ప్రాథమిక హక్కులు

  • భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పౌరుల స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం మరియు వ్యక్తిగత హక్కులకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తాయి. ఇవి రాజ్యాంగంలోని Part IIIలో Articles 12 నుంచి 35 వరకు పొందుపరచబడ్డాయి.
  • ప్రాథమిక హక్కుల భావనపై అమెరికా రాజ్యాంగంలోని Bill of Rights ప్రభావం ఉంది. అయితే భారత రాజ్యాంగం వాటిని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించింది.
  • ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 6 రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి.
  • 📌 6 ప్రాథమిక హక్కులు
  • సమానత్వపు హక్క : 14–18
  • స్వేచ్ఛా హక్కు : 19–22
  • దోపిడీకి వ్యతిరేకమైన హక్క : 23–24
  • మత స్వేచ్ఛా హక్కు : 25–28
  • సాంస్కృతిక, విద్యా హక్కులు : 29–30
  • రాజ్యాంగ పరిహార హక్కు : 32
  • గమనిక: మొదట ఆస్తి హక్కు కూడా Fundamental Rightగా ఉండేది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తొలగించారు. ప్రస్తుతం Article 300A కింద ఆస్తి హక్కు ఉంది.

ఆర్టికల్ 12 & 13 (మౌలిక సూత్రాలు)

  • ఆర్టికల్ 12: ‘రాజ్యం’ (State) నిర్వచనం
    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంట్, శాసనసభలు, స్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు, పంచాయతీలు) మరియు LIC, ONGC, ఎలక్ట్రిసిటీ బోర్డు వంటి ప్రభుత్వ నియంత్రణలో ఉండే సంస్థలు ‘రాజ్యం’ పరిధిలోకి వస్తాయి.
  • ఆర్టికల్ 13: న్యాయ సమీక్ష (Judicial Review)
    • 13(1): రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే చెల్లవు.
    • 13(2): రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రాథమిక హక్కులను హరించేలా రాజ్యం చేసే ఏ చట్టమైనా చెల్లదు.
    • 13(3): ‘చట్టం’ (Law) అంటే ఆర్డినెన్స్, జీవో (G.O.), బై-లా, నోటిఫికేషన్ లేదా ఆచారం కూడా వస్తుంది.
    • 13(4): ఆర్టికల్ 368 ప్రకారం చేసే రాజ్యాంగ సవరణలు ఆర్టికల్ 13 కింద ‘చట్టం’ కాదు (24వ రాజ్యాంగ సవరణ, 1971).
    • కీలక కేసులు:
      • గోలక్‌నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1967): పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదు అని తీర్పునిచ్చింది.
      • కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (1973): “మౌలిక స్వరూప సిద్ధాంతం” (Basic Structure Doctrine) ప్రతిపాదన. ప్రాథమిక హక్కులను సవరించవచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు.
      • మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1980): న్యాయ సమీక్షా అధికారం (Judicial Review) రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని స్పష్టం చేసింది.

1. సమానత్వపు హక్కు (Articles 14 – 18)

  • ఆర్టికల్ 14: చట్టం ముందు సమానత్వం
    • చట్టం ముందు అందరూ సమానులే (బ్రిటన్ భావన), చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ (అమెరికా భావన).
    • కేసు: ఈ.పి. రోయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు (1974) – ఆర్టికల్ 14 రాజ్యం యొక్క అడ్డగోలు / ఏకపక్ష నిర్ణయాలకు విరుద్ధమైనదని పేర్కొంది.
  • ఆర్టికల్ 15: వివక్షత నిషేధం
    • 15(1): మత, జాతి, కుల, లింగ, జన్మస్థలం ప్రాతిపదికన ఏ పౌరుడిపై వివక్ష చూపరాదు.
    • 15(2): దుకాణాలు, హోటళ్లు, బావులు, ఘాట్ల వద్ద ప్రవేశానికి వివక్ష ఉండకూడదు.
    • 15(3): మహిళలు మరియు పిల్లలకు ప్రత్యేక మినహాయింపులు/రక్షణలు కల్పించవచ్చు.
    • 15(4): సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు (SC, ST, OBC) ప్రత్యేక సదుపాయాలు (1వ రాజ్యాంగ సవరణ, 1951).
    • 15(5): ప్రైవేట్, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు (93వ రాజ్యాంగ సవరణ, 2005).
    • 15(6): ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) విద్యాసంస్థల్లో 10% రిజర్వేషన్లు (103వ రాజ్యాంగ సవరణ, 2019).
    • కేసు: చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ (1951): ఈ తీర్పు ఆధారంగానే మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(4)ని చేర్చారు.
  • ఆర్టికల్ 16: ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు
    • 16(1) & 16(2): ఉద్యోగ నియామకాల్లో పౌరులందరికీ సమాన అవకాశం, వివక్ష నిషేధం.
    • 16(3): స్థానికత/నివాసం ప్రాతిపదికన ఉద్యోగాల్లో పార్లమెంటు నిబంధనలు చేయవచ్చు.
    • 16(4): తగిన ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు.
    • 16(4A): SC, ST లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు (77వ సవరణ, 1995).
    • 16(4B): క్యారీ ఫార్వర్డ్ ఖాళీలపై 50% పరిమితి వర్తించదు (81వ సవరణ, 2000).
    • 16(6): EWS వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు.
    • కేసు: ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1992 – మండ్ల కేస్): రిజర్వేషన్లు 50% మించకూడదు, “క్రీమీ లేయర్” (Creamy Layer) భావన అమలులోకి తెచ్చారు.
  • ఆర్టికల్ 17: అంటరానితనం నిర్మూలన
    • అస్పృశ్యత ఆచరణ శిక్షార్హం (సివిల్ హక్కుల పరిరక్షణ చట్టం, 1955).
  • ఆర్టికల్ 18: బిరుదుల రద్దు
    • 18(1): విద్య, సైనిక రంగాలు మినహా రాజ్యపరమైన బిరుదుల రద్దు.
    • కేసు: బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1996): భారతరత్న, పద్మ అవార్డులు “బిరుదులు” కావు, అవార్డులు మాత్రమే అని తేల్చింది.

2. స్వాతంత్ర్యపు హక్కు (Articles 19 – 22)

  • ఆర్టికల్ 19: 6 రకాల ప్రాథమిక స్వేచ్ఛలు
    • 19(1)(a): వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ (పత్రికా స్వేచ్ఛ ఇందులో భాగమే).
    • 19(1)(b): ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు.
    • 19(1)(c): సంఘాలు, సహకార సంఘాలు (Co-operatives) ఏర్పాటు చేసే హక్కు.
    • 19(1)(d): దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా సంచరించే హక్కు.
    • 19(1)(e): దేశంలో ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పాటు చేసుకునే హక్కు.
    • 19(1)(f): ఆస్తి హక్కు (44వ సవరణ, 1978 ద్వారా తొలగించబడింది).
    • 19(1)(g): నచ్చిన వృత్తి లేదా వ్యాపారం చేసుకునే హక్కు.
    • (నోట్: 19(2) నుండి 19(6) వరకు ఈ స్వేచ్ఛలపై “సమంజసమైన ఆంక్షలు” విధించే అధికారం రాజ్యానికి ఉంది).
    • కేసులు:
      • శ్రేయ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2015): IT యాక్ట్ లోని సెక్షన్ 66A ను భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధమని కొట్టివేసింది.
      • అనురాధ భాసిన్ వర్సెస్ UOI (2020): ఇంటర్నెట్ వినియోగం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రాథమిక హక్కు అని తీర్పు ఇచ్చింది.
  • ఆర్టికల్ 20: నేరాలకు సంబంధించి అనుచిత శిక్షల నుండి రక్షణ
    • 20(1) Ex-Post Facto Law: నేరం చేసిన సమయంలో ఉన్న చట్టం కంటే ఎక్కువ శిక్ష వేయకూడదు.
    • 20(2) Double Jeopardy: ఒకే నేరానికి ఒకరికంటే ఎక్కువసార్లు శిక్షించకూడదు.
    • 20(3) Self-Incrimination: తనపై తాను నేరారోపణ చేసుకునేలా బలవంతం చేయకూడదు (లై డిటెక్టర్ / నార్కో అనాలిసిస్ టెస్టులకు వ్యక్తి ముందస్తు అనుమతి తప్పనిసరి).
  • ఆర్టికల్ 21: జీవించే హక్కు & వ్యక్తిగత స్వేచ్ఛ
    • చట్టం నిర్దేశించిన పద్ధతి (Procedure Established by Law) ద్వారా తప్ప వ్యక్తి ప్రాణాన్ని, స్వేచ్ఛను హరించకూడదు.
    • కీలక కేసులు:
      • ఏ.కే. గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ (1950): ఆర్టికల్ 21 కి సకారాత్మక, పరిమిత వ్యాఖ్యానం ఇచ్చింది.
      • మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1978): ఆర్టికల్ 21 విశాలమైనది. చట్టం కేవలం పద్ధతే కాకుండా “న్యాయబద్ధంగా, సమంజసంగా” (Due Process of Law) ఉండాలని స్పష్టం చేసింది.
      • జస్టిస్ కె.ఎస్. పుట్టస్వామి వర్సెస్ UOI (2017): “రహస్యత/వ్యక్తిగత గోప్యతా హక్కు” (Right to Privacy) ఆర్టికల్ 21 లో భాగమని తీర్పునిచ్చింది.
  • ఆర్టికల్ 21A: ఉచిత, నిర్బంధ విద్యా హక్కు
    • 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్యా హక్కు (86వ రాజ్యాంగ సవరణ, 2002).
    • కేసు: ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రాప్రదేశ్ (1993): ప్రాథమిక విద్య జీవించే హక్కులో భాగమని ఈ కేసు ద్వారానే గుర్తించారు.
  • ఆర్టికల్ 22: అక్రమ అరెస్ట్ మరియు నిర్బంధం నుండి రక్షణ
    • 22(1) & 22(2): అరెస్ట్ కారణాలు తెలుసుకునే హక్కు, నచ్చిన లాయర్‌ను సంప్రదించే హక్కు, 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి (ప్రయాణ సమయం మినహాయించి).
    • 22(4) నుండి 22(7): నిరోధక నిర్బంధ చట్టాలు (Preventive Detention Law). సలహా మండలి అనుమతి లేకుండా గరిష్టంగా 3 నెలల కంటే ఎక్కువ నిర్బంధించకూడదు.

3. పీడనాన్ని నిరోధించే హక్కు (Articles 23 – 24)

  • ఆర్టికల్ 23: మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ నిషేధం
    • మనుషుల కొనుగోలు/అమ్మకాలు, బలవంతపు చాకిరీ (Forced Labour) నేరం.
    • కేసు: బంధువా ముక్తి మోర్చా వర్సెస్ UOI (1984): వెట్టి చాకిరీ నిర్మూలనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
  • ఆర్టికల్ 24: బాలకార్మిక వ్యవస్థ రద్దు
    • 14 సంవత్సరాల లోపు పిల్లలను గనులు, కర్మాగారాలు వంటి ప్రమాదకర పని ప్రదేశాల్లో నియమించకూడదు.
    • కేసు: ఎమ్.సి. మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు (1996): బాలకార్మిక పునరావాస సంక్షేమ నిధి ఏర్పాటుకు ఆదేశాలు.

4. మత స్వాతంత్ర్యపు హక్కు (Articles 25 – 28)

  • ఆర్టికల్ 25: అంతరాత్మను అనుసరించి నచ్చిన మతాన్ని స్వీకరించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కు.
    • కేసులు:
      • షాయరా బానో వర్సెస్ UOI (2017): ‘ట్రిపుల్ తలాక్’ ఆచారం ఆర్టికల్ 14, 21 మరియు 25 కి విరుద్ధమని రద్దు చేసింది.
      • శబరిమల కేసు (2018): మత విశ్వాసాల పేరుతో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు.
  • ఆర్టికల్ 26: మతపరమైన సంస్థలు, ధర్మకర్తృత్వాలను స్థాపించి నిర్వహించుకునే స్వేచ్ఛ.
  • ఆర్టికల్ 27: ఏ నిర్దిష్ట మతాభివృద్ధికి పన్నులు చెల్లించమని పౌరులను నిర్బంధించకూడదు (పన్నులు నిషేధం, రుసుములు/Fees వేయవచ్చు).
  • ఆర్టికల్ 28: పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థల్లో మతబోధన చేయకూడదు.

5. విద్యా, సాంస్కృతిక హక్కు (Articles 29 – 30)

  • ఆర్టికల్ 29: అల్పసంఖ్యాక వర్గాల (Minorities) భాష, లిపి, సంస్కృతి పరిరక్షణ.
  • ఆర్టికల్ 30: అల్పసంఖ్యాక వర్గాలు విద్యాసంస్థలను స్థాపించి నిర్వహించుకునే హక్కు.
    • కేసు: టి.ఎమ్.ఎ. పాయ్ ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక (2002): మైనారిటీ విద్యా సంస్థల యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు విస్తృత మార్గదర్శకాలు ఇచ్చింది.

6. రాజ్యాంగ పరిహార హక్కు (Article 32)

  • ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే పౌరులు నేరుగా సుప్రీంకోర్టును (Art 32) లేదా హైకోర్టును (Art 226) ఆశ్రయించవచ్చు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దీనిని “రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం” అన్నారు.
  • కోర్టులు జారీ చేసే 5 రకాల రిట్లు (Writs):
రిట్ పేరుఅర్థంఉపయోగం
హేబియస్ కార్పస్ (Habeas Corpus)“శరీరాన్ని హాజరుపరచండి”అక్రమంగా నిర్బంధించిన వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టడం.
మాండమస్ (Mandamus)“మేము ఆజ్ఞాపిస్తున్నాం”ప్రభుత్వ అధికారి తన చట్టబద్ధమైన విధిని నిర్వహించనప్పుడు జారీ చేస్తారు.
ప్రొహిబిషన్ (Prohibition)“నిషేధించడం/అడ్డుకోవడం”దిగువ కోర్టులు పరిధి దాటి పనిచేయకుండా ఎగువ కోర్టు నిలిపివేస్తుంది.
సెర్షియోరరి (Certiorari)“సాక్ష్యాధారాలతో ధృవీకరించడం”దిగువ కోర్టుల తీర్పులను రద్దు చేసి, కేసులను ఎగువ కోర్టుకు మార్చడం.
క్వో-వారంటో (Quo-Warranto)“ఏ అధికారంతో?”ఒక వ్యక్తి ప్రభుత్వ పదవిని ఏ అర్హతతో నిర్వహిస్తున్నారో ప్రశ్నించడం.
  • కేసు: ఎల్. చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1997): ఆర్టికల్ 32 మరియు 226 కింద కోర్టులకు ఉన్న రిట్ అధికారం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని తీర్పు ఇచ్చింది.

ఆర్టికల్స్ 33, 34 మరియు 35

  • ​Art 33: సాయుధ బలగాలు, పోలీసు విభాగాలు, ఇంటెలిజెన్స్ సంస్థలలో పనిచేసే వారి ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంది.
  • ​Art 34: దేశంలో మార్షల్ లా (సైనిక పాలన) అమలులో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించడం.
  • ​Art 35: ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి అవసరమైన చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది.

సమ్మరీ క్లిక్ నావిగేషన్ (పరీక్షల్లో అడిగే స్పెషల్ పాయింట్లు):

  • జాతీయ అత్యవసర పరిస్థితి (Art 352) సమయంలో ఆర్టికల్ 19 ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. కానీ ఆర్టికల్ 20, 21లు ఎప్పటికీ రద్దు కావు.
  • కేవలం భారత పౌరులకు మాత్రమే లభించే హక్కులు: 15, 16, 19, 29, 30.

పోటీ పరీక్షలకు ముఖ్యమైన బిట్స్ (Exam Special Points)

  • ​రద్దు కాని హక్కులు: జాతీయ అత్యవసర పరిస్థితి (Art 352) అమలులో ఉన్నప్పుడు కూడా ఆర్టికల్ 20 మరియు 21 లోని హక్కులు రద్దు కావు.
  • ​కేవలం భారత పౌరులకు మాత్రమే లభించే హక్కులు: Articles 15, 16, 19, 29, 30.
  • ​భారత పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తించే హక్కులు: Articles 14, 20, 21, 21A, 22, 23, 24, 25, 26, 27, 28.
  1. Fundamental Rights ఏ Partలో ఉన్నాయి?
    A) Part II
    B) Part III
    C) Part IV
    D) Part IVA
    జవాబు: B
  2. Fundamental Rights ఏ Articlesలో ఉన్నాయి?
    A) 1–11
    B) 12–35
    C) 36–51
    D) 52–78
    జవాబు: B
  3. Article 14 దేనికి సంబంధించినది?
    A) మత స్వేచ్ఛ
    B) సమానత్వం
    C) విద్య
    D) ఆస్తి
    జవాబు: B
  4. Untouchabilityను రద్దు చేసిన Article?
    A) 15
    B) 16
    C) 17
    D) 18
    జవాబు: C
  5. Titles abolition?
    A) Article 16
    B) Article 17
    C) Article 18
    D) Article 19
    జవాబు: C
  6. ప్రస్తుతం Article 19లో ఎన్ని freedoms ఉన్నాయి?
    A) 5
    B) 6
    C) 7
    D) 8
    జవాబు: B
  7. Article 20లో ఎన్ని ప్రధాన రక్షణలు ఉన్నాయి?
    A) 2
    B) 3
    C) 4
    D) 5
    జవాబు: B
  8. Right to Privacy ఏ Articleతో ప్రధానంగా సంబంధం కలిగి ఉంది?
    A) 14
    B) 19
    C) 21
    D) 32
    జవాబు: C
  9. Article 21A ఏ వయస్సు పిల్లలకు?
    A) 5–10
    B) 6–14
    C) 10–18
    D) 14–18
    జవాబు: B
  10. Human Trafficking ఏ Article?
    A) 21
    B) 22
    C) 23
    D) 24
    జవాబు: C
  11. Child Labourకు సంబంధించిన Article?
    A) 23
    B) 24
    C) 25
    D) 26
    జవాబు: B
  12. Freedom of Religion Articles?
    A) 19–22
    B) 23–24
    C) 25–28
    D) 29–30
    జవాబు: C
  13. Minority Educational Rights?
    A) Article 25
    B) Article 28
    C) Article 29
    D) Article 30
    జవాబు: D
  14. Constitutional Remedies?
    A) Article 30
    B) Article 31
    C) Article 32
    D) Article 35
    జవాబు: C
  15. “Heart and Soul of Constitution” అని దేనిని అంటారు?
    A) Article 14
    B) Article 19
    C) Article 21
    D) Article 32
    జవాబు: D
  16. Habeas Corpus అర్థం?
    A) We command
    B) By what authority
    C) Produce the body
    D) To forbid
    జవాబు: C
  17. Basic Structure Doctrine ఏ కేసులో?
    A) Maneka Gandhi
    B) Kesavananda Bharati
    C) Indra Sawhney
    D) Puttaswamy
    జవాబు: B
  18. Right to Privacyను Fundamental Rightగా గుర్తించిన కేసు?
    A) Golaknath
    B) Minerva Mills
    C) Puttaswamy
    D) Vishaka
    జవాబు: C
  19. Mandal Reservationకు ప్రసిద్ధి చెందిన కేసు?
    A) Indra Sawhney
    B) Shreya Singhal
    C) Selvi
    D) Bommai
    జవాబు: A
  20. Article 66Aను రద్దు చేసిన కేసు?
    A) Puttaswamy
    B) Shreya Singhal
    C) Vishaka
    D) T.M.A. Pai
    జవాబు: B
  21. ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ Articleలో ఉంది?
    A) 19
    B) 31
    C) 300A
    D) 32
    జవాబు: C
  22. Article 21A ఏ సవరణ ద్వారా వచ్చింది?
    A) 42వ
    B) 44వ
    C) 73వ
    D) 86వ
    జవాబు: D
  23. EWS Reservationకు సంబంధించిన Articles?
    A) 14,15
    B) 15(6),16(6)
    C) 17,18
    D) 19,20
    జవాబు: B
  24. Martial Lawకు సంబంధించిన Article?
    A) 32
    B) 33
    C) 34
    D) 35
    జవాబు: C
  25. Parliament ప్రత్యేకంగా చట్టం చేసే అధికారానికి సంబంధించిన Article?
    A) 32
    B) 33
    C) 34
    D) 35
    జవాబు: D