Daily Current Affairs – 02 ఆగస్ట్ 2026 కరెంటు అఫైర్స్

01. జులై 2026లో స్థూల జీఎస్టీ వసూళ్లు ₹2.11 లక్షల కోట్లు

  • జులై 2026లో దేశంలోని స్థూల జీఎస్టీ వసూళ్లు 15.4 శాతం పెరిగి ₹2.11 లక్షల కోట్లకు చేరాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇది మూడో అత్యధిక నెలవారీ వసూళ్లు.
  • అత్యధిక వసూళ్లు 2026 ఏప్రిల్లో ₹2.43 లక్షల కోట్లు, 2025 ఏప్రిల్లో ₹2.37 లక్షల కోట్లు నమోదయ్యాయి.
  • దేశీయ విక్రయాలపై జీఎస్టీ వసూళ్లు 10.1 శాతం పెరిగి ₹1.44 లక్షల కోట్లకు, దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు 29 శాతం పెరిగి ₹66,511 కోట్లకు చేరాయి. జీఎస్టీ రిఫండ్లు 13.1 శాతం పెరిగి ₹29,968 కోట్లకు చేరగా, నికర జీఎస్టీ వసూళ్లు ₹1.81 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
  • జులై 2026లో తెలంగాణకు ₹4,550 కోట్లు (17% వృద్ధి), ఆంధ్రప్రదేశ్కు ₹3,268 కోట్లు (12% వృద్ధి) జీఎస్టీ ఆదాయం లభించింది. 2026 జులై వరకు తెలంగాణకు ₹17,437 కోట్లు (20% వృద్ధి), ఆంధ్రప్రదేశ్కు ₹13,246 కోట్లు (21% వృద్ధి) జీఎస్టీ ఆదాయం నమోదైంది.

గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)

  • అమలు: 2017 జూలై 1
  • రాజ్యాంగ ఆధారం: 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 2016
  • అమలు చేసే సంస్థ: జీఎస్టీ కౌన్సిల్
  • ప్రధాన లక్ష్యం: దేశవ్యాప్తంగా ఏకీకృత పరోక్ష పన్ను వ్యవస్థను అమలు చేయడం.

జీఎస్టీ కౌన్సిల్

  • ఏర్పాటు: 2016
  • అధ్యక్షులు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
  • రాజ్యాంగ నిబంధన: అధికరణం 279ఏ.

02. ISSF ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం

  • ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ (10m Air Rifle Mixed Team) విభాగంలో భారత్‌కు కాంస్య పతకం లభించింది.

భారత జోడీ సోనం ఉత్తమ్ మస్కర్ (Sonam Uttam Maskar) మరియు హిమాన్షు ధిల్లాన్ (Himanshu Dhillon) ఈ కాంస్య పతకాన్ని సాధించారు

03. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ టెలికాం ఎక్సలెన్స్ అవార్డులు–2025 ప్రధానం

  • కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MDoNER) మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ టెలికాం ఎక్సలెన్స్ అవార్డులు–2025ను ప్రధానం చేశారు.
  • టెలికాం సాంకేతిక రంగంలో విశిష్ట సేవలు, వినూత్న ఆవిష్కరణలకు గుర్తింపుగా ఈ అవార్డులను రెండు సంస్థలకు అందజేశారు.

 అవార్డు గ్రహీతలు:

  1. Amantya Technologies Pvt. Ltd., Finaara
  • IMC (India Mobile Congress) 2026 థీమ్
  • కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా IMC 2026 యొక్క అధికారిక థీమ్‌ను ఆవిష్కరించారు.

 థీమ్: “Scale without Boundaries”

  • India Mobile Congress (IMC) ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫోరంగా గుర్తింపు పొందింది.

04. ప్రో-కాంపిటీటివ్ సంస్కరణల్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 82వ స్థానం నుంచి 57వ స్థానానికి చేరిక

  • 2026లో విడుదలైన “India’s Next Growth Frontier: Reducing Anti-Competitive Market Distortions to Build on India’s 2010–2023 Reform Progress” నివేదికలో ప్రో-కాంపిటీటివ్ (Pro-Competitive) సంస్కరణల అమలులో భారత్ ప్రపంచ ర్యాంకింగ్‌లో 82వ స్థానం నుంచి 57వ స్థానానికి చేరుకుంది.
  • ఈ పురోగతి 2010–2023 మధ్యకాలంలో అమలు చేసిన నిర్మాణాత్మక (Structural) మరియు పోటీని ప్రోత్సహించే (Pro-Competition) సంస్కరణల ఫలితంగా గుర్తించబడింది.
  • మార్కెట్ డిస్టార్షన్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ (Market Distortions Performance Index)
  • ఈ నివేదికలో Market Distortions Performance Index ఆధారంగా దేశాల పనితీరును అంచనా వేశారు.
  • ఈ సూచీలో భారత్ 57వ స్థానంలో నిలిచింది.

ఈ సూచీ మూడు ప్రధాన ప్రమాణాల ఆధారంగా దేశాలను అంచనా వేస్తుంది:

1. ఆస్తి హక్కుల రక్షణ (Protection of Property Rights)

2. దేశీయ పోటీ (Domestic Competition)

3. అంతర్జాతీయ పోటీ (International Competition)

06. మహాత్మా జ్యోతిరావు ఫూలే జన ఆరోగ్య యోజన (MJPJAY) – మహారాష్ట్ర క్యాష్‌లెస్ ఆరోగ్య బీమా పథకం

  • జ్యోతిరావు ఫూలే జన ఆరోగ్య యోజన (MJPJAY) మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్యాష్‌లెస్ ఆరోగ్య బీమా పథకం.
  • ఈ పథకం 2012లో ప్రారంభించబడింది.
  • ప్రారంభంలో దీనిని రాజీవ్ గాంధీ జీవందాయి ఆరోగ్య యోజన (Rajiv Gandhi Jeevandayee Arogya Yojana) అని పిలిచేవారు. అనంతరం దీనికి మహాత్మా జ్యోతిరావు ఫూలే జన ఆరోగ్య యోజనగా పేరు మార్చారు.

పేద మరియు బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం

07. మహిళల ఆధ్వర్యంలో సౌర పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ‘ద్వీప్తి (DWEEPTI) యోజన’ ప్రారంభం

  • ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం DWEEPTI (Decentralised Women Empowerment on Energy and Policy for Transformative Inclusion) యోజనను ప్రారంభించింది.
  • ఇది భారతదేశంలోనే మహిళల ఆధ్వర్యంలో అమలవుతున్న తొలి వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన (Distributed Renewable Energy) విధానం.
  • గ్రామీణ స్వయం సహాయక సంఘాల (Self-Help Groups – SHGs) మహిళలను సౌర పారిశ్రామికవేత్తలుగా (Solar Entrepreneurs) తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
  • ఈ పథకం ద్వారా 5,000 సౌర వ్యాపార సంస్థలు మరియు 50,000 గ్రీన్ ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

08. అత్యంత చలికాల పరిస్థితుల్లో సైనిక కార్యకలాపాల కోసం స్వదేశీ ‘ఎక్స్‌ట్రీమ్ వెదర్ గ్రేడ్ (XWG) డిజెల్’ను ఆవిష్కరించిన భారత సైన్యాధిపతి

  • భారత సైన్యాధిపతి (Chief of the Army Staff – COAS) జనరల్ ధీరజ్ సేథ్ (General Dhiraj Seth) న్యూఢిల్లీలో స్వదేశీ ఎక్స్‌ట్రీమ్ వెదర్ గ్రేడ్ (XWG) డిజెల్‌ను ఆవిష్కరించారు.
  • ఈ ప్రత్యేక ఇంధనాన్ని భారత సైన్యం మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (Oil Marketing Companies – OMCs) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
  • ఇది అత్యంత చలి, మంచుతో కప్పబడిన ప్రాంతాలు మరియు ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సైనిక వాహనాల పనితీరును మెరుగుపరచేందుకు రూపొందించబడింది.
  • XWG డిజెల్ మైసస్ 42°C (-42°C) వరకు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది.

09. PMSG–MBY కింద భారత్‌లో రూఫ్‌టాప్ సోలార్ విస్తరణకు ADB నుంచి 850 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణం

  • ఆసియా అభివృద్ధి బ్యాంక్ (Asian Development Bank – ADB) భారత్‌లో ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana – PMSG–MBY) అమలుకు 850 మిలియన్ అమెరికన్ డాలర్ల (USD 850 Million) రుణాన్ని ఆమోదించింది.
  • ఈ నిధులు దేశవ్యాప్తంగా రూఫ్‌టాప్ సోలార్ (Rooftop Solar) వ్యవస్థల ఏర్పాటు వేగవంతం చేయడానికి ఉపయోగించబడతాయి.
  • 2026–27 ఆర్థిక సంవత్సరం (FY27) నాటికి 30 గిగావాట్ల (GW) సమీకృత రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యం సాధించడం.

10. కెనడాకు బీహార్ మఖానా ఎగుమతి చేసిన భారత్

  • బీహార్ రాష్ట్రంలోని దర్భంగా (Darbhanga) నుంచి 7 మెట్రిక్ టన్నుల విలువ ఆధారిత (Value-added) ఫ్లేవర్డ్ మఖానా (Flavoured Makhana)ను కెనడాకు ఎగుమతి చేసింది.

ఈ సరుకును గుజరాత్‌లోని ముంద్రా పోర్టు (Mundra Port) ద్వారా రెండు కంటైనర్లలో కెనడాకు పంపించారు

11. పశ్చిమ ఆసియా జలమార్గాల్లో నౌకల భద్రత కోసం సౌదీ అరేబియా సహా 14 దేశాల ‘బహుళజాతి సముద్ర రక్షణ కూటమి’ ఏర్పాటు

  • 2026 జులైలో, సౌదీ అరేబియాతో పాటు మొత్తం 14 దేశాలు కలిసి Multinational Maritime Defence Alliance (బహుళజాతి సముద్ర రక్షణ కూటమి) ఏర్పాటును ప్రకటించాయి.
  • పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలు, సముద్ర మార్గాలు మరియు ఇంధన సరఫరా మార్గాల భద్రతను బలోపేతం చేయడం ఈ కూటమి ప్రధాన లక్ష్యం.
  • ఈ కూటమి ప్రధానంగా Red Sea, Bab el-Mandeb Strait, Gulf of Aden జలమార్గాల భద్రతపై దృష్టి సారిస్తుంది.
  • వ్యవస్థాపక సభ్య దేశాలు (Founding Members):
  • ఈ కూటమిలో మొత్తం 14 దేశాలు సభ్యులుగా ఉన్నాయి సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్, యెమెన్, నైజీరియా, సూడాన్, జిబౌటి, టర్కియే (Turkiye), పాకిస్తాన్, బంగ్లాదేశ్, సోమాలియా.

12. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా వర్షా అశోక్ అగ్లావే

  • వర్షా అశోక్ అగ్లావే 2026 జూలై 31న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 54వ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు.
  • 176 సంవత్సరాల చరిత్రలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు నాయకత్వం వహించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
  • ఆమె 2024 జూలై 27 నుంచి 2026 జూలై 31 వరకు డైరెక్టర్ జనరల్గా పనిచేసిన అసిత్ సాహా స్థానంలో బాధ్యతలు చేపట్టారు.
  • 1851లో స్థాపించబడిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశంలో భౌగోళిక పటాల తయారీ, ఖనిజ వనరుల అంచనా, భౌగోళిక శాస్త్ర పరిశోధనలు నిర్వహించే ప్రముఖ సంస్థ. గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ పారిశ్రామిక, ఇంధన రంగాలకు అవసరమైన వ్యూహాత్మక, కీలక ఖనిజాల అన్వేషణ కూడా నిర్వహిస్తుంది.

13. నౌరు అధికారికంగా ‘రిపబ్లిక్ ఆఫ్ నావోరో’గా పేరు మార్పు

  • పసిఫిక్ మహాసముద్ర ద్వీప దేశమైన నౌరు అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ నావోరోగా పేరు మార్చుకుంది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణను 2026 మేలో ఆమోదించారు. అధ్యక్షుడు డేవిడ్ అడీయాంగ్ 2026 జూలై 31న ఈ పేరు మార్పును అధికారికంగా ప్రకటించారు.
  • నావోరోఆ దేశానికి చెందిన స్థానిక పేరు, కాగా నౌరువలస పాలన కాలంలో ఏర్పడిన పేరు.
  • దేశానికి అధికారిక సంక్షిప్త పేరు నావోరో‘, దేశ సంకేతం (ఎన్ఆర్ఓ) యథాతథంగా కొనసాగుతుంది. ఆ దేశ పౌరులను డేయి- నావోరోగా పిలుస్తారు.
  • 2026 జూన్ 26న ఈ మార్పును ఐక్యరాజ్యసమితికి అధికారికంగా తెలియజేయగా, దాని రికార్డులను నవీకరిస్తోంది.

  • నావోరో విస్తీర్ణ పరంగా వాటికన్ సిటీ, మొనాకో తర్వాత ప్రపంచంలో మూడవ అతిచిన్న సార్వభౌమ దేశం. దీనికి అధికారిక రాజధాని లేదు; యారెన్ జిల్లా పరిపాలనా కేంద్రంగా కొనసాగుతోంది.

14. రాజస్థాన్లో ‘రోటర్ క్లాప్–3’ విన్యాసం నిర్వహించిన భారత వైమానిక దళం

  • భారత వైమానిక దళం (ఐఏఎఫ్) రాజస్థాన్లో రోటర్ క్లాప్–3’ విన్యాసాన్ని నిర్వహించింది.
  • ఈ విన్యాసం కౌంటర్అన్ మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ (యూఏఎస్)అనే అంశంపై నిర్వహించబడింది.
  • ఈ విన్యాసంలో భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ రంగాలు పాల్గొని, మానవరహిత వైమానిక వ్యవస్థల వల్ల ఏర్పడుతున్న నూతన వైమానిక ముప్పులను ఎదుర్కొనే కార్యాచరణ విధానాలను పరీక్షించాయి. ఈ విన్యాసం ద్వారా డ్రోన్ వ్యతిరేక చర్యల్లో హెలికాప్టర్ విభాగాల సమన్వయం, కార్యాచరణ సన్నాహకతను బలపేతం చేశారు.

రోటర్ క్లాప్ 3′ విన్యాసం

  • నిర్వహించిన సంస్థ: భారత వైమానిక దళం
  • ప్రధాన లక్ష్యం: డ్రోన్లు, ఇతర నూతన వైమానిక ముప్పులను ఎదుర్కొనే హెలికాప్టర్ కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడం.

15. అమలులోకి యాంటీ పేపర్ లీక్ చట్టం – 2026

  • పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ యాక్ట్–2026కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించడంతో, అధికారిక గెజిట్ నోటిఫికేషన్ అనంతరం చట్టం అమలులోకి వచ్చింది.
  • ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, పేపర్ లీకేజీ కేసుల విచారణను రెండు నెలల్లో పూర్తి చేయాలి.
  • లీకేజీకి పాల్పడిన వారికి 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా ₹50 లక్షల జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృతంగా నేరానికి పాల్పడితే 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు గరిష్టంగా ₹10 కోట్లు జరిమానా విధిస్తారు.
  • ప్రశ్నపత్రాల లీకేజీ, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, నకిలీ వెబ్ సైట్ల ఏర్పాటు, నకిలీ గుర్తింపు కార్డుల జారీ వంటి 15 రకాల నేరాలకు ఈ చట్టం వర్తిస్తుంది.

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్) యాక్ట్

  • అసలు చట్టం: 2024
  • సవరణ: 2026
  • అమలు చేసే మంత్రిత్వ శాఖ: సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ
  • ప్రధాన లక్ష్యం: ప్రజా పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి పారదర్శకత, విశ్వసనీయతను కాపాడడం.

16. ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (ఈపీఐ)–2026 విడుదల

  • ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (ఈపీఐ)-2026లో 177 దేశాల పర్యావరణ సుస్థిరతను అంచనా వేశారు.
  • ఈ సూచీని యేల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ (సీఐఈఎస్ఐఎన్), కొలంబియా విశ్వవిద్యాలయం, యేల్ సెంటర్ ఫర్ జియోస్పేషియల్ సొల్యూషన్స్ సంయుక్తంగా రూపొందించాయి.
  • 12 పర్యావరణ విభాగాల్లోని 47 సూచికల ఆధారంగా వాతావరణ మార్పు, పర్యావరణ వ్యవస్థల స్థితి, పర్యావరణ ప్రజారోగ్యం వంటి అంశాలను అంచనా వేస్తుంది.
  • ఎస్టోనియా 74.79 స్కోరుతో మొదటి స్థానం, భారత్ 22.46 స్కోరుతో 176వ స్థానం, లావోస్ 177వ (చివరి) స్థానంలో నిలిచాయి.
  • 2022 నుంచి వరుసగా భారత్ EPIలో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన ఐదు దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది.

భారత్ అత్యంత బలహీనంగా ప్రదర్శించిన విభాగాలు

  • పర్యావరణ ఆరోగ్యం (Environmental Health)
  • వాయు నాణ్యత (Air Quality) – 174వ స్థానం
  • జీవవైవిధ్యం (Biodiversity) – 174వ స్థానం

భారత్ మెరుగ్గా ప్రదర్శించిన విభాగాలు

  • వాతావరణ మార్పు (Climate Change) – 130వ స్థానం
  • వ్యర్థాల నిర్వహణ (Waste Management) – 141వ స్థానం
  • పారిశుద్ధ్యం (Sanitation) – 141వ స్థానం

టాప్-3 దేశాలు (2026)

  1. 1వ స్థానం: ఎస్టోనియా – 74.79
  • 2వ స్థానం: లక్సెంబర్గ్ – 73.88
  • 3వ స్థానం: యునైటెడ్ కింగ్డమ్ – 71.89

పర్యావరణ పనితీరు సూచిక (Environmental Performance Index – EPI) 2026

  • విడుదల చేసే సంస్థలు: యేల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ (YCELP), యేల్ విశ్వవిద్యాలయం & కొలంబియా విశ్వవిద్యాలయం (CIESIN).
  • ఎన్ని సంవత్సరాలకు: ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి (Biennial).
  • మొదటి విడుదల: 2002
  • 2026 ఎడిషన్: 10వ ఎడిషన్

17. తలసరి ఆదాయంలో కర్ణాటక మొదటి, తెలంగాణ రెండో స్థానం

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ’ ప్రకారం తలసరి ఆదాయంలో కర్ణాటక మొదటి, తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి.
  • కర్ణాటక తలసరి ఆదాయం 2024–25లో ₹3,86,182 నుంచి 2025–26లో ₹4,33,326కి పెరిగి 12.21 శాతం వృద్ధి నమోదు చేసింది.
  • తెలంగాణ తలసరి ఆదాయం 2024–25లో ₹3,80,031 నుంచి 2025–26లో ₹4,18,931 (సుమారు ₹4.19 లక్షలు)కి పెరిగి 10.23 శాతం వృద్ధి నమోదు చేసింది.
  • ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ₹2,66,699 నుంచి ₹2,94,507కి పెరిగి 10.42 శాతం వృద్ధి సాధించింది.

Related Posts

Daily Current Affairs – 01 ఆగస్ట్ 2026 కరెంట్ అఫైర్స్

01. 2030 నాటికి 100 కోట్ల 5G వినియోగదారుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న భారత్ • భారత్ 2030 నాటికి 100 కోట్లు (1 Billion) మంది 5G వినియోగదారులను కలిగి ఉండే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. • 2022 అక్టోబర్ 1న ప్రారంభమైన…

Daily current Affairs Telugu- 13 ఆగష్టు 2026 కరెంట్ అఫైర్స్

1.ఉదార శక్తి విన్యాసాలు 2026 ఉదార శక్తి 2026విన్యాసాలు భారత వైమానిక దళం మరియు రాయల్ మలేషియన్ వైమానిక దళం మధ్య 2026 ఆగస్టు 10 నుండి 14 వరకు మలేషియాలోని సుబాంగ్ ఎయిర్ బేస్ వద్ద జరిగిన ద్వైపాక్షిక వైమానిక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *