01 September 2026 Current Affairs – 01 సెప్టెంబర్ 2026 కరెంట్ అఫ్ఫైర్స్

01 September Current Affairs Telugu

01.మిషన్ సమృద్ధ్ గావ్ పథకాన్ని ప్రారంభించిన గ్రామీణ మంత్రిత్వశాఖ

ముఖ్య ఉద్దేశ్యం

  • గ్రామాల్లో పేదరికాన్ని నిర్మూలించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, వలసలను అరికట్టడం మరియు మెరుగైన మౌలిక వసతులను కల్పించడం ద్వారా స్వయం సమృద్ధిగల మోడల్ గ్రామాలను తయారుచేయడం
  • మిషన్ సమృద్ధ్ గావ్ అనేది కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన నూతన పథకం.

ప్రదేశం : మధ్యప్రదేశ్‌లోని రెండు బ్లాక్‌లలో (సీపోర్ జిల్లాలోని బుద్ని, దేవాస్ జిల్లాలోని ఖాటెగావ్) పైలట్ ప్రాజెక్ట్‌

  • లఖ్‌పతీ దీదీ” నమూనా ద్వారా గ్రామీణ మహిళా రైతులకు సాంకేతిక సలహాలు, సూక్ష్మ రుణాలు అందించి వారిని వ్యాపారవేత్తలుగా మారుస్తారు.
  • పంట నష్టాలను తగ్గించడానికి గ్రామ స్థాయిలోనే కోల్డ్ చైన్లు, గిడ్డంగులు మరియు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు.
  • మరోవైపు గ్రామీణ భారతదేశాన్ని డిజిటల్‌గా బలోపేతం చేయడానికి సమృద్ధ్ గ్రామ్ డిజిటల్ సర్వీసెస్ను కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ 2026 మార్చి 14న ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం కింద మొదటి విడతగా మధ్యప్రదేశ్‌లోని అరి అండ్ ఉమ్రీ, ఆంధ్రప్రదేశ్‌లోని నరకోడూరు మరియు ఉత్తరప్రదేశ్‌లోని చౌరావాలా గ్రామాలను ఎంపిక చేశారు.

02. నల్లమెడ కొంగల సంతానోత్పత్తి కేంద్రంగా ఖిజాడియా పక్షుల అభయారణ్యం

  • గుజరాత్‌లోని రామ్‌సర్ ప్రాంతమైన ఖిజాడియా పక్షుల అభయారణ్యం అరుదైన నల్లమెడ గల కొంగల ప్రధాన పెంపకం మరియు సంతానోత్పత్తి కేంద్రంగా అవతరించినట్లు గుజరాత్ ఎకలాజికల్ కమిషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
  • ముఖ్యమైన అంశాలు: సాధారణంగా ఈ కొంగలు స్వచ్ఛమైన పెద్ద పక్షులపై గుడ్లు పెడతాయి. కాగా ఇటీవల అభివృద్ధి చేసిన సమూహం ప్రకారం ఇది “నల్లమ్మ జాతిపిట్ట” (గండభేరుండ?) అనే ప్రత్యేక జాతికి చెందినదిగా పేర్కొనబడింది.
  • గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ ఖిజాడియా పక్షుల అభయారణ్యం మంచినీరు మరియు ఉప్పునీటి చిత్తడి నేలల అరుదైన కలయికకు ప్రసిద్ధి చెందింది. వలస పక్షులకు ఆవాసంగా ఉండే ఈ కేంద్రానికి 2022లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్‌సర్ సైట్ గుర్తింపు లభించింది.

03. ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్ PM కే సాత్

  • ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్ PM కే సాత్ అనేది భారత యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ పరిధిలోని “మేరా యువ భారత్” (MY Bharat) సంస్థ ద్వారా పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో నిర్వహించబడిన అతిముఖ్యమైన క్రీడా సంభాషణ కార్యక్రమం.
  • ప్రధాన లక్ష్యం:
  • దేశంలో ఎదుగుతున్న క్రీడావ్యవస్థతో యువతను అనుసంధానించడం, ఫిట్‌నెస్ సంస్కృతిని పెంచడం, యువత నాయకత్వంలో దేశ నిర్మాణాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
  • ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్ PM కే సాత్ 5 ముఖ్యమైన అంశాలు:
  • క్రీడావ్యవస్థ మెరుగుదల
  • 2036 ఒలింపిక్స్ లక్ష్యం
  • యువ నాయకత్వం
  • వికసిత్ భారత్ (2047) నిర్మాణం
  • డ్రగ్స్ రహిత యువత
  • మరోవైపు “MY BHARAT” పోర్టల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 అక్టోబర్ 31న ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం దేశంలోని అన్ని రంగాల్లో నాయకులను తీర్చిదిద్దడం.
  • ప్రస్తుత కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి – మన్‌సుఖ్ మాండవీయ.
  • ప్రముఖ భారత హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని మొదటి జాతీయ క్రీడా దినోత్సవం 2012 ఆగస్టు 29న నిర్వహించబడింది.

04. ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్ అజిత్

  • ఇండియన్ కోస్ట్‌గార్డ్ కోసం నిర్మించిన అత్యాధునిక స్వదేశీ ఫాస్ట్ పెట్రోల్ వెసెల్. ఇందులో 65 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం ఉంది.
  • పొడవు – 51.43 మీటర్లు
  • వెడల్పు – 8 మీటర్లు
  • బరువు/స్థానభ్రంశం – 330 టన్నులు
  • గరిష్ట వేగం – 27 నాట్లు
  • ప్రయాణ సామర్థ్యం – 1500 నాటికల్ మైళ్లు

తయారీ సంస్థ : గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ 8 స్వదేశీ ఫాస్ట్ పెట్రోల్ వెసల్స్‌ను రూపొందించింది. అవి:

  • అదమ్య (మొదటిది)
  • అక్షర్
  • అమూల్యా
  • అక్షయ్, అచల్, అటల్
  • అజిత్ (7వది)
  • అపరాజిత్.

05. లక్ష్మీయోజన పథకం – ఢిల్లీ

  • రాష్ట్రం : ఢిల్లీ
  • ప్రయోజనం : అర్హులైన మహిళల ఖాతాల్లో ప్రతినెలా రూ.2,500 నేరుగా జమచేస్తారు
  • ప్రారంభం : 01 సెప్టెంబర్ 2026

అర్హత

  • దరఖాస్తు చేసే మహిళల వయసు 21–60 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000 మించకూడదు.
  • దరఖాస్తుదారు లేదా వారి కుటుంబం ఢిల్లీలో కనీసం 10 సంవత్సరాలు నివసించి ఉండాలి.
  • కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది.

06. ఆరావళి — మీడియం హెలికాప్టర్ ఇంజిన్

  • హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మరియు ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్స్ సంస్థలు సంయుక్తంగా “ఆరావళి” అనే శక్తివంతమైన మీడియం హెలికాప్టర్ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి తుది ఒప్పందం కుదుర్చుకున్నాయి.
  • “ఆరావళి” అనేది 3,500–4,000 షాఫ్ట్ హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేసే అధునాతన టర్బోషాఫ్ట్ ఇంజిన్.
  • హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) రూపొందిస్తున్న 13 టన్నుల ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ మరియు నావికాదళం కోసం తయారయ్యే డెక్-బేస్డ్ మల్టీరోల్ హెలికాప్టర్‌లలో ఈ ఇంజిన్‌ను ఉపయోగిస్తారు.
  • ప్రాముఖ్యత:
  • భారతీయ సాయుధ దళాల్లో ఉన్న రష్యా తయారీ Mi-17 హెలికాప్టర్ల స్థానంలో భవిష్యత్తులో ఈ స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే హెలికాప్టర్లు రానున్నాయి.

08. జపాన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

ఒప్పంద ముఖ్యాంశాలు:

  • తెలంగాణ యువతకు జపాన్‌లో అంతర్జాతీయ ఉపాధి, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు అవగాహన ఒప్పందాలు చేపట్టింది.
  • కిండాయ్ యూనివర్శిటీ వంటి ప్రముఖ సంస్థలతో కలిసి విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధనలు మరియు సాంకేతిక నైపుణ్యాలను అందించే దిశగా కృషి చేయనున్నారు.
  • మరోవైపు తెలంగాణలో నిరుద్యోగ యువతను తీర్చిదిద్దేందుకు 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. జపాన్‌కు చెందిన NEYSA NETWORK సుమారు రూ. 10,500 కోట్ల వ్యయంతో తెలంగాణ హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయబోతుంది.
  • దేశవ్యాప్తంగా యువతకు నైపుణ్యశిక్షణ కల్పించి వారి అభివృద్ధికి దోహదపడే విధంగా PM కౌశల్ వికాస్ యోజన పథకం 2015 జూన్ 25న ప్రారంభించబడింది.

09. సంజీవని ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన AI ఆధారిత డిజిటల్ ఆరోగ్య సేవ “సంజీవని” ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.ప్రధాన లక్ష్యం: ముందస్తు స్క్రీనింగ్ ద్వారా వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించడం, ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు AI డిజిటల్ హెల్త్ రికార్డుల తయారీలో TATAMD సంస్థ అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది.సంజీవని ప్రాజెక్ట్ అనే కార్యక్రమం ఇప్పటికే కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో అమలు చేయబడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్ను అధికారులు సిద్ధం చేశారు.మరోవైపు నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా పెద్ద రాష్ట్రాల్లో అత్యంత మరియు అత్యల్ప ఆరోగ్యకరమైన రాష్ట్రాలుగా ఒడిశా, పంజాబ్ గుర్తించబడ్డాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి – జగత్ ప్రకాశ్ నడ్డా.

10. లోకమాత అహిల్యాబాయి మాతృశక్తి యోజన పథకం – ఉత్తరప్రదేశ్

  • లోకమాత అహిల్యాబాయి మాతృశక్తి యోజన అనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధ మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకం. దీని కింద అర్హులైన మహిళలకు జీవితకాలం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు.
  • లోకమాత అహిల్యాబాయి మాతృశక్తి యోజన పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సుమారుగా రూ. 225 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
  • మహిళా సాధికారత మరియు వృద్ధుల సంక్షేమం కోసం మరాఠా మాల్వా రాజ్యరాణి, సుపరిపాలన అందించి చరిత్రకెక్కిన లోకమాత అహిల్యాబాయి హోల్కర్ జ్ఞాపకార్థం ఈ పథకానికి ఆమె పేరు పెట్టారు.
  • దేశవ్యాప్తంగా మహిళలకు/ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని తొలుత ఢిల్లీ ప్రభుత్వం 2019వ సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉచిత బస్సు పథకం దేశవ్యాప్తంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉంది.

11. కహో కాళిదాస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గజేంద్ర సింగ్ షెకావత్

  • కేంద్ర కల్చర్ అండ్ టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ‘Kaho Kalidas’ పుస్తకాన్ని న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని యుగల్ జోషి రచించారు.
  • భారత ప్రాచీన సంస్కృత మహాకవి, నాటకకర్త కాళిదాసు జీవితం, వ్యక్తిత్వాన్ని ఆయన సాహిత్య రచనల ఆధారంగా చిత్రీకరించే ప్రయత్నం ఈ పుస్తకంలో చేశారు.
  • కాళిదాసు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రామాణిక చారిత్రక సమాచారం పరిమితంగా ఉందని, ఆయన జీవితం, వ్యక్తిత్వంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.

12. ఈ-శ్రమ్ పోర్టల్‌కు 5 ఏళ్లు

  • అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రారంభించిన ఈ-శ్రమ్ పోర్టల్ 2026 ఆగస్టు 26తో ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది. దీనిని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ 2021 ఆగస్టు 26న ప్రారంభించింది.
  • అసంఘటిత కార్మికుల కోసం భారత్ తొలి ఆధార్-అథెంటికేటెడ్ నేషనల్ డేటాబేస్ ఆఫ్ అన్‌ఆర్గనైజ్డ్ వర్కర్స్ (NDUW)ను ఈ పోర్టల్ ద్వారా రూపొందించారు.
  • నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. నమోదైన ప్రతి కార్మికుడికి ప్రత్యేకమైన 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయిస్తారు.
  • 2026 ఆగస్టు 18 నాటికి 31.89 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్‌లో నమోదయ్యారు.
  • ఒకే వేదిక ద్వారా సంక్షేమ ప్రయోజనాలను అందించేందుకు 15 సామాజిక భద్రత, సంక్షేమ పథకాలను ఈ పోర్టల్‌తో అనుసంధానించారు.
  • ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ (PM-SYM), నేషనల్ కెరీర్ సర్వీస్, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ వంటి పథకాలు, సేవలను పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.
  • ఈ పోర్టల్ 22 భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. వలస కార్మికులు, నిర్మాణ కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లను కూడా కవర్ చేస్తుంది. వలస కార్మికుల కుటుంబ వివరాలను కూడా నమోదు చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాల పోర్టబిలిటీకి తోడ్పడుతుంది.

13. 10 ఏళ్లలో 21.76 మిలియన్ హెక్టార్ల క్షీణించిన భూమిని పునరుద్ధరించిన భారత్

  • భారత్ 2011–2020 మధ్య పదేళ్ల కాలంలో 21.76 మిలియన్ హెక్టార్ల క్షీణించిన, అటవీ విస్తీర్ణం కోల్పోయిన భూమిని పునరుద్ధరణ పరిధిలోకి తీసుకొచ్చింది.
  • మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో జరిగిన యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (COP-17)లో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ ఈ వివరాలను వెల్లడించారు.
  • ల్యాండ్ రిస్టోరేషన్ ద్వారా క్షీణించిన భూముల్లో పర్యావరణ ఆరోగ్యం, వృక్ష సంపద, నేల నాణ్యత, ఉత్పాదక సామర్థ్యాన్ని తిరిగి మెరుగుపరుస్తారు.
  • ఈ చర్యలు భూక్షీణత, ఎడారీకరణ, జీవవైవిధ్య నష్టం తగ్గించడంతో పాటు ఎకోసిస్టమ్ రెసిలియెన్స్ను పెంచుతాయి.
  • 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల క్షీణించిన, అటవీ విస్తీర్ణం కోల్పోయిన భూమిని పునరుద్ధరించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ల్యాండ్ డిగ్రదేషన్ న్యూట్రాలిటీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ సాధనకు కూడా తోడ్పడుతుంది.

Related Posts

భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే, సురక్షితమైన మరియు నాణ్యమైన హైవే మౌలిక సదుపాయాల కోసం “చింతన్ శిబిర్ 2026”

“చింతన్ శిబిర్ 2026” దేశంలో హైవే మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పంపిణీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు అమలు చేసే ఏజెన్సీల సీనియర్ ప్రతినిధులతో కలిసి కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ…

భారత్‌లో మొట్టమొదటి 5.56 కి.మీ. ఫ్రీ-స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) లింక్ విజయవంతం

భారత్‌లో మొట్టమొదటి 5.56 కి.మీ. ఫ్రీ-స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) లింక్ విజయవంతం పీఐబీ ఢిల్లీ: క్యూన్యూ ల్యాబ్స్ (QNu Labs), భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N) మరియు ఐఐటీ గాంధీనగర్ సంయుక్తంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *