయబడుతోంది.

07. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన (పీఎం-ఎస్ ఎస్ వై)కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

  • కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన (పీఎం-ఎస్ ఎస్ వై)కు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద తేలియాడే సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలు, వాటికి అనుబంధంగా శక్తి నిల్వ వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు.
  • కేటాయించిన బడ్జెట్ : ₹5,070 కోట్ల.
  • లక్ష్యం : 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యంతో పాటు, కనీసం 10,000 మెగావాట్-గంటల శక్తి నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం.
  • ఈ ప్రాజెక్టులను 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 వరకు ఆమోదిస్తారు. ఆర్థిక సహాయం 2032–33 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుతుంది. విజయవంతంగా పూర్తిచేసిన అర్హత కలిగిన ప్రతి మెగావాటు తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ₹1 కోటి కేంద్ర ఆర్థిక సహాయం అందజేస్తారు.

ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన (పీఎం-ఎస్ ఎస్ వై)

  • ఆమోదం : 2026 జులై 31
  • అమలు చేసే మంత్రిత్వ శాఖ : నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
  • ప్రధాన లక్ష్యం : తేలియాడే సౌర విద్యుత్ ఉత్పత్తి, శక్తి నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేసి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం.

08. ‘సముద్ర మంథన్’ జాతీయ సముద్రతీర అన్వేషణ పథకం

  • ఈ పథకాన్ని 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు అమలు
  • వ్యయం :  84,084 కోట్ల.
  • లక్ష్యం: ఈ పథకం ద్వారా భారత్ సముద్రతీర చమురు, సహజ వాయువు వనరులను గుర్తించి వినియోగంలోకి తీసుకురావడం, అలాగే సముద్రతీర అన్వేషణకు సంబంధించిన అన్ని దశలను బలోపేతం చేయడం
  • కేంద్ర మంత్రిమండలి, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర రంగ పథకమైన ‘సముద్ర మంథన్’ జాతీయ సముద్రతీర అన్వేషణ పథకానికి ఆమోదం తెలిపింది.
  • . ఈ పథకం ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు సమాన శక్తి నిల్వలు (ఎంఎంటీఓఈ) గుర్తించే అవకాశం ఉండి, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనుంది.

09. మాల్దీవుల్లో యూపీఐ సేవల ప్రారంభం

  • నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ పీసిఐఎల్) నిర్వహిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ను, మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ (ఎంఎంఏ) నిర్వహిస్తున్న ‘ఫవారా’ తక్షణ చెల్లింపుల వ్యవస్థతో విజయవంతంగా అనుసంధానించారు.
  • ఈ అనుసంధానం ద్వారా వేగవంతమైన, సురక్షితమైన, సులభమైన డిజిటల్ చెల్లింపులు సాధ్యమవుతాయి.
  • దీంతో మాల్దీవులు కూడా యూపీఐ సేవలు అందుబాటులో ఉన్న దేశాల జాబితాలో చేరింది.

యూపీ సేవలు అమలులో ఉన్న దేశాలు :

  • కాంబోడియా, గ్రీస్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక, అలాగే మాల్దీవుల్లో

10. భూటాన్ కు ₹4,000 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్ పై భారత్–భూటాన్ ఒప్పందం

  • 2026 జూలై 31న, థింపూలో జరిగిన ఐదవ భారత్–భూటాన్ అభివృద్ధి సహకార చర్చల్లో, భారత్–భూటాన్ మధ్య ₹4,000 కోట్లు (రూ. 40 బిలియన్) విలువైన కన్సెషనల్ ‘లైన్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ ఓసీ)’ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని ఎక్స్ పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్), భూటాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరస్పరం మార్చుకున్నాయి.
  • ‘లైన్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ ఓసీ)’ అనేది రాయితీ నిబంధనలపై నిర్దిష్ట అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు అందించే ఆర్థిక సహాయ విధానం.
  • భారత్ ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా భాగస్వామ్య దేశాలకు మౌలిక సదుపాయాలు మరియు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు లైన్ ఆఫ్ క్రెడిట్ అందిస్తుంది.

11. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న హిమాలయన్ చంద్ర టెలిస్కోప్

  • హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ (హెచ్ సీటీ) ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి.
  • ఇది లడఖ్ లోని హాన్లేలో ఉన్న ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ (ఐఏఓ)లో సముద్ర మట్టానికి సుమారు 4,500 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే 10వ అత్యంత ఎత్తైన ఆప్టికల్ టెలిస్కోప్.
  • ఈ టెలిస్కోప్ కు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం పేరు పెట్టారు.
  • ఇది 2 మీటర్ల ఆప్టికల్–ఇన్ ఫ్రారెడ్ టెలిస్కోప్. దీనిని బెంగళూరులోని హోసకోటేలో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ)కు చెందిన క్రెస్ట్ నియంత్రణ కేంద్రం నుంచి ఉపగ్రహ అనుసంధానం ద్వారా దూర నియంత్రణతో నిర్వహిస్తారు.
  • ఈ టెలిస్కోప్ ను గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీల అధ్యయనానికి ఉపయోగిస్తున్నారు. సౌర కుటుంబం వెలుపలి గ్రహమైన ‘ట్రాపిస్ట్-1బి’ అధ్యయనంలో కూడా ఇది కీలక పాత్ర పోషించింది.

ఇండియన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ (ఐఏఓ)

  • స్థానం : హాన్లే, లడఖ్

12. . మెక్సికోలో భారత కొత్త రాయబారిగా ఎన్.జి.జె. గాంగ్దే

  • భారత ప్రభుత్వం ఎన్.జి.జె. గాంగ్దే (న్గుల్ఫోమ్ జాథోమ్ గాంగ్దే)ను మెక్సికోలో భారత కొత్త రాయబారిగా నియమించింది.
  • 1994 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారైన ఆయన ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. త్వరలో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.
  • ఆయన డాక్టర్ పంకజ్ శర్మ స్థానంలో మెక్సికోలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
  • 2021 నుంచి ట్యునీషియాలో భారత రాయబారిగా పనిచేసిన ఆయన, అదే సమయంలో లిబియాకు భారత రాయబారిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు.

13. మాజీ సైన్యాధిపతి జనరల్ వి.ఎన్. శర్మ కన్నుమూత

  • భారత మాజీ సైన్యాధిపతి జనరల్ విశ్వనాథ్ శర్మ 2026 జూలై 31న న్యూఢిల్లీలో కన్నుమూశారు.
  • ఆయన 1988 మే 1 నుంచి 1990 జూన్ 30 వరకు 14వ సైన్యాధిపతిగా పనిచేశారు. 1950 జూన్లో 16వ లైట్ కావలీలో సైనిక అధికారిగా నియమితులయ్యారు.
  • స్వాతంత్య్రం తర్వాత నియమితులైన అధికారుల్లో సైన్యాధిపతి పదవికి చేరుకున్న తొలి అధికారిగా జనరల్ వి. ఎన్. శర్మ గుర్తింపు పొందారు.
  • తూర్పు సైన్య కమాండర్గా, 1987లో అరుణాచల్ ప్రదేశ్లోని సుమ్ దొరాంగ్ చూ ప్రాంతంలో చైనాతో జరిగిన సైనిక ప్రతిష్ఠంభనలో కీలక పాత్ర పోషించారు.

14. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్-2026

  • న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో జరుగుతున్న 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్-2026లో భారత్ పురుషుల, మహిళల జట్టు విభాగాల్లో ఛాంపియన్గా నిలిచింది
  • పురుషుల ఫైనల్లో భారత్ మలేషియాను 3-2తో ఓడించింది. మనుష్ షా నిర్ణయాత్మక సింగిల్స్ మ్యాచ్ లో విజయం సాధించి జట్టుకు టైటిల్ అందించాడు.
  • మహిళల ఫైనల్లో భారత్ మలేషియాను 3-0తో ఓడించింది. స్వస్తిక ఘోష్, శ్రీజ ఆకుల, యశస్విని ఘోర్పడే తమ తమ మ్యాచ్ లలో విజయం సాధించారు.
  • 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు న్యూఢిల్లీలో జరుగుతోంది.
  • మలేషియా పురుషుల, మహిళల జట్టు విభాగాల్లో రన్నరప్, ఇంగ్లండ్ రెండు విభాగాల్లో కాంస్య పతక విజేతగా నిలిచింది.

కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్

  • నిర్వహణ వ్యవధి : ప్రతి రెండేళ్లకోసారి
  • పాల్గొనే దేశాలు : కామన్వెల్త్ సభ్య దేశాలు

15. 11వ అఖిల భారత్ పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్ షిప్–2026

  • 11వ అఖిల భారత్ పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్ షిప్–2026, 2026 జూలై 23–30 మధ్య తెలంగాణలోని హైదరాబాద్, గచ్చిబౌలిలోని జీఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగింది.
  • ఈ పోటీలను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ ఎఫ్), అఖిల భారత్ పోలీస్ క్రీడల నియంత్రణ మండలి (ఏఐపీఎస్ సీబీ) ఆధ్వర్యంలో నిర్వహించింది.
  • జూడో, వుషు, తైక్వాండో, కరాటే, పెన్చాక్ సిలాట్ విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో 36 కేంద్ర, రాష్ట్ర పోలీస్ సంస్థల నుంచి సుమారు 1,600 మంది క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు.
  • సశస్త్ర సీమా బల్ (ఎస్ ఎస్ బీ) 203 పాయింట్లతో (24 స్వర్ణ, 20 రజత, 23 కాంస్యాలు) సమగ్ర విజేతగా నిలవగా, సీఐఎస్ ఎఫ్ (198 పాయింట్లు) రెండో, ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) (139 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాయి.

16. భారత్-నేపాల్ సంయుక్తంగా లలిత్‌పూర్‌లో బౌద్ధ వారసత్వ కట్టడాల పునరుద్ధరణ కార్యక్రమం

  • భారత్ మరియు నేపాల్ కలిసి నేపాల్‌లోని లలిత్‌పూర్ (Lalitpur) నగరంలో శ్రీ గుస్థల్ మహావిహార్ (Shree Gusthal Mahavihar) మరియు అగమ్ ఆఫ్ ప్రథమశ్రీ మహావిహార్ (Agam of Prathams(h)ree Mahavihar) పునరుద్ధరణ పనులను ప్రారంభించారు.
  • ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పూర్తి చేయబడింది.

పునరుద్ధరించిన వారసత్వ కట్టడాలు

1. శ్రీ గుస్థల్ మహావిహార్ (Shree Gusthal Mahavihar)

2. అగమ్ ఆఫ్ ప్రథమశ్రీ మహావిహార్ (Agam of Prathams(h)ree Mahavihar)

  • ఇవి బౌద్ధ మతానికి చెందిన చారిత్రక వారసత్వ కట్టడాలు.
  • ఇవి నేపాల్‌లోని లలిత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీ, ఖాట్మండు లోయ (Kathmandu Valley)లో ఉన్నాయి.

17. భారత్‌లో తొలి టెలికాం తయారీ మండలి (Telecom Manufacturing Zone – TMZ) గ్వాలియర్‌లో ఏర్పాటు

  • 2026 జూలైలో, భారత్ టెలికాం మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి పెద్ద ఊతమిచ్చేలా భారతదేశంలో తొలి టెలికాం తయారీ మండలి (Telecom Manufacturing Zone – TMZ)ను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
  • ఈ ప్రాజెక్టు “మేక్ ఇన్ ఇండియా (Make in India)” మరియు “ఆత్మనిర్భర్ భారత్ (Aatmanirbhar Bharat)” కార్యక్రమాలకు బలాన్నిస్తూ, టెలికాం పరికరాల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

18. పాఠశాలల సమయంలో జంక్ ఫుడ్ విక్రయాలపై మహారాష్ట్ర నిషేధం

  • 2026 జూలై 28న, మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (Maharashtra Food and Drug Administration – FDA) పాఠశాలల సమీపంలో అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు (High Fat, Sugar and Salt – HFSS) కలిగిన ఆహార పదార్థాల అమ్మకం, ప్రచారం మరియు ఉచిత పంపిణీపై నియంత్రణ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
  • ఈ నిషేధం పాఠశాలల ప్రాంగణం నుంచి 50 మీటర్ల పరిధిలో అమల్లో ఉంటుంది.

ఇది 22 నెలల వయస్సు గల చిన్నారుల నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వర్తిస్తుంది

19. నశా ముక్త యువ – వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ 2026

  • 2026 ఆగస్టు 2న, ‘నశా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ (Nasha Mukta Yuva for Viksit Bharat Sankalp Abhiyaan)’ పేరుతో 100 వారాల (100-Week) దేశవ్యాప్త యువజన ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు.
  • ఈ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ (Ministry of Youth Affairs and Sports), MY Bharat ద్వారా నిర్వహిస్తోంది.
  • దీని ప్రధాన లక్ష్యం మాదకద్రవ్యాల రహిత భారత్ (Drug-Free India) నిర్మాణం.

20. గ్రామ పంచాయతీల డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం ‘దాన్‌వీర్ (DAANVEER)’ కార్యక్రమం ప్రారంభం

  • పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ (Ministry of Panchayati Raj) ‘దాన్‌వీర్ (DAANVEER)’ అనే పౌర భాగస్వామ్య (Citizen Participation) డిజిటల్ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించింది.
  • గ్రామ పంచాయతీలలో డిజిటల్ మౌలిక సదుపాయాలను (Digital Infrastructure) బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
  • ఈ వేదిక ద్వారా దేశంలోని అర్హత కలిగిన గ్రామ పంచాయతీలకు ప్రమాణీకృత (Standardised), నాణ్యత ధృవీకరించిన (Quality-Verified) కంప్యూటర్ బండిల్స్‌ను విరాళంగా అందించవచ్చు.

Related Posts

Daily Current Affairs – 02 ఆగస్ట్ 2026 కరెంటు అఫైర్స్

01. జులై 2026లో స్థూల జీఎస్టీ వసూళ్లు ₹2.11 లక్షల కోట్లు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) జీఎస్టీ కౌన్సిల్ 02. ISSF ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం…

Daily current Affairs Telugu- 13 ఆగష్టు 2026 కరెంట్ అఫైర్స్

1.ఉదార శక్తి విన్యాసాలు 2026 ఉదార శక్తి 2026విన్యాసాలు భారత వైమానిక దళం మరియు రాయల్ మలేషియన్ వైమానిక దళం మధ్య 2026 ఆగస్టు 10 నుండి 14 వరకు మలేషియాలోని సుబాంగ్ ఎయిర్ బేస్ వద్ద జరిగిన ద్వైపాక్షిక వైమానిక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *